పాట్నా వీడి ఢిల్లీకి చేరుకున్న నలుగురు లాలూ కుమార్తెలు

ఆర్జేడీ పరాజయం తరువాత తీవ్రమైన కుటుంబపోరు, తేజస్వీ యాదవ్ వర్సెస్ సోదరీమణులుగా మారిన కలహాలు

Update: 2025-11-17 07:26 GMT
పాట్నా వీడి ఢిల్లీకి ప్రయాణమవుతున్నా లాలూ కుమార్తెలు

బీహార్ ఎన్నికల ఫలితాల తరువాత ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబంలో పుట్టిన ముసలం మరింత పెరిగినట్లు తెలుస్తోంది. రోహిణి ఆచార్య రాజకీయాలను వదిలివేసినట్లు ప్రకటించిన మరుసటి రోజు ఆయన నలుగురు కుమార్తెలు రాజలక్ష్మి, హేమ, చందా కూడా పాట్నా వదిలి ఢిల్లీకి వెళ్లారు.

గత రెండు రోజులుగా కుటుంబంలో జరిగిన పరిణామాలు వారిని తీవ్రంగా కలవర పెట్టాయని సమాచారం. బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఆర్జేడీ చిత్తుచిత్తుగా పరాజయం పాలైంది.

ఈ తరుణంలో కుటుంబంలోని వివాదాలు మొదలయ్యాయి. అవి క్రమంగా తేజస్వీ యాదవ్ వర్సెస్ మిగిలిన కుటుంబ సభ్యులుగా మారినట్లు తెలుస్తోంది. ఈ ఎన్నికల్లో ఆ పార్టీ సీట్ల సంఖ్య 75 నుంచి 25 కి పడిపోయాయి.

తేజ్ ప్రతాప్ ఏమన్నారంటే..
ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలపై లాలూ ప్రసాద్ యాదవ్ పెద్ద కుమారుడు, ఆర్జేడీ బహిష్కృత నాయకుడు తేజ్ ప్రతాప్ యాదవ్ స్పందించారు. ఈ పరిస్థితి తన హృదయాన్ని కుదిపేసిందని జనశక్తి జనతాదళ్ సోషల్ మీడియా ఖాతా లో పోస్ట్ చేశారు.
తాను అనేక వ్యక్తిగత దాడులు భరించానని, కానీ తన సోదరికి జరిగిన అవమానం మాత్రం భరించలేనిదని అన్నారు. ఈ అన్యాయం పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని ఆయన హెచ్చరించారు.
లాలూ ప్రసాద్ యాదవ్ కు నేరుగా విజ్ఞప్తి చేస్తూ.. మీరు నాకు తండ్రి ఒక్క ఆదేశం ఇవ్వండి, బీహార్ ప్రజలు ఈ జయచంద్రులకు( వెన్నపోటు దారులను జయచంద్ర పేరుతో పిలుస్తారు) సమాధి కట్టేస్తారు’’ అని పోస్ట్ చేశారు.
తేజస్వీ యాదవ్ కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకోవడంలో కొన్ని ముఖాలు ప్రభావితం చేశాయని ఆయన ఆరోపించారు. ఈ వివాదం ఇప్పుడు కుమార్తె గౌరవం, బీహార్ ఆత్మగౌరవానికి సంబంధించిన అంశంగా మారిందని పేర్కొన్నారు.
రోహిణీ ఆచార్య..
ఎన్నికల ఫలితాల తరువాత రోహిణి ఆచార్య రాజకీయాలను వదిలివేస్తున్నట్లు, తన కుటుంబం తనను వెలివేసినట్లు సామాజిక మాధ్యమాల్లో ప్రకటించడంలో కుటుంబంలో సమస్యలు ఉన్నట్లు బహిరంగంగా తెలిసింది.
తన సోదరుడు తేజస్వీ యాదవ్, ఆయన ఇద్దరు సన్నిహితులు ప్రస్తుతం ఆర్జేడీ రాజ్యసభ ఎంపీగా ఉన్న సంజయ్ యాదవ్, రమీజ్ఈ పరిస్థితికి కారణమని ఆమె ఆరోపించారు.


Tags:    

Similar News