న్యాయ క్రియాశీలత ఓ సాహాసయాత్ర కాదు: చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయ్
న్యాయ వ్యవస్థ జ్యూడీషియల్ టెర్రరిజంగా ఎన్నడూ మారకూడదని కీలక వ్యాఖ్యలు;
By : Praveen Chepyala
Update: 2025-08-21 11:31 GMT
న్యాయవాద కార్యకలాపాలు న్యాయ ఉగ్రవాదంగా మారకూడదని సీజేఐ బీఆర్ గవాయ్ గురువారం అన్నారు. రాష్ట్ర అసెంబ్లీలు ఆమోదించిన బిల్లులను గవర్నర్లు, రాష్ట్రపతి పరిష్కరించేందుకు కోర్టు సమయపాలన విధించగలదా అనే దానిపై రాజ్యాంగపరమైన ప్రశ్నలు లేవనెత్తారు.
కేంద్రం తరఫున హజరైన సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తన వాదనలు వినిపిస్తూ.. ఎంతో అనుభవం ఉన్న ఎన్నికైన వ్యక్తులను ఎప్పుడూ అణగదొక్కకూడదని ధర్మసనానికి సోలిసిటర్ జనరల్ విన్నవించారు. ఈ సందర్భంగా సీజేఐ కీలక వ్యాఖ్యలు చేశారు.
‘‘ఎన్నికైన ప్రజల గురించి మేము ఎప్పుడూ ఏమి అనలేదు. న్యాయపరమైన క్రియాశీలత ఎప్పుడూ న్యాయపరమైన ఉగ్రవాదం లేదా న్యాయపరమైన సాహాసయాత్రగా మారకూడదని నేను ఎప్పుడూ చెబుతూనే ఉన్నాను’’ అని సీజేఐ మెహాతాతో అన్నారు. ఈ ధర్మాసనంలో న్యాయమూర్తులు సూర్యకాంత్, విక్రమ్ నాథ్, పీఎస్ నరసింహ, ఎఎస్ చందూర్కర్ కూడా ఉన్నారు.
గవర్నర్ అధికారాలు..
విచారణ వరుసగా మూడో రోజుకు చేరుకోగా, గవర్నర్ అధికారాలపై సుప్రీంకోర్టు ఇచ్చిన వివిధ తీర్పులను ప్రస్తావిస్తూ మెహతా వాదనలను తిరిగి ప్రారంభించారు. ప్రారంభంలోనే సోలిసిటర్ జనరల్ మాట్లాడుతూ.. అధ్యక్షుడి సూచనపై సీనియర్ న్యాయవాదీ కపిల్ సిబల్ వాదనలపై ఎదురు చూస్తున్నామని, ఆయనకు ప్రజా జీవితంలో అపారమైన అనుభవం ఉందన్నారు. పాలనలో పార్లమెంటేరియన్ కూడా ఉన్నారని ధర్మాసనం వ్యాఖ్యానించింది.
‘‘ఏ రాజకీయ పార్టీకి చెందిన ఎన్నికైన వ్యక్తులు నేటీ కాలంలో ఓటర్లకు నేరుగా స్పందించాల్సి ఉంది. ఇప్పుడూ ప్రజలు నేరుగా వారి నుంచి ప్రశ్నలు అడుగుతున్నారు. 20-25 సంవత్సరాల క్రితం పరిస్థితులు భిన్నంగా ఉంది. ఓటర్లకు అవగాహన పెరిగింది. వారిని మోసగించలేరు’’ అని మెహతా అన్నారు.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 200 కింద అందించబడిన విధంగా గవర్నర్ సమ్మతిని నిలిపివేయడం అనేది రాజ్యంగ కార్యకర్త స్వతంత్య్ర, పూర్తి విధి అని ఆయన అన్నారు. రాష్ట్ర అసెంబ్లీ ఆమోదం పొందిన తరువాత గవర్నర్ బిల్లులను రెండోసారి రాష్ట్రపతికి పంపినప్పుడూ పరిశీలన కోసం పంపలేరని సుప్రీంకోర్టు పేర్కొంది.
అధ్యక్షుడి సూచన..
రాష్ట్రపతి సూచన నిర్వహణపై తమిళనాడు, కేరళ ప్రభుత్వాలు లేవనెత్తిన ప్రాథమిక అభ్యంతరాలకు స్పందిస్తూ అత్యున్నత న్యాయస్థానం అప్పీలేట్ అధికార పరిధిలో లేనందున దాని సలహ అధికార పరిధిని ఉపయోగించుకుంటామని తెలిపింది.
మే నెలలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆర్టికల్ 143(1) కింద రాష్ట్ర అసెంబ్లీలు ఆమోదించిన బిల్లులను పరిష్కరించేటప్పుడూ రాష్ట్రపతి విచక్షణను వినియోగించడానికి న్యాయపరమైన ఉత్తర్వూలు విధించవచ్చో లేదో సుప్రీంకోర్టు నుంచి తెలుసుకోవడానికి అధికారాలను ఉపయోగించారు.
రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించిన బిల్లులపై గవర్నర్లు, రాష్ట్రపతి చర్య తీసుకోవడానికి నిర్ణీత కాలపరిమితిని విధించడం అంటే ప్రభుత్వంలోని ఒక అవయవం రాజ్యాంగ ద్వారా తనకు ఇవ్వబడని అధికారాలను స్వీకరించడమే అవుతోందని, రాజ్యాంగ లోపాలకు దారితీస్తుందని కేంద్రం తన లిఖిత పూర్వక సమర్పణలో పేర్కొంది.
ఏప్రిల్ 8న సుప్రీంకోర్టు మొదటిసారిగా తమిళనాడు అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను సంబంధించిన గవర్నర్ అధికారాలను పరిశీలిస్తున్నప్పుడూ గవర్నర్ పరిశీలన కోసం రిజర్వ్ చేసిన బిల్లులపై అటువంటి సూచన అందిన తేదీ నుంచి మూడు నెలల్లోపు రాష్ట్రపతి నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది.
ఐదు పేజీల సూచనలో అధ్యక్షుడు ముర్ము సుప్రీంకోర్టు కు 14 ప్రశ్నలు సంధించారు. రాష్ట్ర శాసనసభ ఆమోదించిన బిల్లులను పరిష్కరించడంలో ఆర్టికల్ 200, 201 ప్రకారం.. గవర్నర్, రాష్ట్రపతి అధికారాలపై దాని అభిప్రాయాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించారు.