నాగపూర్ హింస: నగరంలో కొనసాగుతున్న కర్ఫ్యూ

‘ఛావా’ సినిమా వల్లే ప్రస్తుతం ఇలాంటి ఘర్షణలు జరిగాయన్న సీఎం దేవేంద్ర ఫడ్నవీస్;

Update: 2025-03-18 11:16 GMT

మతోన్మాది, మెఘల్ పాలకుడు ఔరంగజేబు సమాధిని కూల్చివేయాలని కొంతమంది హిందువులు డిమాండ్ చేయడంతో మరోవర్గం వారు దాడులకు దిగారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం భారతీయ నాగరిక్ సురక్ష (బీఎన్ఎస్ఎస్) సెక్షన్ 163 కింద నాగపూర్ లోని పలు ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించారు.

నాగపూర్ ప్రాంతంలోని కొత్వాలి, గణేష్ పేట్, తహసీల్, లకద్ గంజ్, పచ్చపాలీ, శాంతినగర్, సకర్దారా, నందనవన్, ఇమామ్ వాడా, యుశోధర నగర్, కపిల్ నరగ్ లోని పోలీస్ స్టేషన్ ల పరిధిలోని కర్ఫ్యూ విధించారు.
నిషేధాలు విధించినప్పటికీ హంసపురి ప్రాంతంలో మరోసారి ఘర్షణలు జరిగాయి. అనేక ఇళ్లు, వాహనాలు, ధ్వంసం అయ్యాయి. ప్రస్తుతం పరిస్థితి ప్రశాంతంగా ఉందని అయితే కర్ఫ్యూ కొనసాగుతుందని పోలీసులు ప్రకటించారు.
మతోన్మాది ఔరంగజేబు సమాధిని తొలగించాలని ఒక హిందూ సంస్థ ఆందోళన చేపట్టిందని అందులో వేరే మతానికి చెందిన పవిత్ర గ్రంథం తగలబెట్టారని పుకార్లు వ్యాపించడంతో రాళ్లదాడి చోటుచేసుకుందని కొంతమంది మతోన్మాదులు పోలీసులపై కూడా రాళ్లు రువ్వారని, ఆరుగురు వ్యక్తులు, ముగ్గురు పోలీసులు గాయపడ్డారని అధికారులు తెలిపారు.
45 మంది అరెస్ట్.. 34 మంది పోలీసులు..
ఈ హింసకు సంబంధించి 45 మందిని అరెస్ట్ చేసినట్లు ప్రకటించారు. ఈ హింసలో 34 మంది పోలీసులు గాయపడినట్లు మహారాష్ట్ర మంత్రి చంద్రశేఖర్ బవాంకులే చెప్పారు. గాయపడిన వారిలో ఇద్దరిని స్థానిక ఆస్పత్రిలోని ఐసీయూలో చేర్చినట్లు సంఘటన తరువాత నాగపూర్ కు వచ్చిన తరువాత మంత్రి చెప్పారు.
హింసాకాండలో 45 వాహనాలు ధ్వంసమయ్యాయని మంత్రి అన్నారు. హింసకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. ప్రజలు శాంతియుతంగా ఉండాలని సామాజిక వ్యతిరేక శక్తులకు ఎలాంటి మద్దతు ఇవ్వవద్దని అన్ని వర్గాల సభ్యులకు విజ్ఙప్తి చేశారు. హింసకు దారితీసిన పరిస్థితులు, పుకార్లను వ్యాప్తి చేసినవారిని ప్రభుత్వం కనుగొంటుందని కూడా చెప్పారు.
ప్రస్తుతం సున్నిత ప్రాంతాల్లో భద్రతను పెంచినట్లు సీనియర్ పోలీస్ అధికారులు చెప్పారు. క్విక్ రెస్పాన్స్ టీములను, రాష్ట్ర రిజర్వ్ పోలీస్ ఫోర్స్ లను మోహరించినట్లు, వివిధ స్టేషన్ ల నుంచి అదనపు పోలీస్ సిబ్బందినిసైతం పిలిపించినట్లు చెప్పారు.
అర్థరాత్రి మరో ఘర్షణ ప్రారంభం..
నాగపూర్ లోని ఓల్డ్ భండారా రోడ్డు సమీపంలోని హంసపురి ప్రాంతంలో రాత్రి 10.30 లకు మరో ఘర్షణ చెలరేగింది. ఒక అల్లరి మూక వాహనాలకు తగలబెట్టి, ఇళ్లు, ప్రయివేట్ క్లినిక్ ను ధ్వంసం చేసింది.
హంసపురి ప్రాంతానికి చెందిన శరద్ గుప్తా ఇంటి ముందు పార్క్ చేసిన నాలుగు ద్విచక్ర వాహనాలు దగ్గమయ్యాయని, రాత్రి 10.30 నుంచి 11.30 వరకూ అల్లరి మూకలు హింసకు దిగాయని, రాళ్లు రువ్వి, వాహానాలను తగలబెట్టిందని ఆయన తెలిపారు. ఈ దాడిలో ఆయన గాయపడ్డారు. ఈ సంఘటన జరిగిన గంట తరువాత పోలీసులు వచ్చారని ఆయన చెప్పారు.
ఈ దాడి తరువాత స్థానికులు దాడికి పాల్పడిన గుంపుపై పోలీసులు చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఒక వ్యక్తి రాత్రి 1.20 ఇంటికి తాళం వేసి సురక్షిత ప్రాంతానికి వెళ్లినట్లు చెప్పారు.
భజరంగ్ దళ్ నిరసన తరువాత..
ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయం ఉన్న ప్రాంతంలో ఒక గుంపు రావడంతో పోలీసులు వారిని చెదరగొట్టడానికి టియర్ గ్యాస్ షెల్స్ ను ప్రయోగించారు. తరువాత లాఠీచార్జ్ చేశారు. చిట్నిష్ పార్క్ నుంచి తలావ్ రోడ్డు బెల్ట్ వరకూ హింస ఎక్కువగా జరిగింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహల్ ప్రాంతంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహం దగ్గర భజరంగ్ దళ్ సభ్యులు ప్రదర్శించిన కొద్దిపాటి నిరసన తరువాత ఇబ్బంది మొదలైంది.
ఆందోళన సమయంలో ఖురాన్ తగలబెట్టారని పుకార్లు వచ్చాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు క్షణాల్లో వైరల్ అయ్యాయి. ఇది ముస్లింలు ఆగ్రహం వ్యక్తం చేయడానికి కారణమైంది. అయితే భజరంగ్ ఈ పుకార్లను తోసిపుచ్చింది. తమ ప్రదర్శనలలో కేవలం ఔరంగబేబు దిష్టిబొమ్మను దహనం చేసినట్లు చెప్పారు.
విపక్షాల విమర్శలు..
నాగపూర్ లో జరిగిన మతహింసపై కాంగ్రెస్ పార్టీ ఆందోళన వ్యక్తం చేసింది. కేంద్రంలో, రాష్ట్రంలో పాలక పాలన భావజాలం దీనికి కారణమని ఆరోపించింది.
కాంగ్రెస్ మీడియా, ప్రచార విభాగం అధిపతి పవన్ ఖేరా మాట్లాడుతూ.. ‘‘మహాల్ ముఖ్యమంత్రి సొంత ప్రాంతం, 300 సంవత్సరాల చరిత్రలో అక్కడ ఎప్పడూ అల్లర్లు జరగలేదు.
అయితే గత కొంతకాలంగా చరిత్రను ఆయుధంగా చేసుకుని విభజనలు జరుగుతున్నాయి. కేవలం అశాంతిని సృష్టించడానికే ఈప్రయత్నాలు జరుగుతున్నాయి’’ ఆయన విమర్శించారు.
మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ మాట్లాడుతూ..ఈ హింస రాష్ట్ర హోంశాఖ వైఫల్యమని ఆరోపించారు. గత కొన్ని రోజులుగా మంత్రులు ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు.
ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హమీలను నెరవేర్చడంలో విఫలం అయిందని అన్నారు. నిరుద్యోగం, ద్రవ్యోల్భణం, రైతులకు మద్దతు ధర లేకపోవడం, రైతు ఆత్మహత్యలు వంటి సమస్యలు ఎదుర్కొంటుందని, లాడ్లీ బహిన్ యోజన కింద సాయాన్ని పెంచడంలో విఫలమైందని నప్కల్ అన్నారు.
ప్రజలు ప్రశాంతంగా ఉండాలని ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్, నాగ్ పూర్ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ శాంతి సామరస్యాలను కాపాడుకోవాలని విజ్ఙప్తి చేశారు.
ఛావా సినిమా వల్లే..


 


మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు పై రాష్ట్రంలో, ప్రజల్లో పెరుగుతున్న ఆగ్రహానికి బాలీవుడ్ నటుడు విక్కీ కౌశల్ చిత్రం ‘ఛావా’ కారణమని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఆరోపించారు.
ఛావా సినిమా ఛత్రపతి శంభాజీ మహారాజ్ జీవితానికి సంబంధించినది. దక్కన్ ను ఆక్రమించుకోవడానికి ఔరంగజేబు చేసిన ప్రయత్నాలను శంభాజీ మహారాజ్ అడ్డుకున్నాడు. దాదాపు ఎనిమిది సంవత్సరాలు మొఘల్ సైన్యానికి భారీగా నష్టాన్ని కలిగించాడు. అయితే తన బావమరిది చేత మోసానికి గురైన శంభాజీ మొఘల్ సైన్యానికి దొరికి పోయాడు.
కుట్ర ప్రకారమే జరిగింది..
ఈ హింసాత్మక ఘటన అల్లర్లు ముందస్తు కుట్ర ప్రకారమే జరిగిందని సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ మహారాష్ట్ర అసెంబ్లీలో అన్నారు. నిర్థిష్టంగా ఉన్న ఇళ్లు, సంస్థలను లక్ష్యంగా చేసుకుని కొంతమంది దాడులకు పాల్పడ్డారని, ఇదంతా కుట్రే అని తేల్చి చెప్పారు. ఇటీవల విడుదలైన బయోపిక్ ప్రజల్లో కోపాన్ని రేకెత్తించిందని, అయితే రాష్ట్ర ప్రజలు శాంతియుతంగా ఉండాని ప్రజలను కోరారు.


Tags:    

Similar News