నడిచే జగన్‌ సెంబ్లీలోకి

అనేక పరిణామాల నేపథ్యంలో సోమవారం నుంచి అసెంబ్లీ సమావేశాలకు జగన్, ఆయన పార్టీ ఎమ్మెల్యేలు హాజరుకానున్నారు.;

By :  Admin
Update: 2025-02-23 11:12 GMT

సోమవారం నుంచి అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావాలని నిర్ణయించుకున్న నేపథ్యంలో అసెంబ్లీలోకి జగన్‌ కార్లో వెళ్తారా? నడిచి వెళ్తారా? అనేది ప్రస్తతం హాట్‌ టాపిక్‌గా మారింది.

అసెంబ్లీలోకి వెళ్లేందుకు నాలుగు గేట్లు ఉన్నాయి. అసెంబ్లీ సమావేశాలు జరిగే సమయంలో ఈ గేట్ల గుండానే అసెంబ్లీలోకి వెళ్లాల్సి ఉంటుంది. సచివాలయంలో నుంచి అసెంబ్లీలోకి గేట్లు ఉన్నా.. సచివాలయంలో నుంచి కాకుండా బయట ఉన్న గేట్ల నుంచే అసెంబ్లీలోకి వెళ్తుంటారు. ఈ విషయంలో ప్రోటోకాల్‌ నిబంధనలు తప్పకుండా పాటిస్తారు.
ఒకటో నంబర్‌ గేటు నుంచి ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, అసెంబ్లీ స్పీకర్, అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్, శాసన మండలి చైర్మన్, డిప్యూటీ చైర్మన్‌లు తులు ప్రోటోకాల్‌ ప్రకారం ప్రవేశిస్తారు. వీరు తమ భద్రతా వాహనాలతో పాటు నేరుగా అసెంబ్లీకి వెళొచ్చు. వీరితో పాటు ప్రతిపక్ష హోదా కలిగిన నేత కూడా ఈ గేటు గుండా వెళ్లొచ్చు.
రెండో నంబర్‌ గేట్‌ నుంచి మంత్రులు, విప్‌లు లోనికి ప్రవేశిస్తారు. వీరు కూడా తమ వాహనాలతో నేరుగా వెళ్లేందుకు అవకాశం ఉంటుంది. నాలుగో నంబర్‌ గేట్‌ నుంచి ఎమ్మల్యేలు, ఎమ్మెల్సీలు లోపలికి వెళ్లాల్సి ఉంటుంది. అయితే వీరి వాహనాలను బయటే ఉంచేసి, నడుచుకుంటూ లోపలికి వెళ్లాల్సి ఉంటుంది.
అయితే వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మాజీ ముఖ్యమంత్రి అయినా ఆయనకు ప్రస్తుతం ప్రతిపక్ష నేత హోదా లేదు. ఎమ్మెల్యేల సంఖ్య తక్కువుగా 11 మంది ఉండటంతో ప్రతిపక్ష నేత హోదా ఇచ్చేందుకు కూటమి ప్రభుత్వం నిరాకరించింది. దీంతో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఓ సాధారణ ఎమ్మెల్యే మాత్రమే. అందువల్ల జగన్‌ తన వాహన శ్రేణిని బయటే ఉంచి నాలుగో నంబరు గేటు ద్వారా నడుచుకుంటూ లోని వెళ్లాల్సి ఉంటుంది. అయితే ఆయన మాజీ సీఎం కావడం వల్ల ఆయనకు జడ్‌ప్లస్‌ కేటగిరీ భద్రత ఉంటుంది. ఈ నేపథ్యంలో జగన్‌మోహన్‌రెడ్డిని ఒకటో నంబర్‌ గేటు గుండా లోనికి అనుమతిస్తారా? లేదా నాగులుగో నంబర్‌ గేటు గుండా నడిచి వెళ్లాల్సిందేనని ఆదేశాలిస్తారా? అనే దానిపై ఆసక్తి నెలకొంది.
Tags:    

Similar News