వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి అరెస్టు తప్పదా?
అరెస్టు వారెంట్‌ను మంజూరు చేయాలని కోరుతూ సిట్ అధికారులు విజయవాడ కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు.
ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్‌లో వైఎస్‌ఆర్‌కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, రాజంపేట వైఎస్‌ఆర్‌కాంగ్రెస్‌పార్టీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డిని అరెస్టు చేసేందుకు సిట్ అధికారులు ఇప్పటికే గ్రౌండ్ వర్క్ సిద్ధం చేసినట్లు పోలీసు వర్గాలు చర్చించుకుంటున్నారు. సిట్టింగ్ ఎంపీ కావడంతో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చట్టబద్దంగానే అరెస్టు చేసేందుకు రంగం సిద్ధం చేశారు. అందులో భాగంగా ఎంపీ మిథున్‌రెడ్డి అరెస్ట్ వారెంట్ కోరుతూ విజయవాడ కోర్టులో సిట్ అధికారులు పిటిషన్‌ను కూడా దాఖలు చేశారు. దీంతో పాటుగా ఎంపీ మిథున్‌రెడ్డి ఉంటున్న చోట్ల సోదాలు చేసేందుకు కూడా చట్ట ప్రకారం చేపట్టేందుకు ప్లాన్ చేస్తున్నారు. కోర్టు నుంచి డైరెక్షన్లు వెలువడిన మరు క్షణమే ఎంపీ మిథున్‌రెడ్డిని అరెస్టు చేయడంతో పాటు సోదాల కార్యక్రమాలు కూడా చేపట్టాలని సిట్ అధికారులు ఆలోచనలు చేస్తున్నారు.