‘‘చంద్రబాబు, నితీశ్ కుమార్ ను బ్లాక్ మెయిల్ చేయడానికి ఈ బిల్లు’’
ఆర్జేడీ నాయకుడు తేజశ్వి యాదవ్ విమర్శలు;
By : Praveen Chepyala
Update: 2025-08-21 10:28 GMT
ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులు, మంత్రులకు ఐదేళ్ల మించి కేసు ఉన్న వాటితో అరెస్ట్ అయి 30 రోజుల పాటు జైలు లో ఉంటే పదవీ పోయే బిల్లులు కేవలం నితీశ్ కుమార్, చంద్రబాబు నాయుడే లక్ష్యంగా తీసుకొచ్చారని ఆర్జేడీ నాయకుడు తేజస్వీ యాదవ్ గురువారం అన్నారు.
పీఎంఎల్ఏ కేసులలో..
ఈడీ దాఖలు చేసిన కేసులలో మనీలాండరింగ్ నిరోధక చట్టం(పీఎంఎల్ఏ) ని ప్రయోగిస్తే త్వరగా బెయిల్ లభించే అవకాశం లేదని తేజస్వీ యాదవ్ విలేకరులతో అన్నారు.
‘‘వారు(ఎన్డీఏ) ఈ బిల్లును నితీశ్ కుమార్, చంద్రబాబు నాయుడు కోసం తీసుకొస్తున్నారు. వారికి ఒకే ఒక పని ఉంది. అది కేవలం బ్లాక్ మెయిల్ చేయడం. ఈడీ కేసుల్లో పీఎంఎల్ఏ ని కొట్టేస్తే త్వరగా బెయిల్ రాదు. ఇవి హింసాత్మక వ్యూహాలు. దేశాన్ని నిర్మించడానికి బదులుగా, వారు దానిని నాశనం చేస్తున్నారు.’’ అని యాదవ్ అన్నారు.
జైలుశిక్ష అనుభవించి, తరువాత విడుదలైన జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్, ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్ ఉదాహారణను ఉటంకిస్తూ చట్టం కింద అభియోగాలు మోపితే ఇతరులకు కూడా ఇలాంటి గతి ఎదురుకావచ్చని యాదవ్ ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రజాస్వామ్యాన్ని బలహీనపరిచే కుట్ర..
ప్రజాస్వామ్యాన్ని బలహీనపరిచేందుకు, నిర్దిష్ట రాజకీయ నాయకులను లక్ష్యంగా చేసుకునే పెద్ద కుట్రలో భాగంగా ఈ బిల్లులను తీసుకొచ్చారని కుమార్, నాయుడులను అదుపులో ఉంచడమే లక్ష్యంగా ఉన్నాయని ఆయన ఆరోపించారు.
‘‘బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ పై ఒత్తిడి తెచ్చి, ఆయనను బ్లాక్ మెయిల్ చేసి జేడీయూ నాయకులను ఇచ్చే టికెట్లలో బీజేపీ నాయకులను చోటు కల్పించమని కోరే పెద్ద కుట్రలో భాగంగా ఈ బిల్లును తీసుకువచ్చారు. ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయకుడును అదుపులో ఉంచడం ఈ బిల్లు లక్ష్యం. వారు కొత్త కేసు కూడా దాఖలు చేయవచ్చు. ప్రజాస్వామ్యాన్ని బలహీనపరిచేందుకు ఈ చట్టం తీసుకువచ్చారు’’ అని ఆయన అన్నారు.
కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాజ్యాంగ సవరణ(130వ) బిల్లు 2025 కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వం(సవరణ) బిల్లు 2025 జమ్మూకశ్మీర్ పునర్వ్యవస్థీకరణ(సవరణ) బిల్లు 2025 లను లోక్ సభలో బుధవారం ప్రవేశపెట్టారు.
ఎస్ఐఆర్ పై ఈసీ, బీజేపీ పై విమర్శలు..
బీహార్ లో ఓటర్ల జాబితా ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) పై ఎన్నికల సంఘం, బీజేపీని విమర్శించిన యాదవ్, నితీశ్ కుమార్ ఏమి చేసినా, ప్రజలు ఇప్పటికే ఎన్డీఏ నిజమైన స్వరూపానన్ని చూశారని అన్నారు.
‘‘బీహర్ ప్రజలు అవగాహన ఉన్న పౌరులు. వారికి వారి హక్కులు తెలుసు. ఓటర్ బచావో అధికార్ యాత్ర జరుగుతున్న తీరుకు ప్రజల పూర్తి మద్దతు, ఆశీర్వాలు లభిస్తున్నాయి. ఇది ఒక చారిత్రాత్మక యాత్ర.
బీజేపీ ప్రజలు, ఎన్నికల కమిషన్ ప్రజలు బహిర్గతమయ్యారు. రాబోయే రోజుల్లో, బీహార్ ప్రజలు ప్రస్తుత ప్రభుత్వానికి తగిన సమాధానం ఇస్తారు’’ అని యాదవ్ అన్నారు.