బీహార్: కొత్త ప్రభుత్వంలో నితీశ్ కు ఫ్రీ హ్యాండ్ ఉంటుందా?

బీజేపీ నుంచి ఇద్దరు ఉప ముఖ్యమంత్రులు, మరో ఉప ముఖ్యమంత్రి కోరుతున్నా చిరాగ్ పాశ్వాన్

Update: 2025-11-17 10:23 GMT
నితీశ్ కుమార్ తో ఎల్జేపీ(ఆర్) అధినేత, కేంద్రమంత్రి చిరాగ్ పాశ్వాన్

పునీత్ నికోలస్ యాదవ్

ఇటీవల జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో జేడీ(యూ), బీజేపీ కంటే తక్కువ సీట్లు గెలుచుకున్నప్పటికీ మరోసారి నితీశ్ కుమార్ సీఎంగా బాధ్యతలు స్వీకరించడానికి సిద్దంగా ఉన్నారు. అయితే చివరి నిమిషంలో ఎలాంటి ట్విస్టులు లేకుంటేనే ఇది సాధ్యమవుతుంది.

ప్రస్తుత అసెంబ్లీ గడువు మరో రెండు రోజులలో ముగియబోతోంది. అంటే నవంబర్ 20 న కొత్త మంత్రివర్గం కొలువదీరాల్సి ఉంది. గడచిన రెండు దశాబ్ధాలలో నితీశ్ కుమార్ పదోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి సిద్దంగా ఉన్నారు.

బీహార్ విజయంపై కొంతమంది ఎన్డీఏ నాయకులు ‘ది ఫెడరల్’ తో మాట్లాడారు. మొన్నటి ఫలితాల్లో బీజేపీ 89 స్థానాలు, జేడీ(యూ) 84 స్థానాలు తన ఖాతాలో వేసుకుంది.

అయితే ముఖ్యమంత్రి పీఠంపై తనకు ఆశ లేదని బీజేపీ ధృవీకరించింది. రాబోయే కాలంలో ముఖ్యమంత్రి మార్పు సాధ్యమేనా అనే దానిపై బీజేపీ నాయకత్వం మధ్య ఎటువంటి చర్చలు జరగలేదని రెండు పార్టీల వర్గాలు తెలిపాయి.

నవంబర్ 14న జరిగిన ఎన్నికల్లో 243 మంది సభ్యులున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో 202 స్థానాలు గెలుచుకుని ఎన్డీఏ అఖండ విజయాన్ని నమోదు చేసింది. కూటమిలోని మిగిలిన పార్టీలు కూడా కూడా 28 స్థానాలకు తమ ఖాతాలో వేసుకున్నాయి.
నేడు కేబినేట్ సమావేశం..
ఫలితాల తరువాత వారాంతంలో పాట్నా, ఢిల్లీలో ఎన్డీఏ నాయకుల మధ్య తీవ్రమైన సమావేశాలు జరిగాయి. నితీశ్ సన్నిహితులైన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సంజయ్ ఝా, కేంద్రమంత్రి రాజీవ్ రంజన్ సింగ్ ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేడీ నడ్డాతో సమావేశం అయ్యారు.
నితీశ్ ఇదే సమయంలో పాట్నాలోని ‘అన్ని’ మార్గ్ లో ఎల్జేపీ(ఆర్) చీఫ్ చిరాగ్ పాశ్వాన్, బీజేపీ నాయకుడు ఉపముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరీ, ఆర్ఎల్ఎం చీఫ్ ఉపేంద్ర కుష్వాహాతో సమావేశాలు నిర్వహించారు.
ఇందులో హిందూస్థాన్ అవామీ మోర్చా చీఫ్ మాంఝీ కూడా పాల్గొన్నారు. వీరితో మాట్లాడిన తరువాత నితీశ్ కుమార్ సీఎంగా ఉండటాన్ని అంగీకరించారని తెలిసింది.
సోమవారం నితీశ్ అధ్యక్షత వహించే కేర్ టేకర్ కేబినేట్ సమావేశంలో బీహార్ అసెంబ్లీ రద్దుకు తీర్మానం ఆమోదించబడుతుందని వర్గాలు తెలిపాయి. ఆ తరువాత ఆయన బీహార్ గవర్నర్ ఆరిఫ్ మహమ్మాద్ ఖాన్ ను కలిసి తీర్మానాన్ని అందజేసి, కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అనుమతి కోరనున్నారు. తరువాత నితీశ్ కుమార్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తారని, కొత్త బీహార్ మంత్రివర్గం ప్రమాణ స్వీకారం తేదీని గవర్నర్ తో సమావేశం తరువాత నిర్ణయించనున్నారు.
ఇద్దరు డిప్యూటీ సీఎంలు..
కొత్త ప్రభుత్వంలో కూడా ఇద్దరు ఉప ముఖ్యమంత్రులను బీజేపీ కోరుతోంది. ప్రస్తుత మంత్రివర్గంలో ఈ పదవిని సామ్రాట్ చౌదరి, విజయ్ కుమార్ సిన్హా ఇద్దరు డిప్యూటీ సీఎంలుగా ఉండబోతున్నారు.
వెనకబడిన కులానికి చెందిన కుష్వాహా సామ్రాటి మళ్లీ డిప్యూటీ సీఎంగా తిరిగి వస్తారని భావిస్తున్నప్పటికి భూమిహార్ అనే అగ్రవర్ణానికి చెందిన సిన్హాను కొనసాగించడంపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి.
చిరాగ్ పాశ్వాన్ కూడా తనకు కేటాయించిన 29 సీట్లలో 19 గెలుచుకున్నాడు. అందుకోసం తనకు కూడా ఓ డిప్యూటీ సీఎం పదవి కావాలని కోరుతున్నాడు. చిరాగ్ డిమాండ్ ఇంకా పరిశీలనలోనే ఉందని జేడీ(యూ) వర్గాలు తెలిపాయి.
సానుభూతి పవనాలు..
తనకు ఎక్కువ సీట్లు వచ్చినప్పటికీ ముఖ్యమంత్రి పీఠాన్ని మాత్రం నితీశ్ కుమార్ కు ఇవ్వాలని బీజేపీ నిర్ణయించుకుంది. ఇవన్నీ ఎన్నికల ఫలితాల తరువాత వచ్చిన ఊహగానాలకు చెక్ పెట్టినట్లు అయింది.
బీహార్ లో ఉన్న బీజేపీ నేతలకు సీఎం అనేది అందని ద్రాక్షగా మారింది. ప్రస్తుతం ఈ పదవిపై సామ్రాట్ చౌదరితో సహ అనేక మంది నాయకులు బహిరంగంగా ప్రకటిస్తూ వస్తున్నారు.
బీహార్ ఎన్నికల ప్రచారంలో నితీశ్ ఆరోగ్యం క్షీణించడం ప్రశ్నలు వచ్చాయి. మరోసారి ఎన్డీఏ అధికారంలోకి వస్తే తిరిగి ఆయన ముఖ్యమంత్రి పీఠంపై కూర్చుంటారనే అంశంపై సందేహాలు తెచ్చాయి. ఇది తాజా ఎన్నికలలో జేడీ(యూ)కు అత్యధిక సీట్లు రావడానికి ఓ కారణంగా చెప్పవచ్చు.
ఇవి తేజస్వీ యాదవ్ లో ఉన్న వ్యక్తిత్వ లోపాలపై కూడా దృష్టి నిలిపి, అవి ఎన్డీఏ కూటమి వైపు ప్రజలు మళ్లించేలా దోహదపడ్డాయి. మరో వైపు ముఖ్యమంత్రి పదవిపై ఆశ పెట్టుకున్నా బీజేపీ నేతలకు కూడా గొంతులో పచ్చివెలక్కాయ పడినట్లు అయింది.
నితీశ్ ఏం చేయబోతున్నారు..
ప్రస్తుత ఫలితాలు మరోసారి పాత సంఘటనలు పునరావృతం అయ్యే అవకాశాలకు దారి తీయవచ్చు. సీఎం పదవి నుంచి నితీశ్ ను బలవంతంగా కిందికి దింపితే ఆయన మరోసారి మహ ఘట్ బంధన్ తో జతకట్టవచ్చు.
ఆ పార్టీకి 35 సీట్ల వరకూ సాధించాయి. అయితే ఈ ఫలితాలు నితీశ్ కు మరోమార్గం లేకుండా అన్వేషించడానికి అవకాశం లేకుండా చేశాయి. ఎందుకంటే అతని పార్టీకి 84 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ మహ కూటమికి 35 సీట్ల సంఖ్యతో సాధారణ మెజారిటీని కూడగట్టలరని ఆయన ఆశించలేరు.
అయితే పరిస్థితులు ప్రకారం.. కాషాయ పార్టీ తన దీర్ఘకాల కానీ అనూహ్య మిత్రపక్షం కోసం అలాంటి గొడవలకు దిగకూడదని నిర్ణయించుకుంది. కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంకీర్ణ ప్రభుత్వం స్థిరత్వం ఇప్పటికే జేడీయూ కు చెందిన 12 మంది లోక్ సభ ఎంపీలపై ఆధారపడి ఉందని, దీనిని ఇప్పటికే శివసేన, ఎన్సీపీ వంటి లాగా విభజన రాత్రికి రాత్రి సాధ్యంకాకపోవచ్చు.
కాబట్టి నితీశ్ కుమార్ ప్రస్తుతానికి ప్రశాంతంగా ఉండవచ్చు. తనను ముఖ్యమంత్రిగా కొనసాగించడానికి అనుమతించినందుకు మోదీకి నితీశ్ రుణపడి ఉండవచ్చు. కానీ బహుశా తన వెనక ఉన్న కుర్చీని ఎప్పుడూ కూల్చవచ్చో అని ఆలోచిస్తూ ఉండవచ్చు.


Tags:    

Similar News