మణిపూర్: ‘బ్రాండ్ మోదీ’ ప్రచారం ఇక్కడ పనిచేస్తుందా?

దేశంలో ఎక్కడైన బ్రాండ్ మోదీతో ప్రచారం చేస్తున్న కమలదళానికి మణిపూర్ లో మాత్రం కలిసిరావట్లేదు. అక్కడ జరిగిన హింస తరువాత ప్రధాని మోదీ రాష్ట్రానికి ఇక్కడకు రాలేదు.

By :  Admin
Update: 2024-04-09 05:54 GMT

సార్వత్రిక ఎన్నికల సమరంలో బీజేపీ అనుసరిస్తున్న ‘ బ్రాండ్ మోదీ’ ప్రచారం దేశ వ్యాప్తంగా కమలదళానికి కలిసొచ్చే అంశమే. కానీ కల్లోలిత మణిపూర్ లో మాత్రం అది బాధ్యతగా పరిణమించిందని చెప్పవచ్చు.

గత ఏడాది మే 3న రాష్ట్రంలోని మెజారిటీ మెయితీలు, గిరిజన కుకీ కమ్యూనిటీ మధ్య హింస చెలరేగింది. అప్పటి నుంచి, జాతి విభజన, విభేదాలతో రెండు వర్గాలు ఒకదానికొకటి పూర్తిగా వేరయ్యాయి. అయితే ఈ వివాదం చెలరేగిన తరువాత ఒక్కసారి కూడా ప్రధాని మోదీ మణిపూర్ ను సందర్శించలేదు. ఏప్రిల్ 19- 26 తేదీల్లో రెండు దశల్లో ఓటింగ్ జరగనున్నఈ రాష్ట్రంలో రెండు పార్లమెంటు స్థానాలు ఉన్నాయి. అయితే ఇంతవరకూ మోదీ మణిపూర్ కు రాకపోవడం, అసలు ఈ అంశంపై సరిగా దృష్టి పెట్టినట్లు కనిపించకపోవడం ఎన్నికల్లో ప్రధాన అంశాలుగా మారాయి.
మెయితీ ప్రాబల్యం ఉన్న ఇన్నర్ మణిపూర్‌లో ఏప్రిల్ 19న ఎన్నికలు జరగనున్నాయి. ఎస్టీ రిజర్వ్‌డ్ ఔటర్ మణిపూర్ నియోజకవర్గంలో భద్రతా కారణాల దృష్ట్యా ఏప్రిల్ 19 - 26 తేదీల్లో పోలింగ్ జరగనుంది.
'ప్రధానమంత్రి మమ్మల్ని నిరాశపరిచారు'
"రాష్ట్రం గందరగోళంలో కొట్టుమిట్టాడుతోంది, అయినప్పటికీ ప్రధాని ఇక్కడికి వచ్చి దాదాపు ఏడాది కాలంగా సహాయ శిబిరాల్లో బాధపడుతున్న మహిళలు మరియు పిల్లల బాధలను పరిష్కరించడానికి సమయం దొరకలేదు" అని మణిపూర్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (MPCC) వైస్ ప్రెసిడెంట్ ఆల్ఫ్రెడ్ కె ఆర్థర్ అన్నారు.
మణిపూర్ ప్రజలు ప్రధాని మోదీ మనతో ఎలా వ్యవహరించారో, అదే ఎన్నికల్లో ఆయనకు చూపించాల్సిన సమయం ఆసన్నమైందని ఆల్ప్రేడ్ అన్నారు. మణిపూర్‌ను ప్రధాని నిరాశపరిచారనే భావన, ప్రతిపక్ష కాంగ్రెస్ వ్యక్తం చేసింది. రాష్ట్రవ్యాప్తంగా, ముఖ్యంగా ఇంఫాల్ లోయలో ఇదే అంశం ప్రతిధ్వనించింది.
"ప్రధానమంత్రి ఉదాసీనత వల్ల మణిపూర్ ప్రజలు బాధపడ్డారు. పోలింగ్ స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా జరిగితే ఇది బిజెపికి భారీగా నష్టంగా జరగవచ్చు" అని రాష్ట్రంలోని ప్రముఖ సామాజిక, మానవ హక్కుల కార్యకర్త ఒనిల్ క్షేత్రమయుమ్ అన్నారు. మోదీ హమీలు ప్రజలకు చుక్కలు చూపిస్తున్నాయని అక్కడి ప్రతిపక్షం ఇప్పటికే ప్రచారంతో హోరెత్తిస్తోంది. దీనికి కౌంటర్ ప్రచారంగా ముఖ్యమంత్రి అనేక మంది ప్రభావవంతమైన పౌర సమాజ సంస్థలతో తన అధికార నివాసాల్లో సమావేశం నిర్వహిస్తున్నారు.
ఆడియో క్లిప్‌లను బీజేపీ ప్లే చేస్తోంది
మణిపూర్ గురించి ప్రధాని మోదీ మాట్లాడిన ప్రసంగాల వీడియోలను బీజేపీ ఈ ఎన్నికల ప్రచారంలో వాడుకుంటోంది. అందులో ఒకటి గతేడాది ఆగష్టు 15 సందర్భంగా ఎర్రకోటపై నుంచి చేసిన ప్రసంగం పాఠం "దేశం మొత్తం మణిపూర్ ప్రజలకు అండగా నిలుస్తుంది. అన్ని వివాదాల పరిష్కారానికి శాంతి ఒక్కటే మార్గం. రాష్ట్రంలో వీలైనంత త్వరగా శాంతి నెలకొనేలా కేంద్రం, మణిపూర్ ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తున్నాయి" అని మోదీ చెప్పారు. ఇదే మణిపూర్ ఎన్నికల్లో బీజేపీ చూపిస్తూ ఓట్లు అడుగుతోంది.
ఆ తర్వాత గతేడాది ఆగస్టులో పార్లమెంట్‌లో అవిశ్వాస తీర్మానం సందర్భంగా మోదీ ప్రసంగానికి సంబంధించిన ఆడియో క్లిప్‌ను ప్లే చేశారు. పార్లమెంటులో రెండు గంటలకు పైగా సుదీర్ఘ ప్రసంగంలో ప్రధాని మణిపూర్ హింసను మూడు నిమిషాలు మాట్లాడారు. మణిపూర్‌లో ప్రస్తుత పరిస్థితులపై ప్రధానమంత్రి ఎంత ఆందోళన చెందుతున్నారో, ప్రతిపక్షాలు ఆయనపై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నాయని ప్రజలకు చెప్పడానికి బిజెపి ఈ ప్రసంగాలను హైలైట్ చేస్తోంది. రాష్ట్రంలో హింస చెలరేగినప్పటి నుంచి ప్రధాని పరువు తీసేందుకు ప్రతిపక్షాలు విశ్వప్రయత్నాలు చేస్తున్నాయని కాషాయ శిబిరం పేర్కొంది.
బిజెపి ప్రభుత్వం, ప్రధాని మోదీని పరువు తీయడానికి కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్షాలు గత సంవత్సరం గిరిజన మహిళల 'నేక్డ్ పెరేడ్ వీడియో'ను కాంగ్రెస్ వైరల్ చేసిందని ముఖ్యమంత్రి ఆరోపించారు. తనపై వచ్చిన ఆరోపణలను క్లియర్ చేసేందుకు స్వయంగా మోదీ కూడా రంగంలోకి దిగారు.
"పరిస్థితిని సున్నితంగా ఎదుర్కోవడం మా సమిష్టి బాధ్యత అని మేము నమ్ముతున్నాము. నేను ఇప్పటికే పార్లమెంటులో దీని గురించి మాట్లాడాను. వివాదాన్ని పరిష్కరించడానికి మేము వనరులను, పరిపాలనా యంత్రాంగాన్ని అంకితం చేసాము. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సకాలంలో జోక్యం చేసుకోవడంతో రాష్ట్ర పరిస్థితిలో గణనీయమైన మెరుగుదల కనిపించింది. వివాదం తారాస్థాయికి చేరుకున్నప్పుడే కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాష్ట్రంలోనే ఉన్నారు. వివిధ వర్గాల వారితో 15 కి పైగా సమావేశాలు నిర్వహించి సమస్యను పరిష్కరించడంలో సాయం చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి అవసరమైన విధంగా కేంద్రం తన మద్దతును అందిస్తోంది. సాయక చర్యలు, పునరావాస ప్రక్రియ కొనసాగుతోంది. రాష్ట్రంలోని ఆశ్రయ శిబిరాల్లో నివసిస్తున్న ప్రజల సాయానికి, పునరావాసం కోసం ఆర్థిక ప్యాకేజీని కూడా చేపట్టే చర్యలలో భాగంగా ఉంది". అని ఈశాన్యా భారతానికి చెందిన ప్రముఖ దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రధాని చెప్పారు.
ఎట్టకేలకు మోదీ రాష్ట్రానికి వస్తారా? అనే ప్రశ్నకు రాష్ట్ర బీజేపీ నాయకత్వం వద్ద కూడా స్పష్టమైన సమాధానం లేదు. మణిపూర్‌కు పార్టీ స్టార్ క్యాంపెయినర్లుగా అమిత్ షా, ఇతర బిజెపి నాయకులతో పాటు మోదీ పేరు కూడా ఉంది. ఎన్నికల సమయంలో మోదీ మణిపూర్ గడ్డపై అడుగుపెడతారో లేదో పార్టీకి ఖచ్చితంగా తెలియదు. ఈ వారంలో షా రాష్ట్రంలో ప్రచారం చేయనున్నారు.
Tags:    

Similar News