అల్ ఫలాహ్ యూనివర్శిటీపై కేంద్ర దర్యాప్తు సంస్థల దృష్టి
ఢిల్లీ ఆత్మాహుతి దాడి తరువాత వెలుగులోకి వచ్చిన విశ్వవిద్యాలయం
By : Praveen Chepyala
Update: 2025-11-18 05:28 GMT
దేశ రాజధాని లోని చారిత్రాత్మక ఎర్రకోట దగ్గర జరిగిన ఆత్మాహుతి దాడి సంఘటనపై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్(ఈడీ) మంగళవారం ఫరీదాబాద్ లోని అల్ ఫలాహ్ విశ్వవిద్యాలయం, దాని ప్రమోటర్లు సంబంధిత వ్యక్తులపై సోదాలు ప్రారంభించింది.
ఈ రోజు తెల్లవారుజాము ఢిల్లీ ఎన్సీఆర్ లోని పలు ప్రాంతాల్లో ఫెడరల్ దర్యాప్తు సంస్థ బృందాలు సోదాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఈ కేసులో ఎన్ఐఏ, ఢిల్లీ పోలీసులు దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ ల ఆధారంగా ఈడీ మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో ఆర్థిక ఉగ్రవాద నిధుల సంబంధాలపై ఏజెన్సీ దర్యాప్తు చేస్తోంది.
సోదాలు ఉదయం 5 గంటలకు ప్రారంభమైనట్లు సమాచారం, విశ్వవిద్యాలయ ట్రస్టీలపై కూడా దాడులు జరుగుతున్నాయి. ఇప్పటివరకూ ఎన్ఐఏ ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసింది.
వారు ఆత్మాహుతి బాంబర్ డాక్టర్ ఉమర్ నబీకి సన్నిహితులు అని ఆరోపణలు ఉన్నాయి. ‘‘వైట్ కాలర్ టెర్రర్ మాడ్యూల్’’ లో భాగమని అనేక మంది వైద్యులు ఆరోపణలు ఎదుర్కొంటున్న సమయంలో అల్ ఫలాహ్ విశ్వవిద్యాలయం పేరు బయటకు వచ్చింది. ఇది ఢిల్లీ సమీపంలోని హర్యానాలోని ఫరీదాబాద్ జిల్లాలోని ధౌజ్ ప్రాంతంలో ఉంది. ఇది ఒక వైద్య కళాశాలతో కూడిన బోధానాసుపత్రి.
‘నాక్’ గుర్తింపు లేదు
యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ), నేషనల్ అసెన్ మెంట్ అండ్ అక్రిడిటేషన్ కౌన్సిల్(నాక్) నివేదించిన నియంత్రణ ఉల్లంఘనల తరువాత మోసం, ఫోర్జరీ ఆరోపణలపై క్రైమ్ బ్రాంచ్ విశ్వవిద్యాలయంపై రెండు ఎఫ్ఐఆర్ లు నమోదు చేసినట్లు శనివారం జాతీయ మీడియా కథనాలు ప్రసారం చేసింది.
సోదాల్లో ఈ విశ్వవిద్యాలయం పెద్ద అవకతవకలను బయట పడ్డాయి. దర్యాప్తులో మరికొన్ని వివరాలు తెలుసుకునేందుకు విశ్వవిద్యాలయం ఓఖ్లా కార్యాలయాన్ని సందర్శించింది. అల్ ఫలాహ్ విశ్వవిద్యాలయ ఛాన్సలర్ సోదరుడిని 25 ఏళ్ల క్రితం నాటి మోసం కేసులో మధ్యప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేశారు.
ఛాన్సలర్ సోదరుడు..
మధ్యప్రదేశ్ లోని మోవ్ పట్టణంలో సుమారు రూ. 40 లక్షల పెట్టుబడి మోసం కేసులో నమోదైన మూడు కేసులకు సంబంధించి అల్ ఫలాహ్ విశ్వవిద్యాలయ ఛాన్సలర్ జావద్ అహ్మద్ సిద్ధిఖీ తమ్ముడు హమూద్ అహ్మద్ సిద్ధిఖీ(50) ను ఆదివారం అరెస్ట్ చేసినట్లు ఎస్పీ యాంగ్చెన్ డోల్కర్ భూటియా చెప్పారు.
‘‘పెట్టుబడి ముసుగులో ప్రజల నుంచి డబ్బు తీసుకుని, పెట్టుబడిపై 20 శాతం వడ్డీ ఇస్తామని హమీ ఇచ్చాడని ఆరోపణలు ఉన్నాయి. అతను రెండు సంవత్సరాలు మోహో కంపెనీని నడిపాడు.
మూడో సంవత్సరంలో తన కుటుంబంతో సహ మోవ్ పట్టణంలో పారిపోయాడు’’ అని అధికారి తెలిపారు. ఈ మూడు కేసులు హమూద్ సిద్ధిఖీ పై 2000 సంవత్సరంలో ఐపీసీ సెక్షన్ 420(మోసం) ఇతర సెక్షన్లపై కేసు నమోదు చేసినట్లు అధికారి తెలిపారు.
వీటితో పాటు 1988, 1989 లో మౌ పట్టణంలో అల్లర్లు, హత్యాయత్నం ఆరోపణలపై కేసులు నమోదు అయ్యాయని పోలీస్ అధికారి తెలిపారు. 2019 లో హమూద్ సిద్ధిఖీని అరెస్ట్ చేసినందుకు రూ. 10 వేల రివార్డును ప్రకటించినట్లు అధికారులు తెలిపారు.