ధర్మస్థల: కొత్త ప్రదేశంలో దొరికిన మానవ అవశేషాలు
విజిల్ బ్లోయర్ చెప్పింది నిజమే అని ధృవీకరణ;
By : The Federal
Update: 2025-08-05 09:06 GMT
శ్వేత త్రిపాఠి
ధర్మస్థలలో తాజాగా జరుగుతున్న తవ్వకాలలో కొత్తగా అస్థి పంజర అవశేషాలు దొరకడం సంచలనంగా మారింది. ఈ తవ్వకాలలో చిరిగిన చీర, పాతిపెట్టబడిన అవశేషాలు దొరికాయి. ఆగష్టు 4న ప్రత్యేక దర్యాప్తు బృందం నేత్రవతి నదీకి సమీపంలోని 11 వ తవ్వకాల స్థలం సమీపంలో ఇవి లభించాయి.
అంతకుముందు జూలై 31న సిట్ ఆరవ స్థలంలో తవ్వకాలు జరిపి 15 అస్థిపంజర అవశేషాలను కనుగొంది. వీటిలో విరిగిన పుర్రెలు, ఏటీఎం కార్డులు, పాన్ కార్డు లాంటివి ఉన్నాయి.
దొరికిన అవశేషాలు అన్ని కూడా పురుషులకు సంబంధించినవని పరిశోధకులు అనుమానిస్తున్నారు. ఈ అవశేషాలు అన్ని కూడా దశాబ్ధాల పాటు ఇక్కడ జరిగిన నేరాలను దీర్ఘకాలంగా, వ్యవస్థాగతంగా కప్పిపుచ్చే ప్రయత్నం జరుగుతుందనే అనుమానాలను మరింత బలపరుస్తుంది.Full View
1995- 2014 మధ్య ధర్మస్థలంలో 100కి పైగా మృతదేహాలను ఖననం చేశారని ఆరోపిస్తూ జూన్ లో 48 ఏళ్ల మాజీ పారిశుద్ధ్య కార్మికుడు ముందుకు వచ్చిన తరువాత ఈ కేసు వేగం ఫుంజుకుంది. ఇటీవల పరిశోధనలు అతని వాదనలకు మద్దతు ఇచ్చే కచ్చితమైన ఆధారాలను అందిస్తున్నాయి.
విజిల్ బ్లోయర్ ఏం చెప్పాడు..
బాధితుల్లో ఎక్కువ మంది మహిళలు, మైనర్లేనని వారిలో చాలామంది లైంగిక దాడి, గొంతు కోసి చంపిన సంకేతాలు కనిపించాయని పారిశుద్ధ్య కార్మికుడు పేర్కొన్నాడు.
ఈ మృతదేహాలను గుర్తు తెలియని ప్రదేశంలో ఖననం చేసినట్లు ఆరోపించాడు. ఇవన్నీ తన చేత బలవంతంగా చేయించినట్లు వెల్లడించాడు. ఆయన సాక్ష్యం ఆధారంగా సిట్ ఇప్పటి వరకూ 13 ప్రదేశాలను గుర్తించి, తవ్వకాలు ప్రారంభించింది. వీటిలో ఇప్పటి వరకూ 10 ప్రదేశాలతో తవ్వకాలు పూర్తి అయ్యాయి.
జూలై 19న ఏర్పాటైన స్పెషల్ ఇన్వేస్టిగేషన్ టీమ్(సిట్) ముందుగా మొదటి స్థలంలో ఒక పాన్ కార్డు, రెండు ఏటీఎం కార్డులను కనుగొంది. ఇవి బెంగళూర్ సమీపంలో నివాసం ఉంటున్న సిద్ధ లక్ష్మమ్మ, ఆమె కుమారుడు సురేష్ చెందినవని, వారు ఇద్దరు కూడా 2025 లో కామెర్లతో చనిపోయినట్లు నిర్దారణకు వచ్చారు.
ధర్మస్థలకు వచ్చినప్పుడు ఈ వస్తువులు పొగొట్టుకున్నట్లు అధికారులు భావిస్తున్నారు. అయితే అవి అనుమానంగా ఉన్న స్మశానంలోకి ఎలా చేరాయన్నదీ సస్పెన్స్ గా మారింది.
11 తవ్వకం స్థలంలో దొరికిన చీర, అవశేషాలు తప్పిపోయిన బాధితుల కుటుంబాలలో ఆశలు చిగురిస్తున్నాయి. ఎత్తైన అటవీ ప్రాంతంలో ఖననం చేసినట్లు పంచాయతీ అధికారులు చేస్తున్న వాదనలను విజిల్ బ్లోయిర్ గుర్తించిన ప్రదేశాలు తప్పని చెబుతున్నాయి.
న్యాయం కోసం...
ప్రముఖ న్యాయవాదీ, మానవ హక్కుల కార్యకర్త ఎస్ బాలన్ ‘ది ఫెడరల్’ తో మాట్లాడారు. ‘‘గతంలో చాలా సంవత్సరాలుగా తప్పిపోయిన వ్యక్తుల రహస్యం చివరకు సిట్ దర్యాప్తు కొనసాగుతున్న కొద్దీ ధర్మస్థలానికి సంబంధించిన లింక్ లను కలుపుతోంది’’ అన్నారు.
40 ఏళ్లలో జరిగిన అనేక మిస్సింగ్ కేసులు, సరైన దర్యాప్తు లేకుండా మృతదేహాలను ఖననం చేయడం వంటి వెలుగులోకి తెచ్చాయని ఇవన్నీ కూడా ఇప్పుడు కనెక్ట్ దా డాట్ లా అవుతున్నాయని అభిప్రాయపడ్డారు.
2012 లో 17 ఏళ్ల సౌచన్య అత్యాచారం, హత్య కేసును ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. తప్పిపోయిన తమ బంధువులు, ప్రియమైన స్నేహితుల అవశేషాలు అందులో ఉన్నాయమే అని వారు ఆందోళన చెందుతున్నారు.
సుజాత భట్ వంటి కుటుంబాలు ఇప్పుడు జవాబుదారీతనం, సమాధానాలను డిమాండ్ చేస్తున్నాయి. కొత్త సాక్షి, సామాజిక కార్యకర్త జయంత్ ఈ వాదనలకు మరింత బలంగా చేకూర్చాడు.
ఆగష్టు 2, 2025న సిట్ కు వాంగ్మూలం ఇస్తూ.. తాను 2005 లో ఒక టీనేజీ అమ్మాయి మృతదేహాన్ని కుళ్లిపోయిన స్థితిలో ఖననం చేయడాన్ని తాను చూశానని ఆయన పేర్కొన్నారు. ఆయన చేసిన ప్రకటన ఇలాంటి వాటిపై పారదర్శక దర్యాప్తు కోసం డిమాండ్లను మరింత పెంచింది.
దర్యాప్తులో ఏం జరగబోతోంది..
ప్రస్తుతం సిట్ తవ్వకాలలో ఆధునిక సాంకేతికను ఉపయోగిస్తోంది. భూమిలోకి చొచ్చుకుపోయే రాడార్ ను ఉపయోగిస్తోంది. తడి నేల, నిరంతర వర్షాలు ఉన్నప్పటికీ సత్యాన్ని వెలికి తీయడానికి బృందం శ్రమిస్తోంది.
ఒక అధికారి ఫెడరల్ తో మాట్లాడుతూ.. ఆ విజిల్ బ్లోయర్ అధికారులను గుర్తించబడిన స్థలం నుంచి 100 మీటర్ల దూరంలో ఉన్న ఎత్తైన అటవీ ప్రాంతం వైపు నడిపించాడని, అక్కడ తవ్వాకాలు చేపట్టాలని చెప్పారు.
ఇది అధికారిక పంచాయతీ రికార్డులకు విరుద్దంగా ఉంది. స్థానిక పరిపాలనా సహకారం లేదా నిర్లక్ష్యం గురించి తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తుతుంది. దర్యాప్తు ముగిసి, ఫొరెన్సిక్ దర్యాప్తులు కొనసాగుతున్న కొద్ది, చిరిగిన చీర, అస్థిపంజర అవశేషాలు చివరికి విజిల్ బ్లోయర్ ఆరోపణలు నిజం అని ధృవీకరిస్తున్నాయి. ఇప్పుడు దశాబ్ధాలుగా పూడ్చి పెట్టబడిన బాధాకరమైన సత్యాన్ని వెలికితీస్తాయా అనే దానిపై అందరి దృష్టి కేంద్రీకృతమైంది.