ఢిల్లీలో జీరో విజిబిలిటీ, 160 విమానాలు, 51 రైళ్లపై ఎఫెక్ట్
ప్రయాణికులు టైంటేబుల్ చూసుకుని రావాలన్న రైల్వేశాఖ;
By : Praveen Chepyala
Update: 2025-01-05 07:26 GMT
దేశ రాజధాని ఢిల్లీని ఆదివారం పొగమంచు కప్పేసింది. ఈ కారణంగా పలు విమాన సర్వీసులు, రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం లో 160కి పైగా విమానాలు ప్రభావితమయ్యాయి. అందులో 155 సర్వీసులు ఆలస్యంగా నడిచాయి.
ఇప్పటి వరకూ వరకూ అందిన సమాచారం ప్రకారం ఎనిమిది రద్దయ్యాయి. అలాగే రైల్వే శాఖ కూడా పొగమంచు కారణంగా ట్రైన్లను ఆలస్యంగా నడిపిస్తోంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం 51 రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి.
పాలెం వద్ద పరిస్థితి..
అంతర్జాతీయ విమానాశ్రయం ఉన్న పాలెం వద్ద తెల్లవారు జామున ఉదయం 4 గంటల నుంచి 7. 30 వరకూ జీరో విజిబులిటీ ఉందని వాతావరణ శాఖ తెలిపింది. శనివారంకూడా పాలెంలో సున్నా విజిబిలిటిగా నమోదు అయింది. ఇది దాదాపు తొమ్మిది గంటల పాటు కొనసాగింది.
సప్థర్ జంగ్ లో ఉదయం 5.30 నిమిషాలకు విజిబులిటి 0.50 మీటర్లకు పడిపోయింది. ఉదయం 7.30 చాలా దట్టమైన పొగమంచు కారణంగా పాలం- సప్దర్ జంగ్ విమానాశ్రాయాల్లో దృశ్యమానత సున్నాకి తగ్గిపోయింది. ఆధునాతన క్యాట్ -III నావిగేషన్ సిస్టమ్ లు లేని ఎయిర్ క్రాప్ట్ లను కలిగి ఉన్న విమానాలు ఆలస్యం లేదా రద్దు చేస్తున్నారు. ప్రయాణికులు తమ రైలు సమయాన్ని జాగ్రత్తగా పరిశీలించాలని కోరింది.
పడిపోయిన ఎయిర్ ఇండెక్స్..
రాజధానిలో సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు డేటా ప్రకారం ఉదయం 9 గంటలకు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 372 రీడింగ్ తో జాతీయ రాజధాని గాలి నాణ్యత చాలా తక్కువ స్థాయిలో నమోదు అయింది. గాలి నాణ్యత సున్నా నుంచి 50 కి మధ్య ఉన్న ఏక్యూఐ చాలా మంచి వాతావరణం,
51-100 సంతృప్తికరమైనది, 101-200 మితమైనది.. 201-300 తక్కువ, 301-400 చాలా పేలవమైనది, 401-500 తీవ్రమైనదిగా పరిగణిస్తారు. అంతకుమించితే మనుషులు ఉండలేనివిగా పరిగణిస్తారు. చలికాలంలో ఢిల్లీ నివాస యోగ్యంగా ఉండట్లేదని చాలాకాలంగా అపవాదును ఎదుర్కొంటుంది.
దీనికి తోడు ఉత్తరం వస్తున్న చలిగాలుల కారణంగా ఢిల్లీ ఉష్ణోగ్రత 9.4 డిగ్రీల వద్ద సెల్సియస్ గా నమోదైంది. ఉదయం తొమ్మిది గంటలకు తేమ 95 శాతంగా ఉంది. అలాగే పగటి పూట దట్టమైన పొగమంచు ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఇక్కడ గరిష్ట ఉష్ణోగ్రత 18 డిగ్రీల సెల్సియస్ గా నమోదయ్యే అవకాశం ఉంది.