పరివార్ రాజకీయాలకు రాజధానిగా బిహార్

ఇప్పటికే రాజకీయాల్లోకి వచ్చిన తేజస్వీ, చిరాగ్, సంతోష్ సుమన్.. ఇదే జాబితాలోకి రానున్న నిశాంత్ కుమార్?;

Update: 2025-03-10 07:55 GMT

మహ్మద్ ఇమ్రాన్ ఖాన్

ఈ ఏడాది బిహార్ లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ప్రస్తుతం సీఎం నితీష్ కుమార్ పరిస్థితి ఏ మాత్రం బాగాలేదు. ఆయన మరో పరాజయానికి సిద్దంగా ఉన్నారని కనిపిస్తుంది.

హోలీ తరువాత తన కుమారుడు నిశాంత్ ను రాజకీయ అరంగ్రేటం చేయించబోతున్నాడు. ఇంతకుముందు వంశపారంపర్య రాజకీయాలను విమర్శించిన ఆయన ఇప్పుడు తన కుమారుడికి పట్టం కట్టబోతున్నాడు. తన రాజకీయ సౌలభ్యం కోసం వాటిని ఇప్పుడు పక్కన పెట్టినట్లు కనిపిస్తుంది.

ఎన్నికల సందర్భంగా పార్టీ పగ్గాలు చేపట్టాలని నాయకులు, కార్యకర్తలు కోరుకుంటున్నారని వార్తలు వస్తున్నాయి. అయితే ఇంజనీర్ కొడుకు రాజకీయ అరంగ్రేటం విషయంలో నితీశ్ కుమార్ ఇంకా మౌనంగానే ఉన్నారు.
నితీశ్ ఆరోగ్యం క్షీణిస్తుందనే వార్తలు కూడా ఈ మధ్యనే వస్తున్నాయి. రాజకీయ పరిశీలకుల చెప్పిన మాట ఏంటంటే.. నితీశ్ ఎప్పుడూ నిశాంత్ ను ఆమోదిస్తారనే కీలకం. ఆయన పార్టీ కొత్తగా పొత్తులు కుదుర్చుకునే పరిస్థితి కనిపించడం లేదు. కాబట్టి కుమారుడిని ముందుకు తెచ్చాడు.
‘‘ఎమ్మెల్యేలు సహ కొంతమంది పార్టీ నాయకులు నిశాంత్ ను పార్టీలో చేరమని బహిరంగంగా కోరారు’’ అని జేడీయూ కార్యకర్త ‘ ది ఫెడరల్’ తో మాట్లాడుతూ చెప్పారు.
‘‘నిషాంత్ కోసం పార్టీ సిద్దంగా ఉంది. ఇది అతనికి సానుకూల మానసిక స్థితిని సూచిస్తుంది. కానీ నితీశ్ కుమార్ మాత్రమే దీనిపై నిర్ణయం తీసుకుంటారు’’ అని ఆయన అన్నారు.
మరో జేడీయూ నాయకుడు మాజీ మంత్రి ‘ ది ఫెడరల్’ తో మాట్లాడుతూ.. పార్టీ ఎమ్మెల్యేలలో ఎక్కుమంది అంటే 45 మందిలో దాదాపు 30 మంది నితీశ్ శకం తరువాత జేడీయూను బలోపేతం చేయడానికి నిశాంత్ జేడీయూలో చేరాలని కోరుకుంటున్నారని అన్నారు.
పార్టీ చీలిపోతుందా?
నితీశ్ నిర్ణయం తీసుకుంటే పార్టీ రెండుగా చీలిపోయే అవకాశం ఉంది. తప్పుడు సమయంలో నిశాంత్ ఎంట్రీ ఇస్తే అది పార్టీ ఉనికికే ప్రమాదం అని కొంతమంది రాజకీయ విశ్లేషకుల భావన.
మరికొంత అభిప్రాయం ప్రకారం అయితే త్వరగా నిర్ణయం తీసుకుంటే పార్టీ మనుగడ సాధించగలదు. అయితే వీటి వల్ల తమ మిత్రపక్షం బీజేపీ బలపడుతుందని. ఇది జేడీ(యూ)లోని చాలామంది సీనియర్ లీడర్లు ఇష్టపడరు.
అయితే నిశాంత్ రాజకీయ రంగ ప్రవేశం పై సొంత పార్టీలోని కొంతమంది నాయకులకు ఇష్టం లేదు. ‘‘నిశాంత్ వస్తే తమ ప్రాధాన్యం తగ్గిపోతుందని వారి అభిప్రాయం. వారిలో బీజేపీకితో అనుబంధం కొనసాగిస్తున్నవారికి ఈ పరిణామం సుతారము ఇష్టం లేదు’’ అని పార్టీలో వినిపిస్తున్న మాట. నిశాంత్ వస్తే పార్టీ మనుగడ సాగిస్తుందని వారి భయం.
నిశాంత్.. ప్రియాంక గాంధీ కారు..
నిశాంత్ రాజకీయ అరంగ్రేటంపై పాట్నాకు చెందిన రాజకీయ విశ్లేషకుడు డీఎం దివాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘నిశాంత్ ఎంట్రీ సొంత సామాజిక వర్గం కుర్మీల సంపూర్ణ మద్దతును పొందుతారు. వీరే తరువాత కీలకంగా వ్యవహరించబోతున్నారు’’ అని అభిప్రాయపడ్డారు.
నితీశ్ రాజకీయ ప్రత్యర్థి లాలూ ప్రసాద్ యాదవ్ తన వారసుడిగా చిన్న కుమారుడు తేజస్వీ యాదవ్ ను 2022 లో బహిరంగంగా ప్రకటించారు. తరువాత రెండుసార్లు డిప్యూటీ సీఎం ను చేశాడు.
కానీ నిషాంత్ పేరును మాత్రం ఎక్కడా, ఎప్పుడూ నితీశ్ కుమార్ తెరపైకి తీసుకురాలేదు. ఈ ప్రతిపాదన కేవలం గత సంవత్సరమే బయటకు వచ్చింది. కానీ సీఎం మాత్రం దీనిపై ధృడ నిర్ణయం తీసుకోలేదు.
కానీ నితీశ్ మాత్రం తన కుమారుడు రాజకీయాలపై చాలా సమయం తీసుకున్నారని దివాకర్ అన్నారు. ‘‘ ఆర్జేడీకి చెందిన తేజస్వీ యాదవ్, ఎల్జేపీకి చెందిన చిరాగ్ పాశ్వాన్ రాజకీయాల్లోకి వచ్చినప్పుడే నిశాంత్ ఎంట్రీ ఇస్తే బాగుండేది.
ప్రస్తుత ఎన్నికల్లో ఆయన తేజస్వీకి, చిరాగ్ కు మంచి పోటీ ఇచ్చేవారు. తేజస్వీ రాజకీయాల్లో ఇప్పటికే వాస్తవితను అర్థం చేసుకున్నాడు. ’’
రాజకీయాల్లో నిశాంత్, ప్రస్తుత ప్రియాంక గాంధీ కాబోరని పాట్నాలోని ఏఎన్ సిన్హా ఇన్ట్సిట్యూట్ ఆఫ్ సోషల్ స్టడీస్ మాజీ డైరెక్టర్ దివాకర్ అన్నారు. ఇంతకుముందు ఆయన వారసత్వ రాజకీయాలు వద్దని అన్నారు.
దీనితో ఆయన తరువాత పార్టీని ఎవరిని నడిపించాలో విషయంలో ఇన్నాళ్లు కొన్ని వదంతులు ఉన్నాయి. ఇప్పుడు నిశాంత్ రాకతో వాటిని చెక్ పడబోతున్నాయి.
వారసత్వానికి వ్యతిరేకం..
బీహార్ లో తన రాజకీయ ప్రత్యర్థులను ఓడించడానికి నితీశ్ కుమార్ తరుచుగా కుటుంబ రాజకీయాలపై విమర్శలు గుప్పించేవారు. ప్రత్యర్థులవి పరివార్ రాజకీయాలంటూ, తన కుటుంబం నుంచి ఇంతవరకూ ఎవరూ రాలేరని ప్రజల ముందుకు వెళ్లేవారు. ప్రస్తుతం ఈ నినాదం ఆయన ఇంకా చేయలేరు.
జనతా పార్టీ రోజుల నుంచి నితీశ్ ను అనుసరిస్తున్న కార్యకర్త సత్యనారాయణ మదన్ మాట్లాడుతూ.. నిశాంత్ రాజకీయాల్లోకి వస్తారని తాను నమ్ముతున్నాని అన్నారు. తాను తన మునుపటి రాజకీయ వైఖరితో ప్రస్తుతం వ్యతిరేకిస్తున్నారని అన్నారు.
‘‘నితీష్ ఆరోగ్యం బాగాలేదు. రాజకీయంగా ఆయన విశ్వసనీయత, ప్రజాదరణ తగ్గుతున్నాయి. ఇది ఆయనక సవాల్ తో కూడిన దశ. రాజకీయాల్లోకి సురక్షితమైన ప్రవేశం కల్పించడానికి ఆయన నిశాంత్ ను ఎమ్మెల్సీగా నామినేట్ చేయవచ్చు.
అయితే నితీశ్ స్థానంలో నిశాంత్ ఎప్పుడైనా రాగలడని అనుకోవడం అవాస్తవం. ముఖ్యమంత్రి కావడం ఒక ముఖ్యమైన సవాల్. సమీప భవిష్యత్ లో నిశాంత్ దానిని సాధించడం అంత సులభం కాదు’’ అని అన్నారు.
యూ టర్న్ తీసుకున్న నిశాంత్..
గత ఏడాది వరకూ తనకు రాజకీయాలు అంటే ఇష్టం లేనదని అన్న నిశాంత్, తనకు ఆధ్యాత్మిక మార్గం అంటే ఇష్టమని పేర్కొన్నారు. జర్నలిస్ట్ కు దూరంగా ఉండే ఆయన తరుచుగా వారితో మాట్లాడుతున్నారు.
ఈ ఎన్నికల్లో కూడా తన తండ్రే ముఖ్యమంత్రి అభ్యర్థి అని ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఇది కూటమిలో చిన్నపాటి ప్రకంపనలు సృష్టించింది. ఇది అతని మొదటి రాజకీయ ప్రకటన.
ఆ తరువాత నిశాంత్ కు మద్దతుగా పాట్నాలో జేడీయూ కార్యాలయంలో రంగురంగుల పోస్టర్లు కనిపించాయి. మరో రాజకీయ పరిశీలకుడు మాట్లాడుతూ.. నిశాంత్ రాజకీయంగా అమాయకుడిగా ఉన్నప్పటికీ తన తండ్రికి మద్దతు కూడగట్టడానికి ‘ అభివృద్ది కార్డు’ ఆడటానికి సిద్దంగా ఉన్నాడని అన్నారు.
ముందుగానా.. ఆలస్యంగానా..
మార్చి14న జరిగే హోలీ సమయంలో నిశాంత్ అధికారికంగా జేడీయూ లో చేరవచ్చనే ఊహగానాలు ఊపందుకున్నాయి. కానీ మరో నాయకుడు ది ఫెడరల్ తో మాట్లాడుతూ.. ఈ సంవత్సరం ఎన్నికల సమయంలో నిశాంత్ చురుగ్గా ఉన్నప్పటికీ 2026 ప్రారంభంలో పార్టీలో చేరతారని అన్నారు.
నిశాంత్ రాజకీయాల్లోకి వస్తే.. బిహార్ లో మొత్తం కుటుంబ రాజకీయాలే రాజ్యమేలాతాయి. ఇప్పటికే ఆర్జేడీకి తేజస్వీ యాదవ్, ఎల్జేపీకి చిరాగా పాశ్వాన్, మరో మాజీ ముఖ్యమంత్రి జితన్ రామ్ మాంఝీ పెద్ద కుమారుడు కేంద్రమంత్రి గా ఉన్న సంతోష్ సుమన్ బాటలోకి వచ్చినట్లు అయింది. రాష్ట్రంలో అలాంటి రాజకీయా కుటుంబాలు డజన్ కు పైగా ఉన్నాయి.


Tags:    

Similar News