రాహుల్ క్షమాపణ చెప్పాలి: అమిత్ షా

రెండు రోజుల క్రితం ప్రధాని మోదీ, ఆయన తల్లిపై అనుచిత వ్యాఖ్యలు;

Update: 2025-08-29 16:28 GMT
Click the Play button to listen to article

కాంగ్రెస్(Congress) అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) బీహార్‌(Bihar)లో S.I.Rకు వ్యతిరేకంగా 'ఓటర్ అధికార్ యాత్ర' (Voter Adhikar Yatra) నిర్వహిస్తోన్న విషయం తెలిసిందే. యాత్రలో కొందరు వ్యక్తులు ప్రధాని మోదీ(PM Modi), ఆయన తల్లిపై చేసిన అవమానకర వ్యాఖ్యలకు నిరసనగా శుక్రవారం (ఆగస్టు 29) పాట్నాలోని కాంగ్రెస్ కార్యాలయం వెలుపల బీజేపీ(BJP) నాయకులు, కార్యకర్తలు భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తలు ఘర్షణ పడ్డారు. వీధుల్లో పార్టీ జెండాలతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. రాహుల్, ఆర్జేడీ నాయకుడు తేజస్వి యాదవ్ క్షమాపణల చెప్పాలని బీజేపీ డిమాండ్ చేసింది.

ప్రధాని తల్లిపై అవమానకర పదాలు ఉపయోగించడాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా(Amit Shah) ఖండించారు. శుక్రవారం అసోం గువాహటి రాజ్‌భవన్‌లో బ్రహ్మపుత్రా వింగ్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఆదర్శనీయ మహిళపై అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని భారత ప్రజలు ఎన్నటికీ సహించరని అన్నారు. మోదీ తల్లి నిరుపేద కుటుంబంలో జీవితం గడిపినా.. తన పిల్లలను మాత్రం విలువలతో పెంచారని షా కొనియాడారు. తక్షణం రాహుల్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

కాగా మోదీ తల్లి గురించి మాట్లాడుతున్న వ్యక్తి నుంచి వెంటనే మైక్రోఫోన్‌ను లాక్కున్నారని, ఒక కాంగ్రెస్ యువజన నాయకుడు ఇప్పటికే క్షమాపణ చెప్పారని కాంగ్రెస్ కౌంటర్ ఇచ్చింది.

ఒకరి అరెస్టు..

మోదీ, ఆయన తల్లిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిని అరెస్టు చేయాలని బీజేపీ నేతలు పట్నాలోని కొత్వాలి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు శుక్రవారం ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.

Tags:    

Similar News