మొన్న పిడుగు–నేడు గ్యాస్ లీకు
హెచ్‌పీసీఎల్‌లో కార్మికులు ప్రమాదాల వల్ల ప్రాణ భయంతో వణికి పోతున్నారు.
విశాఖపట్నంలోని హిందూస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్(హెచ్‌పీసీఎల్)సంస్థలో ప్రమాదం చోటు చేసుకుంది. అయితే ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. దీంతో హిచ్‌పీసీఎల్ అధికారులు, కార్మికులు ఊపిరి పీల్చుకున్నారు. గ్యాస్ లీక్ కావడమే ఈ ప్రమాదానికి కారణంగా మారింది. హెచ్‌పీసీఎల్ విస్తరణ పనులు జరుగుతున్న ప్రాంతంలో పైపు పగలింది. దీంతో గ్యాస్ లీకైంది. దీంతో అక్కడ పని చేస్తున్న వందలాది మంది కార్మికులు భయాందోళనలతో పరుగులు పెట్టారు. హెచ్‌పీసీఎల్ రఫ్ కంపెనీ పంపింగ్ మిషనరీ వద్ద పైపు లీక్ కారణంగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో అప్రమత్తమైన అధికారులు కార్మికులను బయటకు పంపించారు. రంగంలోకి దిగిన యంత్రాంగం నష్టం జరిగిన వస్తువులను అత్యవసరంగా పునరుద్దరణ కార్యక్రమాలు చేపట్టారు. మరో వైపు ఈ ప్రమాద ఘటనపై హెచ్‌పీసీఎల్ స్పందించింది. ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని, పగిలి గ్యాస్‌లీకైన పైపునకు మరమ్మతులు చేపట్టినట్లు వెల్లడించింది. మరో వైపు ఇటీవలే విశాఖలోని ఇదే హెచ్‌పీసీఎల్ సంస్థ మీద పిడుగు పడింది. దీంతో అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేందుకు ఉపక్రమించినా, నావీకి చెందిన హెలిక్యాప్టర్‌ను కూడా రంగంలోకి దింపారు. హెలికాప్టర్ ద్వారా గాలిలో నుంచి నీళ్లను చల్లి మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. అయితే ఈ పిడుగు పడిన ఘటనలో కూడా ఎలాంటి ప్రాణ నష్టం జరక్కపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.