అటెన్షన్ క్రియేట్ చేసిన అంబటి 'హరిహర వీరమల్లు 'ట్వీట్

వైసీపీ నేత ట్వీట్ తో రాజకీయంగా చర్చలే చర్చలు;

Update: 2025-07-23 10:36 GMT

పవన్ కళ్యాణ్ హీరో గా వస్తున్న హరిహరవీరమల్లు సినిమా కొన్ని గంటల్లో విడుదల అవుతూ, ఏపీ లో ఫ్యాన్స్ హవా కొనసాగుతున్న సమయంలో వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు ఈ చిత్రంపై చేసిన ట్వీట్ రాజకీయ వర్గాలలో కాక పుట్టిస్తోంది.

'పవన్ కళ్యాణ్ గారి 'హరిహర వీర మల్లు' సినిమా సూపర్ డూపర్ హిట్టై, కనక వర్షం కురవాలని కోరుకుంటున్నాను !' అని ఎక్స్ లో అంబటి తన ఖాతాలో ఒక ఆసక్తికర పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ కు పవన్ కళ్యాణ్, నాగబాబుని ట్యాగ్ కూడా చేశారు. ఇప్పడా ట్వీట్ రాజకీయ, సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
పవన్ కళ్యాణ్ మీద ప్రతిక్షణం ఒంటికాలిపై లేచే, వైసీపీ నేత అంబటి ఈ రకంగా ఎక్స్ లో పోస్ట్ పెట్టడం, నానా రకాల ఊహాగానాలకు తావిస్తోంది. జనసేన నేతలు, పవన్ ఫ్యాన్స్ ఈ ట్వీట్ ను ఏ కోవలో తీసుకోవాలో అర్థం కాని పరిస్థితి లోకి పెట్టేశారు. నిజంగానే పవన్ కళ్యాణ్ సినిమా సూపర్ డూపర్ హిట్ కావాలని ఆకాంక్షించారా... లేక వ్యంగ్యంగా ట్వీట్ చేశారా అన్నదీ చర్చిస్తున్నారు. మరి ఇలాంటి ట్వీట్ పెట్టేముందు తమ పార్టీ అధినేత జగన్ పర్మిషన్ కూడా తీసుకున్నారో లేదో అన్న అనుమానాన్ని మరికొందరు వ్యక్తం చేస్తున్నారు.
గతంలో పవన్, నాగబాబుల మీద అంబటి ఎన్నో విమర్శలతో పోస్టులు పెట్టారు, బహిరంగంగా పెద్ద ఎత్తున విమర్శలు, సెటైర్లు వేశారు. మరి ఇప్పుడు హరిహర వీరమల్లు పై పోస్ట్ లో మతలబు ఎవరికీ అర్దం కావడంలేదు.
వైసీపీ నేతలపై కేసులు,అరెస్టులతో ఏపీ రాజకీయాలు హాట్ హాట్ గా నడుస్తున్న వేళ అంబటి ఇలాంటి టర్న్ ఎందుకు తీసుకున్నారనే దానిపై అనేక కామెంట్లు వినిపిస్తున్నాయి. ఎవరు ఎలా ఊహించుకున్నా పర్లేదనుకున్నారో ఏమో.. అసలు విషయం లోగుట్టు మాత్రం ఆయనకే ఎరుక
Tags:    

Similar News