పూజ ఖేద్కర్ పేరెంట్స్ కోసం లుక్అవుట్ నోటీసు..

రోడ్డు ప్రమాదానికి కారకడయ్యాడని ట్రక్ డ్రైవర్‌ను కిడ్నాప్ చేసిన ఖేడ్కర్..

Update: 2025-09-23 12:57 GMT
Click the Play button to listen to article

IAS ట్రైనీ పూజా ఖేడ్కర్ పేరు మరోసారి వార్తల్లోకొచ్చింది. ఆమె తల్లిదండ్రులు దిలీప్, మనోరమ ఖేడ్కర్‌పై ముంబై, నవీ ముంబై పోలీసులు(Mumbai Police) లుక్అవుట్ నోటీసు జారీ చేశారు. గత వారం నవీ ముంబైలో జరిగిన రోడ్డు ప్రమాదానికి సంబంధించి వారిపై ఈ నోటీసు జారీ అయ్యింది.

ఖేద్కర్ కుటుంబానికి చెందిన ప్రైవేట్ SUV, కాంక్రీట్ మిక్సర్ ట్రక్ నవీ ముంబైలో ఢీ కొన్నాయి. ఆ సమయంలో దిలీప్ ఖేద్కర్, ఆయన బాడీగార్డ్ ప్రఫుల్ సలుంఖేకు, ట్రక్ డ్రైవర్ పీకే చౌహాన్‌‌కు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. జరిగిన నష్టానికి డబ్బులు చెల్లించాలని చౌహాన్‌ను కిడ్నాప్ చేశారు. చివరకు ఖేడ్కర్‌కు చెందిన ఒక బంగళాలో చౌహాన్‌ను పోలీసులు గుర్తించారు.

బాధితుడి ఫిర్యాదు మేరకు ఖేద్కర్‌ దంపతులను విచారించేందుకు వెళ్లినపుడు.. మనోరమ ఖేడ్కర్ వారిని బంగ్లాలోకి రానివ్వలేదు. నిందితులను తానే పోలీస్ స్టేషన్‌లో హాజరుపరుస్తానని చెప్పడంతో పోలీసులు వెళ్లిపోయారు. ఆ తర్వాత ఆమె నుంచి ఎలాంటి స్పందన లేదు. మరోసారి ఆమె ఇంటికి వెళ్లిన పోలీసులపై కాపలా కుక్కలను వదిలింది. దాంతో వారు భయపడి వెనుదిరిగారు. 24 గంటల తర్వాత మళ్లీ మనోరమ ఇంటికి వెళ్లారు. అప్పటికే వారు పరారీలో ఉన్నారు. కొన్ని రోజుల తర్వాత ఖేద్కర్‌ బాడీగార్డును పట్టుకున్నారు. ఖేద్కర్‌ దంపతులను అహ్మద్‌నగర్‌కు తీసుకెళ్లానని.. ఆ తర్వాత వారు ఎక్కడికి వెళ్లాడో తనకు తెలియదని బాడీగార్డు పోలీసులకు చెప్పాడు. దీంతో పోలీసులు దిలీప్, మనోరమ ఖేడ్కర్‌పై లుక్ అవుట్(Lookout notice) నోటీసులు జారీ చేశారు.

గతేడాది ఓ భూవిదాదంలో మనోరమ ఖేడ్కర్ ఒక వ్యక్తిపై తుపాకి పెట్టి బెదిరించిన వీడియో సోషల్ మీడియాలో వైరలయిన విషయం తెలిసిందే. ఆ ఘటన రాయ్‌గడ్‌లోని హిర్కానివాడి గ్రామంలో ఆమె అరెస్టుకు దారితీసింది. ఐఏఎస్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించడానికి పూజా ఖేడ్కర్(Puja Khedkar) నకిలీ శారీరక వైకల్యం సర్టిఫికెట్, వెనుకబడిన తరగతుల సర్టిఫికెట్‌‌ను దరఖాస్తు చేశారన్న ఆరోపణలున్నాయి. 

Tags:    

Similar News