ఎన్నికల హామీ నిలబెట్టుకున్న హర్యానా సీఎం సైనీ

హర్యానా సీఎం నయాబ్ సింగ్ సైనీ ఎన్నికల హామీ నిలబెట్టుకున్నారు. కిడ్నీ వ్యాధిగ్రస్తులకు ఉచిత డయాలసిస్ సేవలు అందుబాటులోకి తెచ్చారు.

Update: 2024-10-18 10:56 GMT

హర్యానా సీఎం నయాబ్ సింగ్ సైనీ ఎన్నికల హామీ నిలబెట్టుకున్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధిగ్రస్తులకు ఉచిత డయాలసిస్ సేవలు అందుబాటులోకి వస్తాయని శుక్రవారం ప్రకటించారు. తన మంత్రివర్గం మొదటి సమావేశానికి అధ్యక్షత వహించిన తర్వాత విలేఖరులతో మాట్లాడుతూ.. ఎస్సీల ఉప వర్గీకరణకు రాష్ట్రాలకు అధికారం కల్పిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన నిర్ణయాన్ని రాష్ట్రం కూడా అమలు చేస్తుందని చెప్పారు. గురువారం రెండో సారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన సైనీ మాట్లాడుతూ.. హర్యానా ప్రజలు కాంగ్రెస్ అబద్ధాల కథనాలను, రైతులను, పేదలను రెచ్చగొట్టే ప్రయత్నాలను ఓడించి.. బీజేపీకి మూడో సారి పట్టం కట్టినందుకు కృతజ్ఞతలు తెలిపారు. బీజేపీకి పెద్ద పీట వేయడం ద్వారా ప్రధాని మోదీ విధానాలపై ప్రజలు ఆమోద ముద్ర వేశారని చెప్పారు.

"నేను సంతకం చేసిన మొదటి ఫైల్ (బాధ్యతలు స్వీకరించిన తర్వాత) కిడ్నీ వ్యాధిగ్రస్తులకు సంబంధించిన నిర్ణయానికి సంబంధించినది. మేము ఎన్నికలలో కూడా ఈ హామీని ఇచ్చాం. డయాలసిస్ చేయించుకునేందుకు దాదాపు రూ. 20,000 నుంచి రూ. 25,000. అవుతుంది. అయితే ఇప్పుడు ఆ ఖర్చు హర్యానా ప్రభుత్వం భరిస్తాను" అన్నారాయన.

ఈరోజు నుంచే ఎన్నికల హామీలను అమలు చేయాలని తమ మంత్రివర్గం తొలి సమావేశంలో నిర్ణయించినట్లు తెలిపారు. రాష్ట్రంలోని నేరస్తులు తమ తీరును చక్కదిద్దుకోవాలని ముఖ్యమంత్రి కోరారు. నేరాలకు పాల్పడే వారు రాష్ట్రాన్ని విడిచి వెళ్లాలని లేదా తమ ప్రవర్తన మార్చుకోవాలని హితవు పలికారు.

Tags:    

Similar News