ఈ రోజు నుంచి కాలం చెల్లిన వాహనాలకు ‘నో ఫ్యూయల్’

పెరిగిపోతోన్న వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు ఢిల్లీ ప్రభుత్వ నిర్ణయం..;

Update: 2025-07-01 12:12 GMT

ఢిల్లీ(Delhi)లో వాయుకాలుష్యం(Air pollution) రోజురోజుకు పెరిగిపోతోంది. పరిశ్రమల కంటే వాహనాల నుంచే పొగ వల్లే పొల్యూషన్ పెరిగిందని ఇటీవల సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్‌మెంట్ (CSE) తన అధ్యయనంలో పేర్కొంది. దీంతో కాలుష్య నివారణకు ఢిల్లీలోని బీజేపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. 15 సంవత్సరాలు మించిన పెట్రోల్ వాహనాలకు, అలాగే 10 సంవత్సరాలు మించిన డీజిల్ వాహనాలకు జూలై 1వ తేదీ నుంచి ఇంధన నిషేధాన్ని అమల్లోకి తెచ్చింది. కాలం చెల్లిన వాహనాలు ఢిల్లీలోనే దాదాపు 62 లక్షలు ఉన్నాయి. ఇలాంటి వాహనాలు హర్యానాలో 27.5 లక్షలు (మార్చి 2025 నాటికి), ఉత్తరప్రదేశ్‌లో 12.69 లక్షలు, రాజస్థాన్‌లో 6.2 లక్షలు ఉన్నాయి.

బంకుల వద్ద పోలీసులు, ఆర్టీఏ సిబ్బంది..

కాలం చెల్లిన వాహనాల తనిఖీకి 1 నుంచి 100 నంబర్ల వరకు ఉన్న పెట్రోల్, డీజిల్ బంకుల వద్ద స్థానిక పోలీసులను, 101 నుంచి 159 నంబర్ల వరకు ఉన్న బంకుల వద్ద రవాణా శాఖ సిబ్బందిని ఉంచనున్నారు. తనిఖీ సమయంలో వాహనాల రద్దీని నియంత్రించేందుకు ప్రతి బంకు వద్ద ఒక ట్రాఫిక్ పోలీసును నియమించారు.

ఎలా గుర్తిస్తారు?

ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ (ANPR) కెమెరాల ద్వారా కాలం చెల్లిన వాహనాలను గుర్తిస్తారు. 498 ఇంధన స్టేషన్లలో వీటిని అమర్చారు. వెహికల్ డేటాబేస్‌తో లింకయిన కెమెరాలు, నంబర్ ప్లేట్‌లను వెరిఫై చేసి, కాలంచెల్లిన వాహనాల సమాచారాన్ని బంకు ఆపరేటర్‌కు ఇస్తారు. అలాంటి వాహనాలను స్వాధీనం చేసుకునే అధికారం కూడా ట్రాఫిక్ పోలీసులకు ఇచ్చారు.

"01.07.2025 నాటికి కొని15 సంవత్సరాలు పూర్తయిన పెట్రోల్ వాహనాలకు అలాగే పదేళ్లు పూర్తయిన డీజిల్ వాహనాలకు ‘‘నో ఫ్యూయల్’’ బోర్డులు పెట్టాలని ఇప్పటికే పెట్రోల్, డీజిల్ బంకుల యజమానులను ఆదేశించారు. ఈ నిబంధనలను ఉల్లంఘించే బంకుల ఓనర్లపై కూడా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 2018లోనే సుప్రీంకోర్టు గతంలో ఇలాంటి వాహనాలపై నిషేధం విధించిన విషయం తెలిసిందే. 

Tags:    

Similar News