Rahul Gandhi | నాపై బీజేపీ ఎంపీలు చేసిన వ్యాఖ్యలను తొలగించండి

లోక్‌సభా ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ బుధవారం స్పీకర్ ఓం బిర్లాతో సమావేశమయ్యారు. సభల్లో తనపై బీజేపీ ఎంపీలు చేసిన వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని కోరారు.;

Update: 2024-12-11 11:10 GMT

లోక్‌సభా ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ బుధవారం స్పీకర్ ఓం బిర్లాతో సమావేశమయ్యారు. సభల్లో తనపై బీజేపీ ఎంపీలు చేసిన అవమానకర వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని కోరారు. వ్యాపారవేత్త గౌతమ్ అదానీ గురించి చర్చ జరగడం ఇష్టం లేకనే బీజేపీ ఎంపీలు తనపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని చెప్పారు. డిసెంబరు 13 నుంచి లోక్‌సభలో రాజ్యాంగబద్ధంగా చర్చ జరగాలని తాను, తన పార్టీ కోరుతున్నామని, అది తమ బాధ్యత కానప్పటికీ సభ సక్రమంగా జరిగేలా చూస్తామని రాహుల్‌ చెప్పారు.

అంతకుముందు రోజు రాహుల్‌పై బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే చేసిన వ్యాఖ్యలను రికార్డు నుంచి తొలగించాలని కాంగ్రెస్ ఉపనేత గౌరవ్ గొగోయ్ స్పీకర్‌కు లేఖ రాశారు.

"నేను స్పీకర్‌తో సమావేశమయ్యా. నాపై చేసిన అవమానకర వ్యాఖ్యలను తొలగించమని కోరాను. స్పీకర్ పరిశీలిస్తానని చెప్పారు. వారు (బీజేపీ) నాపై నిరాధార ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. కాని మేము సభను సజావుగా జరగాలని కోరుకుంటున్నాం. అదానీ సమస్యపై చర్చకు ఒప్పుకోరు. అయితే మేము ఆ అంశాన్ని వదిలిపెట్టం’’ అని చెప్పారు రాహుల్.

జార్జ్ సోరోస్ వివాదం..

బీజేపీ ఎంపీలు నిషికాంత్ దూబే కాంగ్రెస్‌పై మండిపడ్డారు. కాంగ్రెస్‌కు, హంగేరియన్ వ్యాపారవేత్త జార్జ్ సోరోజ్ మధ్య సంబంధాలు ఏంటని ప్రశ్నించారు. దీనిపైన అధికార, ప్రతిపక్షాల మధ్య మాటలయుద్ధం జరుగుతోంది. ఇకపోతే పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభమైనప్పట్నుంచి వాయిదాల పర్వం కొనసాగుతూనే ఉంది. అదానీ వ్యవహారం, సంభాల్ హింసపై చర్చించాలని పట్టుబడుతున్నాయి.

Tags:    

Similar News