24 అమెరికా ఉప్రగహాన్ని ప్రయోగించనున్న ఇస్రో

అమెరికా కోసం శ్రీవారి ఆశీస్సులు తీసుకున్న ఇస్రో చైర్మన్ వీ నారాయణన్….

Update: 2025-12-22 07:34 GMT

ఈరోజు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని  ఇస్రో చైర్మన్ నారాయణన్ దర్శించుకున్నారు. ఉదయం విఐపీ విరామ సమయంలో స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు.

డిసెంబర్ 24వ తేదీ LVM3 రాకెట్ ద్వారా అమెరికాకు చెందిన అత్యాధునిక కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని గగనతలంలోకి పంపనున్నారు. రాకెట్ల ప్రయోగం విజయవంతం కావాలని LVM3, అమెరికాకు చెందిన అత్యాధునిక కమ్యూనికేషన్ ఉపగ్రహ నమూనాను శ్రీవారి పాదాల చెంత ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో రాకెట్ నమూనాలకు, ఇస్రో చైర్మన్ నారాయణన్ కు వేదపండితులు వేద ఆశీర్వచనం అందించారు. l అనంతరం ఇస్రో ఛైర్మన్ మీడియాతో మాట్లాడుతూ… డిసెంబర్ 24 ఉదయం భారత బాహుబలి రాకెట్ LVM3 నింగిలోకి దూసుకెళ్లనున్నట్లు తెలిపారు. LVM3-M6 వాహకనౌక ద్వారా రెండు భారీ ఉపగ్రహాలను ప్రయోగించనున్నామని, ఇది భారత గడ్డపై నుంచి ప్రయోగించబడుతున్న అతి బరువైన ఉపగ్రహంగా రికార్డు సృష్టించనుందని పేర్కొన్నారు.

అమెరికాకు చెందిన అత్యాధునిక కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని కక్ష్యలో ప్రవేశపెట్టడం ద్వారా 4G, 5G సేవలు మరింత బలోపేతమవుతాయని, మొబైల్‌లకు నేరుగా కమ్యూనికేషన్ సౌకర్యం అందుబాటులోకి వస్తుందని వివరించారు. LVM3 రాకెట్‌కు ఇది మూడవ ఎక్స్‌క్లూసివ్ వాణిజ్య మిషన్ కాగా, మొత్తం LVM3 సిరీస్‌లో ఇది 9వ ప్రయోగమని తెలిపారు. అలాగే 2027 లక్ష్యంగా సాగుతున్న గగన్‌యాన్ కార్యక్రమం అడ్వాన్స్‌డ్ దశలో ఉందని, గగన్‌యాన్‌కు ముందు మూడు మానవరహిత ప్రయోగాలు చేపట్టనున్నట్లు ఇస్రో చైర్మన్ వెల్లడించారు.

Tags:    

Similar News