‘రాహూల్ గాంధీ’ ప్రతిపక్షనేతగా ఉండటానికి అంగీకరిస్తారా?
సార్వత్రిక ఎన్నికల్లో రాహూల్ గాంధీ ప్రతిపక్ష నేతగా ఉండాలని సీడబ్ల్యూసీ ఏకగ్రీవంగా తీర్మానించింది. అయితే కాంగ్రెస్ అగ్రనేత రాహూల్ గాంధీ దీనిపై..
By : Praveen Chepyala
Update: 2024-06-09 08:26 GMT
లోక్ సభ ఎన్నికల ఫలితాలపై చర్చించేందుకు కాంగ్రెస్ అత్యున్నత నిర్ణాయక సంస్థ సీడబ్ల్యూసీ, కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ(సీపీపీ) ఢిల్లీలో సమావేశం అయ్యాయి.
2014-2019 ఎన్నికలలో వరుసగా 44, 52 స్థానాలు గెలుచుకున్న కాంగ్రెస్ పార్టీ 2024 లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో 99 సీట్లు సాధించింది. గత రెండు సార్వత్రిక ఎన్నికల్లో కనీసం ప్రతిపక్ష హోదా కూడా సాధించలేకపోయిన పార్టీ.. ఇప్పుడు ఆ హోదా సాధించింది. దీనిపై పార్టీ హర్షం వ్యక్తం చేసింది. దీనిపై సీడబ్ల్యూసీ ఏకగ్రీవంగా తీర్మానం ఆమోదించింది. రాహూల్ గాంధీ ప్రతిపక్ష నేత హోదా స్వీకరించాల్సిందిగా కోరింది.
'లోక్ సభ లో ప్రతిపక్ష నేత'
ఆ తర్వాత జరిగిన కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ (సీపీపీ) సమావేశంలో కూడా 'రాహుల్ లోక్ సభ లో ప్రతిపక్ష నేత' ఉండాలనే అభిప్రాయం ప్రతిధ్వనించింది. ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ, కేరళలోని వాయనాడ్‌ల నుంచి లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించిన రాహుల్, తాను ప్రతిపక్ష నేతగా ఉండే విషయం ఆలోచించి చెబుతానని అన్నారు.
ఫెడరల్‌తో మాట్లాడిన వివిధ CWC సభ్యులు, కొత్తగా ఎన్నికైన కాంగ్రెస్ ఎంపీలు రాహుల్ గురుతర బాధ్యతను అంతిమంగా అంగీకరిస్తారా లేదా అనే దానిపై తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తూ "అన్ని సూచనలు ఆయన ముందు పెట్టాం" అని అన్నారు.
293 మంది సభ్యుల అధికార NDA సంకీర్ణానికి వ్యతిరేకంగా లోక్‌సభలో 234 మంది సభ్యులు ఉన్న ఇండి కూటమికి నాయకత్వం వహించి మార్గనిర్దేశం చేయడమే కాకుండా వివిధ రాజ్యాంగబద్ద పదవుల ఎంపికలో ఆయన కూడా పాల్గొన వలసి ఉంటుందని గుర్తు చేశారు. ముఖ్యంగా సీబీఐ, ఈడీ వంటి కొన్ని సంస్థలకు ప్రతిపక్ష నేతల అభిప్రాయం కూడా అవసరం.
CWC సమావేశం కేసీ వేణుగోపాల్ మీడియాతో మాట్లాడుతూ.. రాహూల్ ప్రతిపక్ష నేత పదవిని స్వీకరించమని కోరినప్పుడు "త్వరలో నా నిర్ణయాన్ని సీడబ్ల్యూసీ సభ్యులకు తెలియజేస్తా" అని చెప్పారని అన్నారు.
త్వరిత నిర్ణయం తీసుకోండి..
కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కూడా రాహుల్‌తో మాట్లాడుతూ “ సభ్యులంతా ఏకగ్రీవంగా కోరిన కోరికను విస్మరించకూడదని, ఎన్నికల ప్రచారంలో పార్టీని నడిపించినట్లుగా, లోక్ సభ లో కూడా కాంగ్రెస్ ను నడిపించే బాధ్యతను అంగీకరించాలని ” అని చెప్పినట్లు కొన్ని వర్గాలు తెలిపాయి. రాహూల్ గాంధీ భారత్ జోడో యాత్ర ద్వారా దేశం మొత్తం పర్యటించడంతో సీట్లు డబుల్ అయినట్లు పార్టీ పెద్దలు చెప్పినట్లు సమాచారం.
ఒక సీనియర్ కాంగ్రెస్ ఎంపీ ఫెడరల్‌తో మాట్లాడుతూ "రాహుల్ కాంగ్రెస్ సభ్యుల కోరికలను గౌరవించి ప్రతిపక్ష పాత్రను అంగీకరిస్తారని పార్టీలో ప్రతి ఒక్కరూ ఆశిస్తున్నారు." అయితే, "మనలో ఎవరికీ ఆయన ఏం ఆలోచిస్తున్నారో అంతుచిక్కడం లేదు. బహుశా అతను అంగీకరించవచ్చు లేదా మరొక పేరు సూచించి అందరినీ ఆశ్చర్యపరుస్తాడా?" అన్నారు .
రాహుల్‌తో వ్యక్తిగతంగా మంచి సాన్నిహిత్యం ఉన్న మరో పార్టీ నాయకుడు మాట్లాడుతూ.. “అతను CWC తీర్మానంపై సానుకూలంగా స్పందించి అంగీకరిస్తారని మేము ఆశిస్తున్నాము. రాహుల్ పదవుల కోసం ప్రలోభపడే వ్యక్తి కాదని మాకు తెలుసు; అతను ప్రతిపక్ష నేత కాకపోయినా, అతను ఇప్పటికీ మా నాయకుడు. మా పార్టీకి సైద్ధాంతిక నాయకుడిగా ఉంటాడు... ప్రజాస్వామ్యంలో దళితులు, గిరిజనులు వెనుకబడిన కులాలకు ఎక్కువ వాయిస్‌ని అందించాలనే తన ప్రచారానికి అనుగుణంగా అతను కొన్ని ఆశ్చర్యకరమైన అంశాలతో ముందుకు రావచ్చని అన్నారు.
సీట్ల మధ్య..
18వ లోక్‌సభ మొదటి సెషన్ జూన్ 15న జరిగే అవకాశం ఉన్నందున, రాహుల్ LoP పదవిని అంగీకరిస్తారా లేదా అన్నదానిపై సస్పెన్స్ అప్పటి వరకూ కొనసాగవచ్చని ఒక సీడబ్ల్యూసీ సభ్యుడు ఫెడరల్ తో అన్నారు. దీనితో పాటు రాయ్ బరేలీ, వాయనాడ్ లో ఏ సీటును వదులుకోవాలనే దానిపై ఓ నిర్ణయం కూడా రెండు ఒకే సారి వస్తాయని ఆయన సెలవిచ్చారు.
“జూన్ 17లోపు ఆయన సీటుపై తుది నిర్ణయం తీసుకోవాలి... నెహ్రూ-గాంధీ కుటుంబానికి శతాబ్దాల నాటి అనుబంధం తో పాటు , యూపీకి సరైన రాజకీయ సందేశం ఇవ్వడానికి రాయ్‌బరేలీని కొనసాగించాలని మనలో చాలా మంది అనుకుంటున్నారు. ఇతర హిందీ మాట్లాడే రాష్ట్రాల నాయకులు కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నారు. కానీ చివరికి అతను ఏమి నిర్ణయిస్తాడో చూద్దాం. ఆయన LoP నిర్ణయం కూడా అదే సమయంలో రావచ్చు. రాహూల్ ఏ సీటును వదులుకున్నా ఉప ఎన్నిక అభ్యర్థిగా అతని స్థానంలో ఎవరిని ఎంపిక చేయాలనే దానిపై కూడా ఒకేసారి లేదా ఆ తర్వాత త్వరలో నిర్ణయం తీసుకోవచ్చు... ప్రస్తుతానికి, మనమందరం వేచి చూడాలని CWC సభ్యుడు అన్నారు.
ఆదివారం పార్టీ తీసుకున్న కొన్ని ఇతర నిర్ణయాలు ఎవరికీ ఆశ్చర్యం కలిగించలేదు. CPP చైర్‌పర్సన్‌గా బాధ్యతలు స్వీకరించడానికి సోనియా గాంధీని మరోసారి పార్టీ రాజ్యసభ సభ్యులు, లోక్‌సభకు ఎన్నికైన ఎంపీలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు . ఖర్గే, రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడిగా తన పాత్రను కొనసాగిస్తారని పార్టీ వర్గాలు ది ఫెడరల్‌కి ధృవీకరించాయి.
ఖర్గే, గాంధీలకు ప్రశంసలు
CWC, CPP నుంచి వచ్చిన సందేశం కూడా ఊహించిన విధంగానే ఉంది. ఖర్గే, సోనియా, రాహుల్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ లోక్‌సభ ప్రచారం ముందుండి నిర్వహించినందుకు రెండు సమావేశాలలో ప్రశంసలు అందుకున్నారు.
నరేంద్ర మోదీ వరుసగా మూడోసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు తీసుకుంటున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఆయనపై విమర్శలు గుప్పించింది. ఎన్నికల్లో మోదీ పేరుతో ఎన్నికలకు వెళ్లారని, 2019 ఎన్నికలతో పోలిస్తే 63 సీట్లు బీజేపీకి తగ్గాయని, మోదీ దీనికి నైతిక బాధ్యత వహించాలని విమర్శించింది. అబద్ధాలు, ద్వేషం, పక్షపాతం, విభజన, మతన్మోదం కూడిన ప్రచారాన్ని ప్రజలు తిరస్కరించారని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది.
CPP సమావేశంలో కూడా, సోనియా మాట్లాడుతూ.. " గత దశాబ్దంలో పార్లమెంట్ లో బీజేపీ వ్యవహరించినట్లు ఇప్పుడు ఏకపక్షంగా వ్యవహరించలేదు. తగిన చర్చలు లేకుండా చట్టాలను ఆమోదించడానికి కూడా వీలుకాదు. అలాగే పార్లమెంటరీ కమిటీలను ఏకపక్షంగా దుర్వినియోగం చేయలేరు" అని అన్నారు.
మోదీ తన పాలనపై రెఫరెండం కోరారని, అయితే ప్రజలు తగిన మెజారిటీ ఇవ్వనప్పటికీ కూడా తన వైఫల్యానికి బాధ్యత వహించకుండా మరోసారి ప్రమాణస్వీకారం చేయడానికి ప్రయత్నిస్తున్నాడని సోనియా గాంధీ ఆక్షేపించింది. “ఆయన (మోదీ) తన పాలన సారాంశం- శైలిని మారుస్తారని లేదా ప్రజల అభీష్టాన్ని గ్రహిస్తారని మేము ఆశించడం లేదు” మిగిలిన సీపీపీ నాయకులతో అన్నట్లు సమాచారం. మొత్తానికి కాంగ్రెస్ పార్టీలో ఈ ఎన్నికల ఫలితాలు పూర్తి జోష్ తీసుకొచ్చాయి. మోదీకి పాలన వైఫల్యాలను పూర్తి స్థాయిలో ఎండగట్టాలని పార్టీ నిర్ణయం తీసుకుంది.
ప్రత్యేకించి ఏ నాయకుడిని మందలించనప్పటికీ, కొన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ పుంజుకోవడం కొన్ని రాష్ట్రాల్లో దాదాపుగా లేదా పూర్తిగా తుడిచివేయబడటం, మరికొన్నింటిలో ఆశించిన స్థాయి కంటే తక్కువ పనితీరు కనబరిచిందని పార్టీ హైకమాండ్ గుర్తించింది.
రాష్ట్రాలను మళ్లీ పరిశీలించండి
కొన్ని రాష్ట్రాల్లో పార్టీ పనితీరుపై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టి పున: వ్యవస్థీకరణ చేయాలని తీర్మానించింది. కొన్ని అత్యవసర నిర్ణయాలతో పాటు మరికొన్ని వ్యవస్థలను తీర్చిదిద్దాలని కూడా సీడబ్ల్యూసీ నిర్ణయం తీసుకుంది.
పార్టీ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్ మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పేలవమైన లేదా అంచనాల కంటే తక్కువ పనితీరు కనబరిచిన రాష్ట్రాలను సందర్శించి, అవసరమైన సంస్థాగత దిద్దుబాట్ల కోసం ఖర్గే త్వరలో కమిటీలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
"వచ్చే నెల లేదా రెండు రోజుల్లో AICC, అనేక రాష్ట్ర యూనిట్ల పునర్వ్యవస్థీకరణను తోసిపుచ్చలేము" అని కొన్ని వర్గాలు తెలిపాయి.
"తక్షణ ప్రాధాన్యత, వాస్తవానికి, రాబోయే పార్లమెంటు సమావేశాలు, ఎన్‌డిఎకు వ్యతిరేకంగా ఇండి కూటమి ఐక్య, దృఢమైన ఫ్రంట్‌ను ఏర్పాటు చేస్తుందని వెల్లడించింది. రాబోయే నెలల్లో హర్యానా, మహరాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా పార్టీ నిర్మాణంపై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టాలని లోక్ సభ ఎన్నికల్లో సాధించిన విజయాల ఆధారంగా పని చేస్తున్నామని కాంగ్రెస్ సీనియర్ ప్రధాన కార్యదర్శి ఒకరు ఫెడరల్‌తో అన్నారు.
"తర్వాత, జార్ఖండ్, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి; జార్ఖండ్‌లో గిరిజనేతర ప్రాంతాలను కవర్ చేయాలి. ఢిల్లీలో పార్టీని పునర్నిర్మించడానికి మాకు పూర్తిగా కొత్త విధానం అవసరం. చాలా సంస్థాగత పనులు చేయాల్సి ఉంది. CWC తన తీర్మానంలో కూడా దీనిని గుర్తించింది, అయితే మేము దానిని వెంటనే క్యాష్ చేయడం ప్రారంభించాలి ” అని కాంగ్రెస్ సీనియర్ ప్రధాన కార్యదర్శి తెలిపారు.