‘‘కుంభమేళాలలో మూడు లక్షల కోట్ల ఆర్థిక కార్యకలాపాలు’’
టీ స్టాల్ కు సగటున రోజుకు రూ. 30 వేలు, పూరి బండికి సగటున రోజుకు రూ. 20 వేల ఆదాయం;
By : Praveen Chepyala
Update: 2025-04-02 05:36 GMT
ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక పండగ అయిన మహాకుంభమేళా కొన్ని రోజుల కింద వైభవంగా ప్రారంభం అయి, అంతే గొప్పగా ముగిసిన సంగతి తెలిసిందే.
ప్రయాగ్ రాజ్ లో పవిత్ర గంగా స్నానానికి 45 రోజుల్లో దాదాపుగా 66 కోట్ల మంది భక్తులు వచ్చారు. ఈ సందర్భంగా దేశంలో 2.8 లక్షల కోట్ల ఆర్థిక కార్యకలాపాలను సృష్టించిందని మంగళవారం నాడు ఒక నివేదిక తెలిపింది.
డన్ బ్రాడ్ స్ట్రీట్ నివేదిక ప్రకారం.. యూపీలోని ప్రయాగ్ రాజ్ లో లక్షలాది మంది ప్రజల కలయిక భారీ ఆర్థిక కార్యకలాపాలకు దారి తీసింది. వీటిలో కొన్ని ప్రత్యక్ష ఖర్చులు, కొన్ని పరోక్ష ఖర్చులు, మరికొన్నిప్రేరిపిత ఖర్చులు కూడా ఉన్నాయి.
డెస్క్ యాజమాన్య పద్దతులో ఆర్థిక నమూనా పద్దతులతో అనుసంధానించడంతో పాటు డేటా ఆధారిత విధానాన్ని ఉపయోగించి ఈ అంచనాకు వచ్చినట్లు కంపెనీ తెలిపింది. గతంలో విడుదల చేసిన కొన్ని అంచనాలు మొత్తం ఆర్థిక కార్యకలాపాలను రూ. 2 లక్షల కోట్లుగా అంచనా వేసింది.
‘‘కుంభమేళా 2025 ఎడిషన్ ద్వారా రూ. 2.8 లక్షల కోట్ల ఆర్థిక ఉత్పత్తి సాధ్యమైందని అంచనా’’ వేశాము. అని కంపెనీ అధికారికంగా ప్రకటించింది.
ప్రత్యక్ష కార్యకలాపాలు అంటే ఈ విభాగంలో రవాణా, వసతి, ఆహారం, పర్యాటక సేవలు, స్థానిక వాణిజ్యం వంటి హాజరైన వారి ఖర్చులు కూడా ఉన్నాయి. ఇవి రూ. 90 వేల కోట్లుగా అంచనా వేశారు.
హోటల్ బుకింగ్ లు పెరగడం వల్ల లినెన్ లు డిమాండ్ పెరగడం వంటి ప్రత్యక్షంగా ప్రభావితమైన రంగాలలో పెరిగిన డిమాండ్ సరఫరా గొలుసుకు ప్రతిస్పందన నుంచి వచ్చే పరోక్ష ఆదాయం రూ. 80 వేల కోట్లకు చేరుకుంటుందని అంచనా.
కుంభమేళా ఆర్థిక వ్యవస్థలలో పెరిగిన ఖర్చుల కారణంగా అధిక ఆర్థిక కార్యకలాపాలు, కార్మికులు, గృహ నిర్మాణం, విద్య, ఆర్థిక సంరక్షణ రోజువారీ నిత్యావసరాలలో తిరిగి పెట్టుబడి పెట్టడం వంటి అంశాలతో దీనిని రూ. 1.1 లక్షల కోట్లుగా అంచనా వేసింది.
వ్యయ వర్గీకరణ దృక్కోణం నుంచి రూ. 2.3 లక్షల కోట్లు వినియోగ వ్యయంగా లేబుల్ చేయగా, మిగిలిన రూ. 50 వేల కోట్లు మౌలిక సదుపాయాలు మూలధన వ్యయంగా అని అది తెలిపింది.
వినియోగ వ్యయంలో సగం రవాణా ద్వారానే జరిగిందని దాని విలువ రూ. 37 వేలు కోట్లుగా అంచనా వేసింది. అందులో రైల్వేలు మాత్రమే రూ. 17,700 కోట్ల రూపాయలను ఆర్జించాయని తెలుస్తోంది.
హెలికాప్టర్ జాయ్ రైడ్ లు, హాట్ ఎయిర్ బెలూన్ రైడ్ లు, ఏటీవీ రైడ్ లు, అడ్వెంచర్ స్పోర్ట్స్ అమ్యూజ్ మెంట్ పార్క్ ఎంట్రీలు, యోగా సెషన్ లు, గైడెడ్ సిటీ టూర్ లు వంటి వినోద కార్యకలాపాల కోసం యాత్రికులు రూ. 10 వేల కోట్లు ఖర్చు చేశారని తెలిపింది.
రిటైల్ వ్యాపారంలో నిమగ్నమైన దాదాపు 2 లక్షల మంది వ్యాపారులు రూ. 7 వేల కోట్ల కార్యకలాపాలను నిర్వహించగా, ఆహార సేవలు రూ. 6,500 కోట్లను ఉత్పత్తి చేశాయని తెలిపింది.
కుంభమేళాలలో సమయంలో టీ స్టాల్ యజమానులు రోజుకు సగటున రూ. 30 వేలు సంపాదించగా, పూరి స్టాల్ యజమానులు రోజుకు సగటున రూ. 15 వేలు సంపాదించారు.