వ్యాపారవేత్త, సెక్యూరిటీ గార్డ్ మృతి
పొద్దున్న బస్ కండక్టర్, రాత్రి సెక్యూరిటీ గార్డ్ గా విధులు నిర్వర్తిస్తున్నా అశోక్ కుమార్
By : Praveen Chepyala
Update: 2025-11-11 10:23 GMT
ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో జరిగిన కారు బాంబ్ పేలుడులో మొత్తం 12 మంది చనిపోయారు. ఇందులో ప్రాణాలు కోల్పోయిన ఢిల్లీ బస్ కండక్టర్ అశోక్ కుమార్ ఉదయం వేళలో కండక్టర్ గా, రాత్రిపూట సెక్యూరిటీ గార్డ్ గా విధులు నిర్వర్తిస్తున్నాడు.
ఐదుగురు సభ్యులున్నా కుటుంబంలో అశోక్ కుమార్ ఒక్కరే సంపాదిస్తున్నారు. అతడిది ఉత్తర ప్రదేశ్ లోని అమ్రోహ స్వస్థలం. అతడి తల్లి ప్రస్తుతం స్వస్థలంలోనే ఉంది. సోమవారం అశోక్ బైక్ పై ఎక్కడికో వెళ్తుండగా ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ఎల్ ఎన్ జేపీ ఆస్పత్రి వెలుపల ఉన్న బంధువు పప్పు, అశోక్ మరణవార్త విని షాక్ కు గురయ్యాడు.
అశోక్ ఢిల్లీలోని జగత్ పూర్ లో పేలుడు జరిగిన 15 కిలోమీటర్ల దూరంలో నివసించాడు. అతనికి భార్య, నలుగురు పిల్లలు ఉన్నారు. ఇందులో ముగ్గురు ఆడ పిల్లలు.
వ్యాపారవేత్త..
అమర్ కటారియా కూడా ఈ దుర్ఘటనలో మరణించాడు. శ్రీనివాసపురి కాలనీ చెందిన 34 ఏళ్ల ఫార్మాస్యూటికల్ వ్యాపారవేత్త. ఎర్రకోట నుంచి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న భగీరథ్ ప్యాలెస్ లోని తన ఫార్మసీని మూసివేసి ఇంటికి వెళ్తున్న తరుణంలో పేలుడు జరిగింది. పేలుడులో మరణించిన ఈ రిక్షా డ్రైవర్ జుమ్మన్ కుటుంబ సభ్యులు మౌలానా ఆజాద్ మెడికల్ కాలేజీలోని మార్చురీ వెలుపల రోదిస్తున్న దృశ్యాలు కనిపించాయి.
కారు పేలుడు
సాయంత్రం 6.52 గంటలకు హర్యానాలో రిజిస్టర్ చేసిన హ్యుందాయ్ ఐ20 కారు ఎర్రకోట మెట్రో స్టేషన్ గేట్ నంబర్ 1 సమీపంలో పేలింది. ఈ పేలుడులో 20 మంది గాయపడ్డారు. పేలుడు ధాటికి సమీపంలోని వాహానాలు దెబ్బతిన్నాయి. ఘటనా స్థలం నుంచి తీసిన గ్రాఫిక్ చిత్రాలు విధ్వంసం పరిధిని వెల్లడించాయి. ఈ సంఘటనను అనుమానిత ఉగ్రవాద దాడిగా పరిగణించి అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
యూఏపీఏ
ఫోరెన్సిక్ పరిశోధనలు, నిఘా వర్గాల సమాచారం ప్రకారం ఉగ్రవాద సంబంధాలు ఉన్నాయనే అనుమానంతో ఢిల్లీ పోలీసులు చట్టవిరుద్ద కార్యకలాపాల(నివారణ) చట్టం (యూఏపీఏ) లోని సెక్షన్లను ప్రయోగించారు. ముఖ్యంగా ఈ పేలుడు హర్యానాలోని ఫరీదాబాద్ కేవలం 50 కిలోమీటర్ల దూరంలో 2,900 కిలోల పేలుడు పదార్థాల భారీ డంప్ ను కనుగొనే సమయంలో ఈ పేలుడు జరిగింది.