Maharashtra | ‘లడ్కీ బహిన్ యోజన’ లబ్ధిదారుల వివరాల పున:పరిశీలన

మహారాష్ట్రలోని పల్ఘర్, యవత్మాల్, వార్ధా జిల్లాల నుంచి ఫిర్యాదులు రావడంతో నకిలీ లబ్ధిదారులను జాబితా నుంచి తొలగించనున్నారు.;

Update: 2025-01-03 07:38 GMT

మహారాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోన్న ‘లడ్కీ బహిన్ యోజన’ (Ladki Behan Yojana) పథకంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ పథకం ద్వారా అనర్హులు లబ్ధిపొందుతున్నారని ఫిర్యాదులందుతున్నాయి. దీంతో లబ్ధిదారుల వివరాలను మరోసారి రీచెక్ చేయనున్నామని రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ శాఖ మంత్రి అదితి తాట్కరే చెప్పారు.

గత సంవత్సరం ఆగస్టులో ఏక్‌నాథ్ షిండే (Eknath Shinde) నేతృత్వంలోని ప్రభుత్వం ‘ముఖ్యమంత్రి మజీ లడ్కీ బహిన్ యోజన’ పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం కింద అర్హులయిన మహిళలకు నెలకు రూ. 1,500 అందిస్తున్నారు. ఈ పథకం ద్వారానే మహాయుతి కూటమి మళ్లీ అధికారంలోకి వచ్చిందని కొందరు చెబుతున్నారు.

ఫిర్యాదులపై విచారణ..

“మహారాష్ట్ర ప్రభుత్వం లడ్కీ బహిన్ యోజన లబ్ధిదారుల వివరాలను ప్రభుత్వం పరిశీలించలేదు. స్థానిక ప్రభుత్వ కార్యాలయాల్లో దాఖలైన ఫిర్యాదులను మాత్రమే పరిష్కరిస్తున్నాం. సంవత్సరానికి రూ. 2.5 లక్షల కంటే ఎక్కువ ఆదాయం ఉన్న, కారు ఉన్న వారు లబ్ధిదారులను తొలగించేందుకు ఆదాయపు పన్ను శాఖ, రవాణా శాఖ నుంచి డేటా సేకరిస్తున్నాం. రాగానే విచారణ చేపట్టి పింఛన్ కట్ చేస్తాం," అని తాట్కరే తెలిపారు.

2.5 కోట్ల మంది లబ్ధిదారుల్లో ఎంతమందిని తొలగిస్తారన్న ప్రశ్నకు.. ‘‘మీ ప్రశ్నకు ఇప్పుడే సమాధానం చెప్పలేం. డేటా రాగానే ఆ వివరాలను లబ్ధిదారులకు చూపించి పింఛన్ రద్దు చేస్తా. ’’ అని అన్నారు.

ఒకే వ్యక్తి అనేక సార్లు దరఖాస్తు చేసుకున్నారు. కొంతమంది లబ్ధిదారులు పెళ్లి చేసుకుని కర్ణాటకకు వెళ్లిపోయారు. ప్రభుత్వ ఉద్యోగం పొందిన తరువాత కొంతమంది లబ్ధిదారులు పథకం నుంచి తమ పేరును తొలగించాలని కోరిన సందర్భాలు కూడా ఉన్నాయి,’’ అని మంత్రి పేర్కొన్నారు.

“ఉదాహరణకు ఒక కుటుంబంలోని మహిళ ఒక పథకం ద్వారా రూ. 1,000 పొందినట్లయితే, లడ్కీ బహిన్ పథకం వర్తించినపుడు ఆమెకు రూ. 1,500 బదులు రూ. 500 మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది,” అని క్లారిటీ ఇచ్చారు.

Tags:    

Similar News