బీహార్ అసెంబ్లీ ఎన్నికలు: ఉదయం తొమ్మిది గంటలకు 13 శాతం పోలింగ్

ఓటు వేసిన లాలూ కుటుంబం

Update: 2025-11-06 06:00 GMT
ఓటు వేసిన లాలూ కుటుంబం

బీహార్ అసెంబ్లీ ఎన్నికల తొలిదశ లో ఈ రోజు ఉదయం ఏడు గంటలకు ఓటింగ్ ప్రారంభమైంది. 3.75 కోట్ల కు పైగా ఓటర్లు 1314 మంది అభ్యర్థుల ఎన్నికల భవితవ్యాన్ని నిర్ణయించనున్నారు.

వీరిలో ‘ఇండి’ కూటమికి చెందిన ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్, బీజేపీకి చెందిన ఉప ముఖ్యమంత్రి సామ్రాజ్ చౌదరీ వంటి అగ్ర నాయకులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.

ఈ తొలిదశలో మొత్తం 45,341 పోలింగ్ కేంద్రాలలో ఓటింగ్ జరుగుతోంది. ఇందులో అత్యధిక పోలింగ్ కేంద్రాలు అంటే 36,733 బూత్ లు గ్రామీణ ప్రాంతాలలో ఉన్నాయి.

పోలింగ్ సాయంత్రం 5 గంటలకు ముగుస్తుంది. ఎన్నికల కమిషన్ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. 121 నియోజకవర్గాలలో 3.75 కోట్ల మంది ఓటర్లలో 10.72 లక్షల మంది కొత్త ఓటర్లు. ఇందులో 18-19 సంవత్సరాల వయస్సు గల ఓటర్ల సంఖ్య 7.38 లక్షలుగా లెక్కతేలింది.

స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్, లేదా ఎస్ఐఆర్) ఎన్నికల జాబితా తరువాత అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా 7. 24 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. ఇది కసరత్తు చేపట్టడానికి ముందు ఉన్న పరిమాణం కంటే దాదాపు 60 లక్షలు తక్కువ.
రఘెపూర్ లో తేజస్వీ యాదవ్ హ్యట్రిక్ సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. అక్కడ బీజేపీ తేజస్వీకి ప్రత్యర్థిగా ఉన్నారు. జేడీ(యూ) అభ్యర్థిగా ఒకప్పుడు(2010) లో ఆయన రబ్రీదేవిని ఓడించారు. రబ్రీదేవీ లాలూ ప్రసాద్ యాదవ్ భార్య. తేజస్వీ యాదవ్ కు తల్లి. రెండో దశ పోలింగ్ ఈ నెల 11 న నిర్వహిస్తారు. ఫలితాలు నవంబర్ 14 న ప్రకటిస్తారు.


Tags:    

Similar News