అరుణాచల్ ప్రదేశ్: పార్టీ పదవికి రాజీనామా చేసిన మాజీ ముఖ్యమంత్రి

ఎన్నికల ముందు అరుణాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ కు షాక్ తగిలింది. పార్టీ పదవులకు మాజీ సీఎం నబమ్ తుకీ రాజీనామా చేశాడు.

By :  Admin
Update: 2024-04-11 04:53 GMT

లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌కు వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఈ రోజు ఉదయాన్నే మధ్యప్రదేశ్ కు చెందిన సీనియర్ కాంగ్రెస్ నేత, మాజీ కేంద్ర మంత్రి సురేష్ పచౌరీ, మూడు సార్లు ఎంపీగా గెలిచిన రాజు ఖేడీ బీజేపీలో చేరారు. తాజాగా అరుణాచల్ ప్రదేశ్ లో కూడా కాంగ్రెస్ సంక్షోభం దిశగా సాగుతోంది. రాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్ష పదవికి మాజీ సీఎం సిట్టింగ్ ఎమ్మెల్యే నబమ్ తుకీ రాజీనామా చేసినట్లు పార్టీ నాయకుడు ఒకరు మీడియాకు చెప్పారు.


తను అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ముగ్గురు ఎమ్మెల్యేలు అధికార బీజేపీలోకి ఫిరాయించడంతో, తుకీ తన వైఫల్యంగా భావించిన పార్టీ పదవులకీ రాజీనామా చేసినట్లు ఆయన వెల్లడించారు. తుకీ తన రాజీనామాను శుక్రవారం (మార్చి 8) అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ)కి పంపినట్లు తెలిసింది.

తుకీ రాజీనామాపై ఏఐసీసీ కూడా స్పందించింది. ఎమ్మెల్యేలు ఇతర రాజకీయ పార్టీలకు ఫిరాయించకుండా అడ్డుకోలేక నైతిక కారణాలతో మాజీ ముఖ్యమంత్రి రాజీనామా చేశారని ఏపీసీసీ ప్రధాన కార్యదర్శి గ్యామర్ తానా మీడియా వెల్లడించారు. టుకీ రాష్ట్రంలోని సగాలీ అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

ఈ నెల ప్రారంభంలో, తూర్పు సియాంగ్ జిల్లాలోని మెబో నుంచి ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ (సిఎల్‌పి) నాయకుడు లోంబో తాయెంగ్ బిజెపిలో చేరారు. గత నెలలో మరో ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నినాంగ్ ఎరింగ్, వాంగ్లిన్ లోవాంగ్‌డాంగ్ కూడా పార్టీని వీడారు.

Tags:    

Similar News