రాఫెల్ మెరైన్ ధర తగ్గించిన డస్సాల్ట్ ఏవియేషన్..

భారత నావికదళం కోసం రాఫెల్ మెరైన్ రకం విమానాల కొనుగోలుకు సంబంధించిన తుది ధరను కంపెనీ భారత ప్రభుత్వానికి వెల్లడించింది. ఈ డీల్ వివరాల కోసం అజిత్ ధోవల్ ప్యారిస్..

By :  491
Update: 2024-09-30 08:23 GMT

రాఫెల్ మెరైన్ రకం యుద్ద విమానాల తుది ధరలను డస్సాల్ట్ ఏవియేషన్ భారత ప్రభుత్వానికి సమర్పించింది. ఇది ఫ్రాన్స్ ప్రభుత్వం - భారత ప్రభుత్వం మధ్య జరుగుతున్న జీ- జీ టూ ఒప్పందం. ప్రస్తుతం తుది ధరను డస్సాల్ట్ కంపెనీ సమర్పించడంతో ఈ ల్యాండ్ మార్క్ డీల్ ను ముగించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది.

భారతదేశం- ఫ్రాన్స్ వ్యూహాత్మక చర్చల కోసం భారతదేశ జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ నేడు పారిస్‌లో తన ఫ్రెంచ్ కౌంటర్ పార్ట్ తో సమావేశం కానున్నారు. వీరి మధ్య ఈ ఒప్పందం చర్చకు రానుంది. ఈ యుద్ధ విమానాలు నావికా సామర్థ్యాలను మెరుగుపరుస్తాయి. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో భారతదేశ ప్రయోజనాలను కాపాడటంతో ప్రముఖ పాత్ర పోషిస్తాయి. కావునా సాధ్యమైనంత తొందరగా ఈ డీల్ ను పూర్తి చేయాలని న్యూ ఢిల్లీ పట్టుదలగా ఉంది.
తగ్గిన ధర, అదనపు క్షిపణులు
రక్షణ మంత్రిత్వ శాఖలోని కొన్ని సోర్స్ ల ప్రకారం, సుదీర్ఘ చర్చల తర్వాత ఫ్రెంచ్ వైపు గణనీయమైన ధర తగ్గింపుకు అంగీకరించినట్లు జాతీయ మీడియా వార్తలను ప్రచురించాయి.
జెట్‌లలో స్వదేశీ తయారీ ‘ఉత్తమ్ రాడార్‌’ను అనుసంధానం చేయాలని భారత్ కోరగా అందుకు రాఫెల్ అంగీకరించినట్లు తెలిసింది. ఈ ఒప్పందంలో భాగంగా భారత నావికాదళం సుదూరంగా ఉన్న లక్ష్యాలను చేధించడానికి గగనతలం నుంచి గగనతలానికి ప్రయోగించే మెటీయోర్ క్షిపణులు సైతం ఫ్రాన్స్ సరఫరా చేయనుంది. INS విక్రాంత్ విమాన వాహక నౌకతో సహ ఇతర స్థావరాలలో రాఫెల్ M జెట్‌లను మోహరిస్తారు.
రాఫెల్ M - నౌకాదళానికి చాలా అవసరమైన..
Rafale- M ప్రత్యేకంగా క్యారియర్ ఆధారిత కార్యకలాపాల కోసం రూపొందించబడింది. నావికాదళం తన విమాన వాహక నౌకల నుంచి ఆపరేట్ చేయడానికి ప్రస్తుతం ఉపయోగిస్తున్న, MiG-29Kలను ఇవి భర్తీ చేస్తాయి. రాఫెల్‌లు సాంకేతిక పరిజ్ఞానాన్ని మెరుగుపరచడంతో పాటు నౌకాదళ సామర్థ్యాలను పెంచుతాయి. ఈ ఫ్లీట్‌లో 22 సింగిల్-సీటర్లు, నాలుగు ట్విన్-సీటర్ ట్రైనర్ జెట్‌లు ఉంటాయి.
భారత వైమానిక దళం ప్రస్తుతం 36 రాఫెల్ విమానాలను నడుపుతోంది. దాని అధునాతన ఆయుధ వ్యవస్థలు, ఏవియానిక్స్, వంటి ఫోర్త్ ప్లస్ ప్లస్ జనరేషన్ సాంకేతికతలు ఉన్నాయి. మీడియం రోల్ ఫైటర్ ఎయిర్‌క్రాఫ్ట్ (MRFA) ప్రాజెక్ట్ కింద 114 అదనపు యుద్ధ విమానాలను సరఫరా చేయడానికి కూడా డస్సాల్ట్ ఒక ఒప్పందాన్ని కూడా కొనసాగిస్తోంది.
ఆ ఒప్పందం కార్యరూపం దాల్చితే, 26 రాఫెల్ ఎమ్ జెట్‌లను కొనుగోలు చేయడంతో, ఫ్రాన్స్ తర్వాత ప్రపంచంలోనే భారత్ రెండో అతిపెద్ద రాఫెల్ జెట్‌ల ఆపరేటర్‌గా అవతరిచింది. 185 రాఫెల్ విమానాలను నడుపుతున్న ఫ్రెంచ్ వైమానిక దళంతో పోలిస్తే భారతదేశానికి చెందిన రాఫెల్ ఫ్లీట్ 176 విమానాలను కలిగి ఉంది. ఇది పాకిస్తాన్ నుంచి ఆమారామ్ క్షిపణులను కౌంటర్ చేయడానికి కొనుగోలు చేసింది.
రాఫెల్ M సామర్థ్యాలు
Rafale Mలో SCALP లాంగ్-రేంజ్ స్టాండ్‌ ఆఫ్ క్షిపణి, బియాండ్ విజువల్ రేంజ్ ఎయిర్-టు-ఎయిర్ MICA, AM39 ఎక్సోసెట్ యాంటీ-షిప్ మిస్సైల్, లాంగ్-రేంజ్ ఎయిర్-టు-ఎయిర్ మెటియోర్ క్షిపణి ఉన్నాయి. రాఫెల్ విస్తృత శ్రేణి మిషన్‌లను నిర్వహించగల సామర్థ్యాన్ని కలిగి ఉంది. లిబియా యుద్ధంలో ఇది తన శక్తిని ప్రదర్శించింది. దాని అధునాతన రక్షణ వ్యవస్థలు, మొత్తం అత్యుత్తమ పనితీరుకు నిదర్శనం. రాఫెల్ ఎమ్‌కి ఫోల్డబుల్ రెక్కలు లేనప్పటికీ, దస్సాల్ట్ దాని పైలాన్ నిర్మాణాన్ని INS విక్రాంత్‌కు సరిపోయేలా సర్దుబాటు చేస్తుంది.
రాఫెల్ జెట్‌లతో అనుకూలత..
భారతదేశం తన నౌకాదళం అవరాల కోసం రాఫెల్ M జెట్‌లతో వెళ్లాలని నిర్ణయించుకుంది. ఇప్పటికే IAF రాఫెల్ జెట్‌లతో అనేక భాగాలను పంచుకోవడం జరిగింది. ప్రస్తుతం రాఫెల్ ఎం రకం జెట్ల ను కొనుగోలు చేయడం వల్ల వాటి నిర్వహణ ఖర్చు చాలా వరకు తగ్గించుకోవచ్చు. ఎయిర్ ఫోర్స్, నావిక దళంలో ఉపయోగించే రెండు విమానాల్లో కూడా దాదాపు 80 శాతం భాగాలు ఉమ్మడిగా ఉన్నాయి.
IAF - నావికాదళానికి చెందిన రాఫెల్‌లను "ఓమ్నిరోల్ ఎయిర్‌క్రాఫ్ట్‌లు" అని పిలుస్తారు, అంటే అవి ఎయిర్ టూ ఎయిర్, ఎయిర్ టూ ల్యాండ్ కు ఒకే సమయంలో మిషన్‌లను నిర్వహించగలవు. అన్ని రాఫెల్ యుద్ధ విమానాలు 4+ తరం ఫైటర్ జెట్‌లలో భాగమే. అవి అధునాతన ఏవియానిక్స్‌తో అమర్చబడి ఉంటాయి. కొన్ని ఫీచర్లు ఐదో తరం విమానాలతో సమానంగా ఉన్నాయి.
ఉత్తరప్రదేశ్‌లో డస్సాల్ట్ కంపెనీ..
డస్సాల్ట్ ఏవియేషన్ ఉత్తరప్రదేశ్‌లో మెయింటెనెన్స్, రిపేర్, ఓవర్‌హాల్ సదుపాయాన్ని ఏర్పాటు చేస్తుంది. ఇది IAF రాఫెల్స్, మిరాజ్-2000ల సముదాయానికి మద్దతు ఇవ్వడమే కాకుండా, ఫ్రెంచ్-మూలాలు కలిగిన విమానాలను నిర్వహించడానికి ప్రాంతీయ కేంద్రంగా కూడా ఉపయోగపడుతుంది.
ఈ కేంద్రం రాఫెల్ జెట్‌లకు కార్యాచరణ సంసిద్ధతను, వాటి పనితీరు కాలాన్ని పెంచడంలో ముఖ్యపాత్ర పోషిస్తుంది. ఈ డీల్ భారత్ - ఫ్రాన్స్ మధ్య లోతైన రక్షణ సహకారాన్ని కూడా సూచిస్తుంది. అలాగే భారతదేశ సాయుధ బలగాలను ఆధునీకరించడంలో కీలక భాగస్వామిగా మారింది.


Tags:    

Similar News