మీపై నిఘా ఉంది జాగ్రత్త...

అధికారులు, ప్రజాప్రతినిధులపై నమ్మకం ఉంది. అయినా యంత్రాలు చూస్తున్నాయి. అని సీఎం హెచ్చరించారు. వైసీపీ నేతలను పందికొక్కులని అభివర్ణించారు.;

Byline :  SSV Bhaskar Rao
Update: 2025-03-01 10:28 GMT

కూటమి ప్రభుత్వంలో టీడీపీ పార్టీ ఎమ్మెల్యేలు. అధికారులు జాగ్రత్తగా ఉండాలని సీఎం చంద్రబాబు పరోక్షంగా హెచ్చరించారు. మీ అందరిపై నాకు నమ్మకం ఉంది. అందులో సందేహం లేదు. బాగా పనిచేస్తున్నారు. కానీ, పథకాల అందజేతలో తప్పుడు సమాచారం అందిస్తే, పక్కాగా దొరికిపోతారని గుర్తు చేశారు.

చిత్తూరు జిల్లా, గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో ఒక్క రోజు పర్యటనలో భాగంగా శనివారం మధ్యాహ్నం 12.28 గంటలకు రామానాయుడుపల్లెలో ఏర్పాటు చేసిన ప్రజా వేదికలో సీఎం చంద్రబాబు మాట్లాడారు. జీడి. నెల్లూరు ఎమ్మెల్యే ధామస్, చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు, గ్రామస్తలు సెల్వి, సర్పంచ్ కూర్చొన్న వేదిక నుంచి సీఎం చంద్రబాబు మాట్లాడుతూ, ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడంలో కాగితాల్లో రాతలు కనిపించినా, యంత్రాలు నిఘా కళ్లతో గమనిస్తున్నాయనే విషయాన్ని మరిచిపోవద్దని అప్రమత్తం చేశారు. ప్రతివిషయం ఆర్టిఫిషియన్ ఇంటెలిజెన్స్, జీపీఎస్ ద్వారా క్షణాల్లో తెలిసిపోతుందని హెచ్చరించారు. ఇల్ల వద్దకు వెళ్లి, పథకాలు ఇస్తున్నారా? కార్యాలయాలకు పిలిపిస్తున్నారా? అనేది తెలుసుకోవడానికి నిత్యం పర్యవేక్షిస్తున్నా అని సీఎం చంద్రబాబు అన్నారు.
జనంలోకి వెళ్లండి..
అధికారులు ఎసీ గదుల్లో కూర్చొంటే ప్రజల సమస్యలు తెలియవని సీఎం చంద్రబాబు హితబోధ చేశారు. టీడీపీ కూటమి ప్రజాప్రతినిధులు కూడా జనంలో ఉండాలని గుర్తు చేశారు. లేదంటే, ప్రజలు మరిచిపోతారు. ప్రభుత్వం చేసే కార్యక్రమాలు మరిచిపోతారని హెచ్చరించారు. ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు, పథకాలను ప్రజలకు అందించడమే కాదు. వారికి స్వయంగా వివరించడానికే నేను పర్యటనలు సాగిస్తన్నా అని సీఎం చంద్రబాబు తన పర్యటనల వెనుక లక్ష్యాన్ని వివరించారు.
ఎమ్మెల్యేలు ప్రజలతో ఉంటేనే, మీతో ప్రజలు ఉంటారని గుర్తు చేశారు. అధికారులు కూడా తరచూ ప్రజల వద్దకు వెళ్లి సమస్యలు తెలుసుకోవాలని సీఎం చంద్రబాబు గుర్తు చేశారు. తద్వారా పరిపాలనపై నమ్మకం ఏర్పడుతుంది. అధికారులు కూడా అభిమానం చూరగొంటారని గుర్తు చేశారు.
రాష్ట్రాన్ని దున్నేశారు..
పిట్టకథ చెప్పడం ద్వారా సీఎం చంద్రబాబు వైసీపీ ప్రభుత్వంలో జరిగిన విధ్వంసాన్ని ఆవిష్కరించారు. ఏమయ్యా మీకు పొలాలు ఉన్నాయా? ఉన్నాయి కదా. పంటలో పందులు పడితే ఏమి చేస్తాయి. తిన్నంత తింటాయి. కడుపు నిండాక ఊరక వెళ్లవు. పంట మొత్తం దున్నస్తాయి. అవునా? కాదా? అది. పల్లెల్లె పంటలపై దాడి చేసే పందుల పరిస్థితి అది.
టీడీపీ కూటమికి ముందు అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వ కాలంలో అదే జరిగింది. ఎక్కడ పడితే అక్కడ ఇస్టానుసారంగా దోచేశారు. దొరికిన కాడికి అప్పులు చేశారు. అధికారం పోయే నాటికి వైసీపీ కాలంలో రాష్ట్రాన్ని పందుల కంటే దారుణంగా ధ్వంసం చేశారని ఆయన ఘాటు పదాలు వాడారు. రాష్ట్రాన్ని వైసీపీ వదిలి వెళ్లిన అప్పుల నుంచి గట్టెక్కించడానికి టీడీపీ కూటమి ప్రభుత్వం కృషి చేస్తూనే, సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను కొనసాగించడానికి తొమ్మది నెలల నుంచి ఒకో మెట్టు ఎక్కుతున్నమని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు.
ఘన స్వాగతం...
చిత్తూరు జిల్లా, గంగాధర నెల్లూరు నియోజకవర్గం లో ఒక్క రోజు పర్యటనలో భాగంగా శనివారం మధ్యాహ్నం 12.28 గంటలకు రామానాయుడుపల్లె వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ చేరుకున్నారు. ఎన్. చంద్రబాబు నాయుడుకు ఇంచార్జి మంత్రి, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు, టీటీడీ అధ్యక్షుడు బి.ఆర్. నాయుడు, అనంతపురం రేయింజ్ డిఐజి షిమోషీ బాజపాయ్, ఎస్పీ మణికంఠ చెందొలు, ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ డాక్టర్ విఎం. థామస్, ఎమ్మెల్యేలు యన్.అమరనాథరెడ్డి, గురజాల జగన్ మోహన్, భానుప్రకాష్, జేసీ జీ.విద్యాధరి, క డ, పి డి (KADA PD) వికాస్ మర్మత్, డి ఎఫ్ ఓ.భరణి,అసిస్టెంట్ కలెక్టర్ హిమవంశీ స్వాగతం పలికారు. అనంతరం బీసీ కాలనీలో ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్ల పంపిణీల భాగంగా కల్లుగీత కార్మికుడు వాసుకు సీఎం చంద్రబాబు పింఛన్ అందించారు.

Similar News