అబ్బో.. ఇంత బరువో.. తృటిలో తప్పిన ప్రమాదం..!

ఎర్రచందనం విక్రయాలపై అమాయక ప్రశ్నలతో పవన్ కల్యాణ్ అధ్యయనం ఇలా సాగింది...

Byline :  SSV Bhaskar Rao
Update: 2025-11-08 13:36 GMT
ఎర్రచందనం దుంగ బరువును పరిశీలిస్తున్న డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కల్యాణ్

అబ్బో.. చాలా బరువు ఉందే..! ఎర్రపుష్పాలు ఇంతబరువు ఉన్న మొక్కలు ఎలా తరలిస్తున్నారబ్బా..! డిప్యూటీ సీఎం, అటవీశాఖ మంత్రి కొణిదెల పవన్ కల్యాణ్ మదిలో మెదిలిన సందేహం ఇది. ఎర్రచందనం మొద్దు (దుంగ) బరువు పరిశీలించడానికి పవన్ కల్యాణ్ ప్రయత్నించే సమయంలో తృటిలో ప్రమాదం తప్పింది. ఓ దుంగ ( LoG )ను పైకి ఎత్తడానికి ప్రయత్నించారు. కిందికి జారిన మొద్దును ఒడిసి పట్టుకుని ఆయన జాగ్రత్తగా కిందికి దించారు. పక్కనే ఉన్న అటవీశాఖ అధికారులు కూడా హైరానా పడ్డారు.

తిరుపతి ఎర్రచందనం గోదాములో అటవీశాఖ మంత్రి  కొణిదెల పవన్ కల్యాణ్

తిరుపతి జిల్లాలో ఒకరోజు పర్యటన కోసం వచ్చిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మామండూరు సమీపంలోని శేషాచలం అటవీ ప్రాంతంలో పరిశీలించారు. ఆ తర్వాత అక్రమంగా రవాణా చేస్తుండగా స్వాధీనం చేసుకున్న ఎర్రచందనం దుంగలతో ఏర్పాటు చేసిన గోదామును పరిశీలించారు.
ఎర్రచందనం దుంగల విక్రయాలపై నిర్వహిస్తున్న పద్ధతులపై అటవీశాఖ మంత్రి అధికారులను ప్రశ్నలతో హైరానాకు గురి చేశారు. అక్రమ రవాణా చేస్తుండగా స్వాధీనం చేసుకున్నదుంగల కోసం మంగళం సమీపంలోని గోదాము ఏర్పాటు చేశారు. అక్కడికి తీసుకుని వస్తున్న ఎర్రచందనం దుంగల రికార్డుల నిర్వహణపై సమాచారం తెలుసుకునే ప్రయత్నంలో డిజిటిలైజేషన్ ఎందుకు చేయడం లేదనే ప్రశ్నకు సమాధానం దొరకలేదు. ఒకవేళ వర్షం పడి పాడైతే, వివరాలు ఎలా తెలుస్తాయని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. దీంతో సాఫ్ట్ కాపీ ఉందని వివరిస్తూ, ఏ ప్రాంతం నుంచి తీసుకుని వచ్చామనే పర్మిట్లు, విక్రయాల అనంతరం నమోదు చేసే రికార్డులను చూపించారు. దీనికి డిప్యూటీ సీఎం పవకల్యాణ్ సంతృప్తి చెందినట్టు కనిపించ లేదు.
ప్రశ్నలే.. ప్రశ్నలు..

ఎర్రచందనం దుంగల గోదామును పరిశీలించిన సమయంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అనేక ప్రశ్నలు సంధించారు. ఆసాంతం పూర్తి స్థాయిలో అధ్యయనం చేసే విధంగా పరిశీలన చేసినట్లు కనిపిస్తోంది. పవన్ కల్యాణ్ ఎమని ప్రశ్నించారంటే..
"ఈ ఎర్రచందనం ( red sandal ) దుంగల విలువ ఎంత? ఎవరు కొంటున్నారు. ఎంతకు విక్రయిస్తున్నారు? కథలు చెప్పొద్దు. గ్రేడింగులపై రకరకాలు చెబుతు్ననారు. బాగుండి. విక్రయాలు సాగించే సమయంలో లోగ్రేడ్ కలిపేస్తున్నారం? జమేనా" అని రాష్ట్ర అటవీ శాఖ మంత్రి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ( Deputy CM Pawan Kalyan ) స్పందించిన ప్రశ్నలు ఇవి.
ఓ ఎర్రచందనం దుంగపైకి లేపడానికి ప్రయత్నించి,ఇంత బరువుందేంటి?అని పవన్ కళ్యాణ్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అంటే ఆయన మదిలో మిగిలిన సందేహం ఒకటి అంతర్గతంగా కనిపిస్తుంది. ఎర్రచందనం దుంగ అంత సునాయాసంగా ఎర్రపుష్పాలు ఎలా తరలిస్తున్నారు? అనే సందేహం కలిగినట్లు ఉంది.
అధికారులు ఏమి చెప్పారంటే..
తిరుపతి అటవీ శాఖ అధికాలు ఎర్రచందనం దుంగల విలువను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు వివరించారు.
"ఇది ఏ గ్రేడ్ ఎర్రచందనం దుంగ నీటి బరువుతో పోలిస్తే 1.4% బరువు ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ఇది మునుగుతుంది"అని అధికారులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు వివరించారు. మెటాలిక్ సౌండ్ వచ్చే ఈ ఎర్రచందనం దొంగ వాయిద్య పరికరాల తయారీకి ఉపయోగపడుతుంది అని వివరించారు.

బి గ్రేడ్ ఎర్రచందనం దుంగలు కూడా మెటాలిక్ సౌండ్ వస్తుంది ఇది జపాన్ వాళ్ళు ఎక్కువగా కొనుగోలు చేస్తారు అని చెప్పారు. నాలుగు రకాల గ్రేడింగ్ తో ఉన్న ఎర్రచందనం దొంగలను వాటి ప్రాధాన్యతను అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ అధికారుల నుంచి తెలుసుకున్నారు.
ఎక్కడికి పంపిస్తారు?

మంగళం సమీపంలోని ఎర్రచందనం గోదాంలో నిల్వ ఉంచిన దొంగలను పూర్తిగా పరిశీలించారు. ఈ సందర్భంగా అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ ఆ శాఖ అధికారులు ఉద్దేశించి కొన్ని ప్రశ్నలు అడిగారు. ఈ దుంగలు ఎక్కడికి పంపిస్తారు. ఎవరు కొంటారు. ఎంతకు విక్రయిస్తారు అనే ప్రశ్నను సంధించారు.
బి గ్రేడ్ లోని ఎర్రచందనం కేరళలోని ఆయుర్వేద వైద్యం కోసం కూడా కొనుగోలు చేస్తారని అధికారులు మంత్రి పవన్ కళ్యాణ్ కు వివరించారు.
కర్ణాటక ప్రాంతం నుంచి వచ్చి కొనుగోలు చేసే వారు చిన్నపాటి ముక్కలను వాయిద్య పరికరాలలో బిట్స్ వీలుగా అమరుస్తారు. ఎర్రచందనం గుళికలు హారాలు తయారు చేయడానికి వినియోగించి జపాన్ కు పంపిస్తారని అధికారులు స్పష్టం చేశారు.
ఆదాయం వచ్చింది.
ఇటీవల కొన్ని ఎర్రచందనం దుంగలు విక్రయించినట్లు అధికారులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు వివరించారు. 35 ఎర్రచందనం దుంగల విక్రయం ద్వారా 6.71 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. ఆదాయం వచ్చింది. గత నెలలో కూడా 143 టన్నులు ఎర్రచందనం దొంగలు విక్రయించినట్లు అధికారులు స్పష్టం చేశారు. ఎర్రచందనం ముక్కలు నీటిలో వేస్తే ఎర్రగా మారుతుంది. ఆల్కహాల్ లో మాత్రమే వేస్తేనే కరుగుతుంది. డై వేయడానికి కూడా దీనిని వినియోగిస్తారని అధికారులు ఎర్రచందనం దుంగల ప్రత్యేకతలను అధికారులు వివరించారు.
ఆ.. ఆరోపణలు ఏంటి..

మీరు చెబుతునంత బాగానే ఉంది. ఎర్రచందనం విక్రయాల్లో అనేక ఆరోపణలు ఉన్నాయనే విషయాన్ని అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ ప్రధానంగా ప్రస్తావించారు. బయట చాలా రకాలుగా మాట్లాడుతున్నారనే విషయాన్ని కూడా ఆయన ప్రస్తావించడంతో అటవీ శాఖ అధికారులకు చెమటలు పట్టాయి.
"ఎర్రచందనం దుంగల నాణ్యతను బట్టి రకరకాల గ్రేడింగ్లు నిర్ణయిస్తున్నారు బాగానే ఉంది. విక్రయించేటప్పుడు అన్ని కలిపేస్తున్నారని అంటున్నారు? ఇలా ఎందుకు జరుగుతోంది" అని అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ అధికారులు సూటిగా ప్రశ్నించారు.
"అలాంటిది ఏమిలేదు సార్. స్వాధీనం చేసుకున్న ఎర్రచలనం దొంగలు బరువు వేయడం, కొలతలు వేసి, ఒక నంబర్ కేటాయిస్తున్నాం. గ్రేడును బట్టి నిలువ ఉంచుతున్నాం. రిజిస్టర్లు కూడా ఆ విధంగానే నిర్వహిస్తున్నాం అని అధికారులు వివరణ నేర్చుకున్నారు.
ఇక.. ఏమి చేస్తారో..?
తిరుపతిలో ఎర్రచందనం గోదామును రాష్ట్ర అటవీశాఖ మంత్రి, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పరిశీలన చేయడం అనడం కంటే, అధ్యయనం చేయడానికే వచ్చినట్లు పరిస్థితి కనిపిపిస్తోంది. ఎర్రచందనం అక్రమ రవాణ నిరోధానికి టాస్క్ ఫోర్స్ పనిచేస్తోంది. అటవీశాఖ వారి పరిధిలో వారు నిఘా వేశారు. ఈ పరిస్థితుల్లో రాయలసీమలో ప్రధానంగా చిత్తూరు, కడప జిల్లాలో విస్తరించి ఉన్న శేషాచలం అడవుల నుంచి భారీగా ఎర్రచందనం అక్రమ రవాణా అవుతోంది. ఓ పక్క గట్టి నిఘా కూడా ఉంది. అయినా, తరచూ అక్రమంగా తరలిస్తున్న ఎర్రచందనం దుంగలు పట్టుబడుతూనే ఉంది. గ్లోబల్ టెండర్ల ద్వారా విక్రయాలు జరుగుతున్నట్లు ఇప్పటి వరకు వినిపిస్తోంది. తాజాగా అటవీశాఖ మంత్రి పవన్ కల్యాణ్ కు వివరించిన మేరకు
"కేరళ, బెంగళూరు ప్రాంతాల వారు కూడా ఎర్రచందనం కొనుగోలు చేస్తున్నారు. వాయిద్య పరికరాల తయారీతో పాటు ఔషధ తయారీకి వాడుతున్నట్లు స్పష్టమైంది. అన్ని వివరాలు సమగ్రంగా తెలుసుకున్న మంత్రి పవన్ కల్యాణ్ ఎర్రచందనం వనాల రక్షణ, స్మగ్లింగ్ నిరోధం, పట్టుబడిన ఎర్రచందనం దుంగల విక్రయాలకు ఎలాంటి సంస్కరణలు తీసుకుని వస్తారనేది ఆసక్తికరంగా మారింది.
Tags:    

Similar News