తమిళనాడు గవర్నర్ ను కలిసిన విజయ్.. ఎందుకంటే..?

విజయ్ ను ప్రశంసించిన బీజేపీ రాష్ట్ర చీఫ్ అన్నామలై;

By :  491
Update: 2024-12-30 11:08 GMT

తమిళనాడులోని అన్నయూనివర్శిటీలో మహిళా విద్యార్థినిపై జరిగిన అత్యాచారం ఘటనపై రాష్ట్ర వ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో తమిళనటుడు, రాజకీయ నాయకుడు విజయ్ సోమవారం గవర్నర్ ఆర్ ఎన్ రవిని కలిశారు. మహిళల భద్రతకు చర్యలు తీసుకోవాలని ఆయన గవర్నర్ ను కోరినట్లు తమిళగ వెట్రిగ కజగం పార్టీ వర్గాలు తెలిపాయి.

టీవీకే వ్యవస్థాపకుడు చెన్నైలోని రాజ్‌భవన్‌లో గవర్నర్ రవిని కలిసి వినతి పత్రం సమర్పించారు. ఈ సమస్యపై రాజ్‌భవన్‌ తలుపులు తట్టినందుకు విజయ్‌ని బీజేపీ ప్రశంసించింది. పార్టీ తన డిమాండ్లలో శాంతిభద్రతలను 'రక్షించడం' కూడా ప్రధాన అంశంగా పేర్కొంది.
"మా మెమోరాండమ్‌లో, తమిళనాడులో శాంతిభద్రతలను పరిరక్షించడానికి చర్యలు తీసుకోవాలని మేము కోరాము, అలాగే అన్ని ప్రదేశాలలో మహిళల భద్రత కోసం చర్యలు తీసుకోవాలని కోరుతున్నాము" అని TVK ప్రధాన కార్యదర్శి N ఆనంద్ ఒక ప్రకటనలో తెలిపారు.
అలాగే ఫెంజాల్ తుఫాను సహాయం కోసం కేంద్ర నిధులను విడుదల చేయడానికి చర్యలు తీసుకోవాలని కూడా పార్టీ ఒత్తిడి చేస్తుందని ఆ ప్రకటనలో పేర్కొంది. బాధిత ప్రజలకు ఇంకా సాయం అందలేదని, తమిళనాడు కోరిన మొత్తాన్ని కేంద్రం విడుదల చేయాలని పేర్కొంది. 2,000 కోట్ల మధ్యంతర ఉపశమనం కల్పించాలని గతంలో రాష్ట్ర ప్రభుత్వం కోరింది.
అంతకుముందు రోజు విజయ్ .. రాష్ట్రంలో మహిళలు సురక్షితంగా ఉండేందుకు ఎవరిని అడగాలని ప్రశ్నించారు. "ప్రియమైన సోదరీమణులు" అని సంబోధిస్తూ, తన పార్టీ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో చేతిలో రాసిన లేఖను ఆయన పోస్టు చేశారు. అందులో "మనను పాలించే వారిని మనం ఎన్నిసార్లు అడిగినా స్పందించడం లేదు. ఈ లేఖ దాని కోసమే. ప్రతిరోజూ మహిళలు దౌర్జన్యాలు, దుష్ఫ్రప్రవర్తన, లైంగిక నేరాలకు గురవుతున్నారు. వారి సోదరుడిగా ఆ బాధలను చూసి వివరించలేని వ్యథకు గురవుతున్నా’’ TVK నాయకుడు లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు.
మిమ్మల్ని సోదరుడిగా కాపాడతాను.. మీరు చదువుపై దృష్టి పెట్టండి. మేము త్వరలో సురక్షితమైన తమిళనాడును సృష్టిస్తామని లేఖలో ఆయన మహిళలకు హమీ ఇచ్చారు. కాగా, గవర్నర్‌తో విజయ్‌ భేటీని టీఎన్‌బీజేపీ నేత అన్నామలై స్వాగతించారు. సోషల్ మీడియాలో చేసిన ఓ పోస్ట్‌లో.. లైంగిక వేధింపుల కేసును దారి మళ్లించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నామలై ఆరోపించాడు.
"మా సోదరికి న్యాయం జరిగేలా చూసేందుకు, అన్ని పార్టీల కార్యకర్తలు సోదరుడిలా ముందుకు రావాలి" అని పోస్టులో కోరారు. డీఎంకే హయాంలో మహిళలకు భద్రత లేదంటూ విజయ్‌ గవర్నర్‌ను కలవడాన్ని బీజేపీ స్వాగతిస్తున్నట్లు అన్నామలై తెలిపారు.



Tags:    

Similar News