మన నేల కోసం కలిసి నడుద్దాం

యువతీ, యువకులు సేవలు అందించే అవకాశాన్నిజనసేన కల్పిస్తుందని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.

Update: 2025-10-17 15:43 GMT

ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తన పార్టీ కార్యక్రమాలను వినూత్న రీతిలో నిర్వహించేందుకు శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమాలలో ప్రధానంగా యువతను భాగస్వామ్యం చేయాలని భావిస్తున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికే ఓ సారి సేనతో జనసేనాని కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సారి ఆ పేరును కాస్త పొడిగించి "సేనతో సేనాని - మన నేల కోసం కలిసి నడుద్దాం" పేరుతో నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. ఈ కార్యక్రమం ద్వారా ఔత్సాహిక యువతీ, యువకులు తమకు నచ్చిన అంశాన్ని ఎంచుకుని సేవలు అందించే అవకాశాన్ని ఈ వేదిక కల్పించనుంది. మార్పు కోరుకుంటే రాదు - మార్పు కోసం ప్రయత్నిస్తే వస్తుంది. ఈ ప్రయత్నంలో ప్రతీ ఒక్కరూ భాగస్వామ్యం కావాలని ఆకాంక్షిస్తున్నాను. ఈ కార్యక్రమంలో పాలుపంచుకునేందుకు ఈ క్రింద పేర్కొన్న QR కోడ్ స్కాన్ చేసి, లేదా ఈ లింక్ మీద క్లిక్ చేసి ఇప్పుడే రిజిస్టర్ చేసుకోండి అంటూ పవన్ కల్యాణ్ పిలుపు ఇచ్చారు. ఆ మేరకు పవన్ కల్యాణ్ శుక్రవారం సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టారు. 

పవన్ కల్యాణ్ ఏమన్నారంటే.. 

రాజకీయ వ్యవస్థలో నవతరం యువతను భాగస్వామ్యం చేసేందుకు, సమాజంలో మార్పు కాంక్షించే ప్రతీ ఒక్కరికీ వారి వంతు సేవలు మాతృభూమికి అందించే అవకాశం కల్పించేందుకు "సేనతో సేనాని - మన నేల కోసం కలిసి నడుద్దాం" అంటూ ఒక వినూత్నమైన కార్యక్రమాన్నిజనసేన పార్టీ నిర్వహించనుంది. ఈ కార్యక్రమం ద్వారా ఔత్సాహిక యువతీ, యువకులు తమకు నచ్చిన అంశాన్ని ఎంచుకుని సేవలు అందించే అవకాశాన్ని ఈ వేదిక కల్పించనుంది. మార్పు కోరుకుంటే రాదు - మార్పు కోసం ప్రయత్నిస్తే వస్తుంది. ఈ ప్రయత్నంలో ప్రతీ ఒక్కరూ భాగస్వామ్యం కావాలని ఆకాంక్షిస్తున్నాను. ఈ కార్యక్రమంలో పాలుపంచుకునేందుకు ఈ క్రింద పేర్కొన్న QR కోడ్ స్కాన్ చేసి, లేదా ఈ లింక్ మీద క్లిక్ చేసి ఇప్పుడే రిజిస్టర్ చేసుకోండి. అంటూ ట్విటర్ వేదికగా పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. 

Tags:    

Similar News