రాజకీయాల్లో ఎప్పుడు, ఏం జరుగుతోందో చెప్పలేం: సీఎం దేవేంద్ర ఫడ్నవీస్

మోదీ, అమిత్ షా.. ఇద్దరిలో ఎవరు కఠినమైన నాయకుడని అడిగితే.. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ చెప్పిన సమాధానమేంటి?;

Update: 2025-01-11 07:41 GMT

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ విజయానికి ఆరెస్సెస్‌ కారణమని ఎన్‌సీపీ(ఎస్‌పీ) శరద్‌పవార్‌ (Sharad Pawar) చేసిన వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ (Devendra Fadnavis) స్పందించారు. లోక్‌సభ ఎన్నికల్లో మహావికాస్‌ అఘాడీ చేసిన తప్పుడు ప్రచారాన్ని ఆరెస్సెస్‌ సమర్థవంతంగా తిప్పికొట్టిందని అన్నారు.

దివంగత విలాస్జీ ఫడ్నిస్ జీవహాలా కార్యక్రమంలో ఎడిటర్ వివేక్ ఘాలసాసీ ఫడ్నవీస్‌కు కొన్ని ప్రశ్నలు సంధించారు.

ఎన్సీపీ (ఎస్పీ), ఎన్సీపీ మళ్లీ కలవడానికి అవకాశం ఉందా? అని అడిగితే .."2019 నుంచి 2024 వరకు జరిగిన పరిణామాలను చూస్తే, రాజకీయాల్లో ఎప్పుడూ ఏదీ జరగదు అని చెప్పలేం. ఉద్ధవ్ థాకరే వేరే పార్టీకి వెళతారు.. అజిత్ పవార్ మన వద్దకు వస్తారు. రాజకీయాల్లో ఏదైనా జరగవచ్చు, అయితే ఇది జరగాలని నేను చెప్పడం లేదు," అని వ్యాఖ్యానించారు.

మీరు ముఖ్యమంత్రిగా ఉండటానికి ఇష్టపడతారా? లేక బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఉండటానికి ఇష్టపడతారా? అని అడిగితే, పార్టీ ఎలాంటి బాధ్యత అప్పగించినా స్వీకరిస్తానని బదులిచ్చారు.

"బీజేపీలో లేకుంటే నన్ను ఎవరూ పట్టించుకునేవారు కాదు. నా గుర్తింపునకు బీజేపీనే కారణం. పార్టీ నన్ను ఇంట్లో కూర్చోమని చెప్పినా అలాగా నడుచుకుంటా," అని ఫడ్నవీస్ పేర్కొన్నారు. రాజకీయాల్లో ఓర్పు ముఖ్యమని, విమర్శలను స్వీకరించడం కూడా నాయకుండి ముఖ్య లక్షణమని చెప్పారు.

మోదీ, అమిత్ షా.. ఇద్దరిలో ఎవరు కఠినమైన నాయకుడని అడిగితే.. మోదీ అనుకున్నదానిపట్ల కట్టుబడి ఉండే నాయకుడని, కానీ షా కొన్నిసార్లు రాజకీయ అవసరాల కోసం నిర్ణయాలను మార్చుకోవచ్చని అన్నారు.

చివరగా.."నాకు ఆకలి వేస్తేనే కోపం వస్తుంది. ఆ సమయంలో నాకు తినడానికి ఏదైనా ఇవ్వండి. అప్పుడు నా కోపం పోతుంది," అని సరదాగా అన్నారు మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడణవీస్

Tags:    

Similar News