బంగ్లాదేశ్ ఉద్యమాలు బెంగాల్ వాణిజ్యంపై ఎలా ప్రభావం చూపాయి?

బంగ్లాదేశ్ లో విద్యార్థులు చేసిన ఉద్యమాలు, తరువాత భారతీయ వీసా కేంద్రాలపై దాడులతో రెండు దేశాల మధ్య వీసాల జారీ..

By :  218
Update: 2024-11-05 10:45 GMT

షేక్ హసీనా ప్రభుత్వం పతనమయ్యాక సరిహద్దు దేశమైన భారత్ సంబంధాలు అంతంత మాత్రమే ఉన్నాయి. ఇవి ఎక్కువగా పశ్చిమ బెంగాల్ వ్యాపార, వాణిజ్యం పై ఎక్కువగా ప్రభావం చూపాయి. కోల్‌కతాలోని ఠాకూర్‌పుకూర్ ప్రాంతంలో ఉన్న సుప్రసిద్ధ సరోజ్ గుప్తా క్యాన్సర్ సెంటర్, రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (SGCCRI) పరిసరాల్లో ఖాళీగా ఉన్న హోటల్లు రెండు పొరుగు దేశాల మధ్య సంబంధాలలో పతనానికి సంకేతం.

ఈ ప్రాంతంలో దాదాపు 50 అతిథి గృహాలు ఉన్నాయి, ఇవి ప్రధానంగా బంగ్లాదేశ్ రోగులు, వారితో పాటు వచ్చే వారికి సేవలను అందిస్తాయి. ఒకప్పుడు అతిథులతో కిటకిటలాడే ఈ ఇళ్లు ఇప్పుడు బంగ్లాదేశ్ పౌరుల రాక కోసం ఎదురు చూస్తున్నాయి. వీసా సేవలు ఇంకా సాధారణ పరిస్థితుల్లోకి రానందున పొరుగు దేశం నుంచి వచ్చే రోగుల ప్రవాహం బాగా పడిపోయినంది. ఇప్పుడు ఈ ప్రాంతం నిశ్శబ్ధంగా మారిపోయింది.

వీసా సేవలలో..
ఆగస్ట్ 5న హసీనా దేశం విడిచి పారిపోవాల్సి వచ్చిన తర్వాత బంగ్లాదేశ్ అంతటా చెలరేగిన విస్తృత హింసాకాండలో కొన్ని భారతీయ వీసా కేంద్రాలు ధ్వంసం చేయబడ్డాయి. భారతీయ సాంస్కృతిక కేంద్రాన్ని కూడా నిరసనకారులు తగుల బెట్టారు. ఈ దుస్సంఘటనలు న్యూఢిల్లీలోని అన్ని వీసా దరఖాస్తు కేంద్రాలను వెంటనే మూసివేయడానికి దారితీసింది.
ఢాకా, రాజ్‌షాహి, చిట్టగాంగ్, సిల్హెట్, ఖుల్నా కేంద్రాలు ఉద్యమం జరగడానికి ముందు వీసాలు జారీ చేసేవి. ప్రస్తుతం అత్యవసర కేంద్రాల్లో మాత్రమే వీసాలు జారీ చేస్తున్నారు. బంగ్లాదేశ్‌లోని భారత హైకమిషనర్ ప్రణయ్ వర్మ ఇటీవల బంగ్లాదేశ్ మీడియాతో మాట్లాడుతూ, ప్రస్తుతం వైద్యం ఇతర అత్యవసర కారణాల కోసం మాత్రమే వీసాలు జారీ చేయబడతాయని, భారతదేశానికి ప్రయాణించే వారు మూడవ దేశం వీసా కోసం దరఖాస్తు చేసుకోవాలని అన్నారు. సాధారణ వీసా ప్రాసెసింగ్ సేవలు పునఃప్రారంభం కావడానికి కొంత సమయం పడుతుందని ఆయన తెలిపారు.
సిబ్బంది కొరత ?
భద్రతా కారణాల వల్ల మానవ వనరుల కొరత వీసాల జారీకి ప్రధాన అవరోధమని తెలుస్తోంది. అయితే బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వంలో సలహాదారుల్లో ఒకరైన సయ్యదా రిజ్వానా హసన్ ఇటీవల మాట్లాడుతూ.. "బంగ్లాదేశీయులకు వీసాలను పరిమితం చేయడానికి ఎటువంటి కారణం కనిపించలేదు. బంగ్లాదేశ్‌లో పరిస్థితి అటువంటి పరిమితిని కోరుతుందని నేను అనుకోను. "యుఎస్, జపాన్ లేదా యూరోపియన్ యూనియన్ ఎటువంటి పరిమితి విధించలేదు."
బెంగాల్‌లో వ్యాపారం దెబ్బతింది
వీసా పరిమితులు పశ్చిమ బెంగాల్‌లోని వ్యాపారాలను తీవ్రంగా ప్రభావితం చేశాయి. “ఇంతకుముందు, నేను ప్రతిరోజూ బంగ్లాదేశ్ నుంచి 10 మంది అతిథులకు ఆతిథ్యం ఇచ్చేవాడిని. ప్రస్తుతం ఆ సంఖ్య భారీగా పడిపోయింది. గత నెలలో నాకు ఒకే ఒక అతిథి మాత్రమే వచ్చారు” అని ఠాకూర్‌పుకూర్‌లో గెస్ట్ హౌస్‌లు, కరెన్సీ మార్పిడి సేవలను నిర్వహిస్తున్న జోయ్‌దేవ్ మిస్త్రీ పేర్కొన్నారు.
కోల్‌కతా మినీ-బంగ్లాదేశ్ అని పిలవబడే మార్క్వైస్ స్ట్రీట్, కైడ్ స్ట్రీట్, ఎస్ప్లానేడ్, న్యూమార్కెట్ ప్రాంతాల చుట్టూ ఉన్న వ్యాపారాలు కూడా ఇదే విధమైన వాతావరణాన్ని ఎదుర్కొంటున్నాయి.
“వ్యాపార నష్టం గురించి సిద్ధంగా ఉన్న డేటా అందుబాటులో లేదు. కానీ మేము చెప్పగలము, మేము పూర్తిగా బంగ్లాదేశ్ కస్టమర్లపై ఆధారపడి ఉన్నందున మా ప్రాంతాల్లో వ్యాపారాలు దాదాపు 90 శాతం పడిపోయాయి, ”అని మార్క్వైస్ స్ట్రీట్‌లోని టూర్ ఆపరేటర్ Md మెహతాబ్ ఆలం అన్నారు.
ఎక్కువ మంది విదేశీ పర్యాటకులు
బ్యూరో ఆఫ్ ఇమ్మిగ్రేషన్ డేటా ప్రకారం, 21 లక్షల మంది సందర్శకులతో, బంగ్లాదేశ్ గత సంవత్సరం భారతదేశానికి అత్యధిక సంఖ్యలో విదేశీ పర్యాటకులు వచ్చిన దేశాల జాబితాలో అగ్రస్థానంలో ఉంది. వారిలో, దాదాపు 4.5 లక్షల మంది బంగ్లాదేశీయులు వైద్య చికిత్స కోసం బెంగాల్ ను సందర్శించారు.
పశ్చిమ బెంగాల్‌లో దాదాపు 2.7 లక్షల మంది రోగులు ఉన్నారు. అశాంతికి ముందు, SGCCRI ప్రతి నెల బంగ్లాదేశ్ నుంచి 100-150 మంది రోగులను సేవలు అందించేది. కానీ ఇప్పుడు ఆ సంఖ్య 10కి పడిపోయిందని ఆసుపత్రి అధికారులు తెలిపారు.
వీసాలు లభించనందున చాలా మంది రోగులు తమ అపాయింట్‌మెంట్‌లను రద్దు చేసుకుంటున్నారని అధికారి తెలిపారు. క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ CareEdge రేటింగ్స్ అంచనా ప్రకారం “బంగ్లాదేశ్ నుంచి భారతదేశానికి వైద్య చికిత్స కోసం FTA (విదేశీ పర్యాటకుల రాక) ఆగస్టు 2024లో 80 శాతం పడిపోయింది. ఆ తర్వాత క్రమంగా వారి సంఖ్యలో పెరుగుదల కనిపిస్తోంది. కానీ అది ఆశించినంత లేదు. 2023తో పోలిస్తే దేశం నుంచి ఎఫ్‌టిఎ 10-15 శాతం ఉంటుందని అంచనా.
విమానయాన సంస్థలు...
"వాస్తవానికి, ఆగస్టు తర్వాత కూడా పరిస్థితి మెరుగుపడలేదు," అని ఆలం చెప్పారు. ప్రయాణీకుల కొరత కారణంగా అనేక బంగ్లాదేశ్ విమానయాన సంస్థలు భారతదేశానికి విమానాల సంఖ్యను తగ్గించవలసి వచ్చింది. బిమన్ బంగ్లాదేశ్ ఎయిర్‌లైన్స్, యుఎస్-బంగ్లా, నోవోఎయిర్ భారతదేశానికి విమానాలను నడుపుతున్నాయి.
ప్రయాణీకుల కొరత కారణంగా NovoAir భారతదేశ కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేసింది. ప్రస్తుతం నడుస్తున్న విమానాల్లో కనీసం 70 శాతం సీట్లు నిండిపోయాయని బిమాన్ బంగ్లాదేశ్ ఎయిర్‌లైన్స్ జనరల్ మేనేజర్ (పబ్లిక్ రిలేషన్స్) బోష్రా ఇస్లాం ను ఉటంకిస్తూ బంగ్లాదేశ్ మీడియా పేర్కొంది.



Tags:    

Similar News