సహజీవనాన్ని రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే జంటలకు శిక్ష

ఇంటి యజమానులకు కూడా ఇదే తరహ నిబంధనలు తీసుకొచ్చిన ఉత్తరాఖండ్ ప్రభుత్వం;

Update: 2025-01-30 10:30 GMT

దేశంలో కొత్తగా యూసీసీ అమలు చేస్తున్న ఉత్తరాఖండ్ ప్రభుత్వం.. తాజాగా సహజీవనం చేస్తున్న జంటలు ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చిన 30 రోజుల్లో కచ్చితంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఆదేశించింది. అలా చేయలేని జంటలు కలిసి ఉంటే.. ఆరు నెలల జైలు శిక్ష లేదా రూ. 25 వేల జరిమానా విధిస్తామని పేర్కొంది. అలాగే యజమానులు కూడా తమ ఇంటిని అద్దెను అద్దెకు ఇస్తే లైవ్ ఇన్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ లను తప్పనిసరిగా తీసుకోవాలంది. ఈ నిబంధనలు ఉల్లంఘిస్తే రూ. 20 వేల జరిమానా విధిస్తామని హెచ్చరించింది.

యూసీసీ నియమాలు..
ఉత్తరాఖండ్ లోని యూనిఫాం సివిల్ కోడ్ అమలుతో పాటు ఈ నియమాలు అమలులోకి వచ్చాయి. ఇది దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే ముందుగానే యూసీసీని అమల్లోకి తెచ్చింది. ఈ యూసీసీ లో భాగంగానే 30 రోజుల్లోనే జంటలు, ఇంటిని అద్దెకు ఇచ్చిన వారు నిబంధనలు పాటించాలి. అలాగే అన్ని మతాల్లో కూడా యూసీసీ బహుభార్యాత్వాన్నినిషేధిస్తుంది. అలాగే వివాహం చేసుకోవాలంటే కచ్చితంగా స్త్రీ, పురుష వయస్సును 21 సంవత్సరాలుగా నిర్దేశించింది.
తప్పనిసరిగా సర్టిఫికెట్
ఇంటిని అద్దెకు ఇచ్చే ముందు యజమానులు తప్పనిసరిగా లైవ్ ఇన్ రిలేషనిస్ట్ సర్టిఫికెట్ లేదా ప్రొవిజనల్ సర్టిఫికేట్ కాపీని పొందాలని ప్రభుత్వం స్పష్టంగా ఆదేశించింది. దీనికి సంబంధించి క్లాజ్ (బీ) లో వివరించారు. ఇది ఒప్పందంలో కీలకం. దీనికి సంబంధించి విఫలమైతే రిజిస్ట్రార్ జరిమానాలు విధించవచ్చు.
అలాగే ఉత్తరాఖండ్ లో సహజీవనం చేసే జంటలు తప్పనిసరిగా రూ. 500 రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాలి. రిలేషన్ షిప్ లోకి ప్రవేశించిన నెలలోపే రిజిస్టర్ చేసుకోవాలి. విఫలమైతే అదనంగా రూ. వేయి జరిమానా విధిస్తారు.
ఆన్ లైన్ పోర్టల్..
వివాహాలు, విడాకులు, లైవ్ ఇన్ రిలేషనిప్స్, వీలునామా నమోదును సులభతరం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఆన్ లైన్ పోర్టల్ ను ప్రవేశపెట్టింది. ఇది ప్రక్రియలను క్రమబద్దీకరించడం, చట్టపరమైన సౌలభ్యాన్ని కిందిస్థాయిలో అందించడానికి లక్ష్యంగా నిర్దేశించారు.
అనుకూల.. వ్యతిరేక వాదనలు..
లైవ్ ఇన్ రిలేషన్ షిప్ రిజిస్ట్రేషన్ తప్పనిసరి చేయడం వ్యక్తిగత స్వేచ్ఛ, గోప్యతకు భంగం కలిగిస్తుందని విమర్శకులు వాదిస్తున్నారు. వ్యక్తిగత సమాచారాన్ని దుర్వినియోగం చేయడం, వ్యక్తి గత జీవితాల్లోకి ప్రభుత్వ చొరబాట్లు పెరగడం వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అయితే వివాదాలు ఉన్నప్పటికీ యూసీసీ వర్గాల్లో సమానత్వం, ఏకరూపతను ప్రొత్సహిస్తుందని ఉత్తరాఖండ్ ప్రభుత్వం పేర్కొంది. కోడ్ అమలు దేశంలో వ్యక్తిగత చట్టాలను ప్రామాణికరించే దిశగా పెద్ద ముందడుగా పరిగణించింది.


Tags:    

Similar News