వైసీపీ సోషల్‌ మీడియా కార్యకర్తలకు బెయిల్‌ మంజూరు

కూటమి ప్రభుత్వం పెద్ద ఎత్తున వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలపై కేసులు నమోదు చేసింది.

By :  Admin
Update: 2024-11-29 13:39 GMT

కూటమి ప్రభుత్వం సోషల్‌ మీడియాలో అసభ్యకర పోస్టులు పెడుతున్నారనే కారణంతో అరెస్టు అయిన వైసీపీ సోషల్‌ మీడియా కార్యకర్తలకు బెయిల్‌ మంజూరైంది. చిలకలూరిపేట నియోజక వర్గానికి చెందిన వైసీపీ సోషల్‌ మీడియా కార్యకర్తలు పెద్దిరెడ్డి సుధారాణి దంపతులకు గుంటూరు కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. సోషల్‌ మీడియాలో అభ్యంతర పోస్టులు పెట్టారంటూ సుధారాణి దంపతులపై గుంటూరు నగరపాలెం పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం నరసరావుపేట సబ్‌జైల్లో ఉన్న సుధారాణి దంపతులను పీటీ వారెంట్‌ ద్వారా గుంటూరు కోర్టులో ప్రవేశపెట్టగా కోర్టు వారికి బెయిల్‌ను మంజూరు చేసింది. వైజాగ్‌ వైసీపీ సోషల్‌ మీడియా కార్యకర్త బోడి వెంకటేశ్వర్లుకు కూడా గుంటూరు కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. అసభ్యకర పోస్టులు సోషల్‌ మీడియాలో పెట్టారంటూ ఈయనపై పట్టాభిపురం పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. ఒంగోలు జైలు నుంచి పీటీ వారెంట్‌ ద్వారా గుంటూరు కోర్టులో ప్రవేశ పెట్టగా కోర్టు ఈయనకు బెయిల్‌ మంజూరు చేసింది.


Tags:    

Similar News