బీహార్‌లో RJD నేత తేజస్వి యాదవ్ హామీల వర్షం..

కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులర్ చేస్తామన్న భారత కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థి..

Update: 2025-10-22 07:45 GMT
Click the Play button to listen to article

బీహార్(Bihar) అసెంబ్లీ ఎన్నికల వేళ.. రాష్ట్రీయ జనతాదళ్ (RJD) నాయకుడు, ఇండియా కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థి తేజస్వి యాదవ్(Tejashwi Yadav) హామీల వర్షం కురిపిస్తున్నారు. తాము ధికారంలోకి వస్తే వివిధ ప్రభుత్వ విభాగాల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులందరినీ రెగ్యులర్ చేస్తామని బుధవారం (అక్టోబర్ 22) ప్రకటించారు. 'జీవిక దీదీ'(Jeevika Didi)లోని దాదాపు 2 లక్షల మంది 'కమ్యూనిటీ మొబిలైజర్లను' కూడా రెగ్యులర్ చేసి, వారికి నెలకు రూ. 30వేత జీతం ఇస్తామని హామీ ఇచ్చారు. 'జీవిక దీదీస్' తీసుకున్న రుణాలపై వడ్డీ మాఫీ చేస్తామని హామీ ఇచ్చారు.

గ్రామీణ పేదల ఆర్థిక సాధికారత కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రపంచ బ్యాంకు సహాయంతో చేపట్టిన బీహార్ గ్రామీణ జీవనోపాధి ప్రాజెక్టు (BRLP)ను స్థానికంగా 'జీవిక' అని పిలుస్తారు. ఈ ప్రాజెక్టుతో సంబంధం ఉన్న మహిళలను 'జీవిక దీదీలు' అని పిలుస్తారు.

243 మంది సభ్యులున్న బీహార్ అసెంబ్లీకి నవంబర్ 6, 11 తేదీల్లో ఎన్నికలు జరుగుతాయి. ఓట్ల లెక్కింపు నవంబర్ 14న జరుగుతుంది. 

Tags:    

Similar News