విషాదంగా ముగిసిన కాస్మోటిక్స్ వ్యాపారీ ఢిల్లీ ప్రయాణం
పేలుడులో ఇద్దరు మేనల్లుళ్ల మృతి
By : The Federal
Update: 2025-11-11 11:18 GMT
ఉబెర్ నక్షబందీ
నిన్న సాయంత్రం ఢిల్లీకి ప్రయాణించిన ఓ వ్యాపారి బిజినెస్ ప్రయాణం పీడకలలా మారింది. ఉత్తర ప్రదేశ్ కు చెందిన మెహబూబ్ తన మేనల్లుళ్లు అమన్ అన్సారీ, నోమన్ అన్సారీ లతో కలిసి రాజధానికి చేరుకున్నారు.
ఉత్తర ప్రదేశ్ లోని షామ్లీలోని జింఝానాలోని మెహబూబ్ కుటుంబ సభ్యులు ఒక కాస్మెటిక్ దుకాణం నడుపుతున్నారు. వీరు తమ దుకాణానికి వస్తువులను కొనుగోలు చేయడానికి ఢిల్లీ మార్కెట్ కు చేరుకున్నారు. కానీ ఎర్రకోట సమీపంలో కారు పేలుడు వారి ప్రయాణానికి విషాదకరమైన ముగింపు పలికింది.
పేలుడు..
దాడి తరువాత మెహబూబ్ సాయంత్రం అంతా తన మేనల్లుళ్లు 20 ఏళ్ల యువకులు అమన్, నోమన్ కోసం వెతికాడు. ‘‘మేము షాపింగ్ కోసం ఓల్డ్ ఢిల్లీలో ఉన్నాము. అదే సమయంలో అక్కడ పేలుడు సంభవించింది.
అందరూ అటు వైపు పరిగెత్తారు’’ అని ఆయన గుర్తు చేసుకున్నారు. మెహబూబ్ కు మాత్రమే కాదు. ఇతర బంధువులకు కూడా ఇది భయంకరమైన రాత్రి వారు రాత్రంతా వెతికారు. చివరకు అమన్ కాల్ చేయగా, తాను గాయపడ్డానని, హస్పిటల్ లో ఉన్నానని చెప్పాడు. నోమన్ తనకు కనిపించడం లేదని వివరించాడు.
అర్థరాత్రి 12 గంటల ప్రాంతంలో మెహబూబ్ తన బంధువులతో కలిసి ఎల్ఎన్జేపీ ఆస్పత్రికి చేరుకున్నారు. అయితే హోంమంత్రి అమిత్ షా, ఢిల్లీ సీఎం రేఖా గుప్తా సందర్శన కారణంగా వారికి చాలా సేపు ఎంట్రీ దొరకలేదు. అలాగే ఆస్పత్రి యాజమాన్యం కూడా దీనిపై స్పష్టత ఇవ్వలేదు.
వారి మరణం..
ఆందోళన చెందుతున్న బంధువులను ఆస్పత్రిలో లోపలికి అనుమతించకపోవడంతో అక్కడ గందరగోళం చెలరేగింది. మొదటి 20 మంది గాయపడ్డారని, ఎనిమిది మంది చనిపోయినట్లు చెప్పారు.
వారి గుర్తింపును కూడా ప్రభుత్వం రహస్యంగా ఉంచింది. మంగళవారం తెల్లవారుజామున నోమన్ కూడా ఉన్నాడని కుటుంబానికి చివరగా తెలిసింది. చివరకు మరణాల సంఖ్య 12కి పెరిగింది.
ఒకరు అధికారి ది ఫెడరల్ తో మాట్లాడుతూ.. ఎనిమిది మృతదేహాలు అప్పగించినట్లు చెప్పారు. ‘‘ఒక మృతదేహం మార్చురీ లోపల ఉంది. ఆ వ్యక్తి గుర్తింపు ఇంకా నిర్ధారించలేదు’’ అని ఎల్ఎన్జేపీ అధికారి ఒకరు తెలిపారు.
మధ్యాహ్నాం 12.30 గంటల ప్రాంతంలో నోమన్ మృతదేహాన్ని మెహబూబ్, బంధువులకు అప్పగించారు. మీడియా వారిని వెంబడించినప్పటికీ వారు మృతదేహాంతో హడావుడిగా వెళ్లిపోయారు.