మేనల్లుడిపై మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసిన మాయావతి
పార్టీ పదవుల నుంచి తక్షణమే తొలగిస్తున్నట్లు ప్రకటన, ఇంతకుముందు కీలక బాధ్యతలు ఇచ్చి విరమించుకున్న మాజీ సీఎం;
బీఎస్పీ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి మాయవతి మరోసారి తన మేనల్లుడి విషయంలో యూటర్న్ తీసుకున్నారు. ఆకాశ్ ఆనంద్ ను పార్టీలోని అన్ని పదవుల నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించారు. తాను జీవించి ఉన్నంత కాలం రాజకీయ వారసుడిని నియమించబోనని పేర్కొన్నారు.
పార్టీని బలోపేతం చేయడానికి దేశ వ్యాప్తంగా ఉన్న పార్టీ ఆఫీస్ బేరర్లతో లక్నోలో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో, ఆమె పార్టీ నాయకత్వంలో గణనీయంగా మార్పులు చేయబోతున్నట్లు ప్రకటించారు.
ఆకాశ్ ఆనంద్ మామ, రాజ్యసభ మాజీ ఎంపీ అశోక్ సిద్దార్థ్ ను పార్టీ నుంచి బహిష్కరించిన తరువాత బీఎస్పీ అధినేత్రి ఈ నిర్ణయం తీసుకున్నారు. తన మేనల్లుడిపై తీసుకున్న నిర్ణయానికి సిద్దార్థ్ కారణమని, పార్టీని రెండు వర్గాలుగా విభజించడానికి సిద్దార్థ్ ప్రయత్నిస్తున్నాడని ఆమె ఆరోపించారు.
BSP chief Mayawati (@Mayawati) removes nephew Akash Anand from all party posts. pic.twitter.com/GLBqOKO9Ox
— Press Trust of India (@PTI_News) March 2, 2025