దేవాలయాను కించపరుస్తున్న వైఎస్ ఫ్యామిలీ
వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వైఖరిని తప్పు పట్టిన ఏపీ బీజేపీ అధ్యక్షుడు మాధవ్.
వైఎస్ కుటుంబం దేవాలయాలను కించ పరుస్తోందని ఏపీ బీజేపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ అన్నారు. ఆయన సోమవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ఏపీ మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న రోజుల్లో అనేక దేవాలయాలపై దాడులు జరిగాయన్నారు.
తిరుమల తిరుపతి దేవస్థానం నిధులతో ఆలయాలు నిర్మిస్తే మీకేంటి ఇబ్బందని ఆయన ప్రశ్నించారు. టీటీడీ నిధులను ఆలయాల నిర్మాణం, ధార్మిక సంస్థల నిర్మాణం, ధూపదీప నైవేద్యాల కోసం ఉపయోగించుకుంటున్నారు. గత ప్రభుత్వం టీటీడీలో 434 గదులు కూల్చి రూ.600 కోట్లు ఖర్చు చేశారని మండిపడ్డారు.
దేవాలయాలను కించపర్చడంలో దివంగత మాజీ సీఎం రాజశేఖర్ రెడ్డి కుటుంబం మొదటి నుంచీ ఇదే వైఖరి ప్రదర్శిస్తోందని కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్ పరిపాలనలో జరిగిన అవినీతిపై విచారణ జరుగుతోందన్నారు.
ఏపీలో కూటమి నేతృత్వంలో మంచి పాలన జరుగుతోందని మాధవ్ చెప్పారు. డీఎస్సీ అభ్యర్థులకు నియామక పత్రాలు ఇవ్వడం మంచి పరిణామమం. అందుకు కృషి చేసిన మంత్రి నారా లోకేష్‌కు అభినందనలు అన్నారు.
పెట్టుబడులకు మంచి అవకాశంగా అమరావతి ఉంది. గ్రీన్ హైడ్రోజన్ పనులు నడుస్తున్నాయని వివరించారు. కొత్తగా కొన్ని పోర్టుల నిర్మాణాలు జరుగుతున్నాయి. జగన్ మళ్లీ అధికారంలోకి వస్తామంటూ.. పోలీసులు, కాంట్రాక్టర్లను బెదిరించడం మంచిది కాదని హెచ్చరించారు. జగన్ వైఖరి మారకపోతే వచ్చే ఎన్నికల్లో 11 సీట్లు కూడా రావని ఎద్దేవా చేశారు.