సీట్ల పంపకాలపై ఎన్డీఏలో విభేదాలు

హిందూస్తాన్ అవామీ మోర్చా, రాష్ట్రీయ లోక్ మోర్చా లకు స్థాయికి తగ్గట్లు గుర్తింపు రాలేదని నిట్టూర్పులు

Update: 2025-10-13 10:25 GMT

బీహార్ అసెంబ్లీకి జరగబోయే ఎన్నికలకు సంబంధించి ఎన్డీఏ సీట్ల షేరింగ్ ను నిన్ననే పూర్తి చేసింది. అయితే సీట్ల పంపకాలలో తమకు పూర్తిగా అన్యాయం జరిగిందని ఆ కూటమిలోని పార్టీలు తమ స్వరం క్రమంగా పెంచుతున్నాయి.

కేంద్రమంత్రి జితన్ రామ్ మాంఝీ నేతృత్వంలోని హిందుస్తానీ అవామ్ మోర్చా, రాజ్యసభ ఎంపీ ఉపేంద్ర కుష్వాహా నేతృత్వంలోని రాష్ట్రీయ లోక్ మోర్చా పార్టీలు పంపకాల ఫార్ములాలపై తమ అసంతృప్తి వ్యక్తం చేశాయి.

ఇంకా కావాలి..
వచ్చే ఎన్నికలలో 243 సభ్యులున్న అసెంబ్లీకి పోటీ చేసే సీట్ల సంఖ్యను ఎన్డీఏ ఆదివారం వెల్లడించింది. ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ నేతృత్వంలోని జేడీ(యూ), బీజేపీ లు చెరో 101 స్థానాలలో పోటీ చేయాలని నిర్ణయించారు.
మిగిలిన స్థానాలను మిగిలిన మిత్రపక్షాలకు కేటాయించారు. కేంద్రమంత్రి చిరాగ్ పాసవాన్ నేతృత్వంలోని లోక్ జనశక్తి(రామ్ విలాస్) కు 29 స్థానాలు పోటీ చేయబోతున్నారు.
సీట్ల పంపకాల ఏర్పాట్లపై వ్యాఖ్యానిస్తూ మాంఝీ ఆదివారం విలేకరులతో మాట్లాడారు. హై కమాండ్ నిర్ణయించిన దానిని మేము అంగీకరించాము. కానీ మాకు కేవలం ఆరు సీట్లు ఇవ్వడం ద్వారా వారు మమ్మల్ని తక్కువ అంచనా వేస్తున్నారు. ఇది ఎన్నికలలో ఎన్డీఏకు నష్టం కలిగించవచ్చని అన్నారు.
కుష్వాహా కూడా ఇదే తరహాలో మాట్లాడారు. సీట్ల పంపకాల తరువాత తన పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ఎక్స్ లో ట్వీట్ చేశారు. ‘‘ప్రియమైన మిత్రులారా, సహోద్యోగులారా. నేను క్షమాపణ చెబుతున్నాను.
మాకు వచ్చిన సీట్ల సంఖ్య మీ అంచనాలకు అనుగుణంగా లేదు. ఈ నిర్ణయం మన పార్టీ అభ్యర్థులుగా ఉండాలని ఆశించిన సహోద్యోగులను బాధపడుతుందని నేను అర్థం చేసుకున్నాను’’ అని ట్వీట్ చేశారు.
‘‘ఈ రోజు చాలా ఇళ్లలో ఆహారం వండుకోకపోవచ్చు. అయితే మీ అందరూ నా పార్టీ పరిమితులను అర్థం చేసుకోవాలని అభ్యర్థిస్తున్నాను. మీ కోపతాపాలను తగ్గించుకోవాలని నేను మిమ్మల్ని వినయంగా అభ్యర్థిస్తున్నాను. అప్పుడు ఈ నిర్ణయం ఎంత సముచితమో మీరే గ్రహిస్తారు. మిగిలినది కాలం నిర్ణయిస్తుంది’’ అని ఆయన అన్నారు.
నితీశ్ కుమార్...
తన పార్టీకి జాతీయ స్థాయిలో గుర్తింపు లభించాలంటే కనీసం 15 సీట్లు కావాలని మాంఝీ పట్టుబడుతున్నారు. దేశ రాజధానిలో ఎన్నికల సీట్ల సర్ధుబాటు ప్రకటన రావడానికి ముందే ఆయన పాట్నాకు బయల్దేరాడు.
కానీ ఆయన నోటి నుంచి తిరుగుబాటు ప్రకటన రాలేదు. రాష్ట్రంలో రెండు అగ్రపార్టీలు సమాన సంఖ్యలో పోటీ చేయడం మాత్రం ఇదే మొదటిసారి.
పాట్నాలో రాష్ట్ర కాంగ్రెస్ అధికార ప్రతినిధి రాజేశ్ రాథోడ్ ఎన్డీఏ విమర్శలు గుప్పించారు. ‘‘సీట్ల సంఖ్య ఒప్పందం నితిశ్ కుమార్ స్థాయి తగ్గిందని స్పష్టం చేస్తోంది’’ అని ఆరోపించారు.
రెండు ప్రధాన పార్టీలు మిత్రపక్షాలుగా ఉన్నప్పటికీ అసెంబ్లీ ఎన్నికలలో జేడీ(యూ) బీజేపీ కంటే ఎక్కువ సీట్లలో పోటీ చేయకపోవడం ఇదే మొదటిసారి. రాబోయే రోజులలో బీజేపీ, జేడీ(యూ) ను కబళిస్తుందనడానికి ఇది స్పష్టమైన సంకేతమని అన్నారు.


Tags:    

Similar News