మీ పని తీరు బాగుంది ఆస్ట్రేలియాకి రండి లోకేష్‌

ఆస్ట్రేలియా హై కమిటీషన్‌ మంత్రి నారా లోకేష్‌కు లేఖ పంపింది.;

Update: 2025-08-31 08:45 GMT

మంత్రి నారా లోకేష్‌ మీద ఆస్ట్రేలియా ప్రశంసల జల్లు కురిపించింది. పని తీరు చాలా బాగుందని మెచ్చుకుంది. ఆంధ్రప్రదేశ్‌లో మంత్రి నారా లోకేష్‌ ఆధ్వర్యంలో జరుగుతున్న మానవ వనరులు, సాంకేతిక, ఆర్థిక రంగాల్లో మంచి అభివృద్ధి జరుగుతోందని లోకేష్‌ను ఆస్ట్రేలియా ప్రశంసించింది. ఆంధ్రప్రదేశ్‌లో విద్యా రంగంలో మంత్రి నారా లోకేష్‌ ఆధ్వర్యంలో తీసుకొచ్చిన సంస్కణలపైన ప్రశంసించింది. ఈ క్రమంలో మంత్రి నారా లోకేష్‌కు ఆస్ట్రేలియా నుంచి అరుదైన ఆహ్వానం పంపింది. ప్రతిష్టాత్మక స్పెషల్‌ విజిట్స్‌ ప్రోగ్రామ్‌లో భాగస్వాములు కావాలని ఆస్ట్రేలియా లోకేష్‌ను కోరింది. ఆ మేరకు ఢిల్లీలోని ఆస్ట్రేలియా హైకమిషనర్‌ ఫిలిప్‌ గ్రీన్‌ మంత్రి నారా లోకేష్‌కు ఆహ్వాన లేఖను పంపారు.

గత 20 ఏళ్లుగా ఆస్ట్రేలియా నిర్వహిస్తున్న స్పెషల్‌ విజిట్స్‌ ప్రోగ్రామ్‌ కార్యక్రమంలో ఇండియాకు చెందిన అనేక మంది రాజకీయ నాయకులు ఈ ఎస్‌వీపీ ద్వారా ఆస్ట్రేలియాలో పర్యటించారని ఫిలిప్‌ గ్రీన్‌ లోకేష్‌కు వివరించారు. అందులో భాగంగా ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ 2001లోనే ఈ ఎస్‌వీపీలో పాల్గోన్నారని లోకేష్‌కు వివరించారు. అయితే ఈ స్పెషల్‌ విజిట్స్‌ ప్రోగ్రామ్‌(ఎస్‌వీపీ)లో భాగస్వామ్యం కావడం ద్వారా ఆస్ట్రేలియా దేశంలోని కీలకమైన రాజకీయ నాయకులు, విద్యా రంగంలోని నిపుణులు, బడా పారిశ్రామికవేత్తలు, ప్రవాస భారతీయులతో(ఎన్‌ఆర్‌ఐ) కూడా తరచుగా సమావేశాలు అయ్యేందుకు అవకాశాలు క్రియేట్‌ అవుతాయి. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్‌లోని పలు రంగాలు, మరి ముఖ్యంగా విద్యారంగంతో పాటు స్కిల్‌డెవలప్‌మెంట్, ఇన్వెస్ట్‌మెంట్స్, ఆక్వాకల్చర్, మౌలిక వసతుల కల్పన వంటి పలు రంగాలపైన ఆస్ట్రేలియా దేశంతో చర్చించేందుకు ఈ స్పెషల్‌ విజిట్స్‌ ప్రోగ్రామ్‌లు పర్యటన దోహద పడుతాయి.

Tags:    

Similar News