మమత రాజీనామాకు బీజేపీ డిమాండ్

కోల్‌కతాలో ట్రైనీ డాక్టర్ అత్యాచారం, హత్య ఘటన రాజకీయ రంగు పులుముకుంది. ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ రాజీనామాకు బీజేపీ డిమాండ్ చేస్తుంది.;

Update: 2024-08-14 09:36 GMT

కోల్‌కతా ప్రభుత్వాసుపత్రిలో ట్రైనీ డాక్టర్ అత్యాచారం, హత్య ఘటన రాజకీయ రంగు పులుముకుంది. ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రాజీనామాకు బీజేపీ డిమాండ్ చేస్తుంది.

మమతా సీఎంగా కొనసాగితే రాష్ట్రంలో ఏ మహిళ కూడా సురక్షితంగా ఉండదని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా విమర్శించారు. నిందితులను కాపాడేందుకు మమత ప్రయత్నించారని ఆరోపిస్తూ.. సీబీఐ విచారణతో దోషులకు కఠిన శిక్ష పడుతుందని చెప్పారు.

నమ్మకం కోల్పోయిన బాధితురాలి తల్లిదండ్రులు..

‘‘మీ కుమార్తెకు ఆరోగ్యం బాగోలేదని స్థానిక పోలీసులు తొలుత బాధితురాలి తల్లిదండ్రులకు చెప్పారు. ఆపై ఆమె ఆత్మహత్య చేసుకుందని చెప్పారు. కూతురి మృతదేహాన్ని చూసేందుకు తల్లిదండ్రులు మూడు గంటల పాటు వేచి ఉన్నారు. ఈ క్రమంలో సాక్ష్యాలను ధ్వంసం చేసి నిందితుడినికి రక్షించేందుకు చాలా ప్రయత్నాలు జరిగాయి. పోలీసుల తీరు అనుమానాలను తావిస్తుంది’’ అని భాటియా విలేఖరులతో అన్నారు.

ఘటన తర్వాత మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్‌పై రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకుండా.. అతడిని మరో కాలేజీకి బదిలీ చేయడాన్ని భాటియా తప్పుబట్టారు. పోలీసులు మొదట్లో ఎఫ్‌ఐఆర్ నమోదు చేయలేయకపోగా.. అసహజ మరణంగా భావించారని చెప్పారు.

‘‘వైద్య విద్యార్థుల నిరసనలతో బెనర్జీ కేసును కొద్ది రోజుల్లో సీబీఐకి బదిలీ చేస్తానని చెప్పారు. ఇలాంటి కేసులలో మొదటి 48 గంటలు చాలా ముఖ్యమైనవి. సాక్ష్యాలను నాశనం చేయడానికి మమతా ఉద్దేశపూర్వకంగా ప్రయత్నిస్తున్నారు. అందుకే ఆలస్యంగా సీబీఐకి కేసు అప్పగించారు’’ అన్నారు భాటియా.

సందేశ్‌ఖాలీ ఘటనను గుర్తుచేస్తూ ..రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా అదుపుతప్పాయని భాటియా ఆరోపించారు. కోర్టు కేసు విచారణను సీబీఐకి అప్పగించిన తర్వాతే నిందితుడిపై చర్యలు తీసుకున్నారని పేర్కొన్నారు.

బంగ్లాదేశ్‌లో హిందువులను లక్ష్యంగా చేసుకుని దాడులు జరుగుతున్నా.. ప్రతిపక్ష పార్టీలు స్పందించకపోవడం బాధాకరమన్నారు. బిజెపి స్పందించిన తర్వాత ఆలస్యంగా స్పందించడం కృత్రిమ సమానత్వమేనని విమర్శించారు.

Tags:    

Similar News