ఈనేతలు తిరిగి అసెంబ్లీకి వస్తారా?

పోలింగ్‌ సమయం వచ్చింది. ప్రముఖుల గెలుపు ఓటములపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇంతకూ ఈ నేతలు గెలుస్తారా?

Update: 2024-05-11 09:35 GMT

ఆంధ్రప్రదేశ్‌లో ఓటర్లు రెండు రోజుల్లో రాజకీయ నాయకుల భవితవ్యాన్ని తేల్చనున్నారు. ప్రధానంగా ఆయా పార్టీల అధ్యక్షులు, జిల్లా అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులను మినహాయిస్తే మిగిలిన ప్రముఖమైన నాయకులు, ప్రజా ప్రతినిధుల పరిస్థితి ఏమిటి? వీరు ఎలాంటి పోటీని ఎదుర్కొంటున్నారు? అనుకున్నది సాధిస్తారా? ఓటర్లు ఎలాంటి తీర్పునిస్తారు అనేదానిపై రాష్ట్రంలో జోరుగా చర్చలు సాగుతున్నాయి.

ముఖ్యమైన నాయకుల్లో తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ ఒకరు. ఈయన గత ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డిపై స్వల్ప ఓట్ల తేడాతో ఓటిపోయారు. తిరిగి ఈ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా మంగళగిరి నుంచి బరిలో ఉన్నారు. 55వేలకుపైగా మెజారిటీ సాధిస్తానని ఎన్నికల ప్రచార సభలో ఇటీవల చాలెంజ్‌ విసిరారు. లోకేష్‌లో గతానికి ఇప్పటికీ పబ్లిక్‌ స్పీచ్‌ స్కిల్స్‌ పెరిగాయి. పట్టుదలతో గెలుపు కోసం పని చేస్తున్నారు. ఈయనపై వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థిగా మురుగుడు లావణ్య బరిలో ఉన్నారు.
ఆర్కే రోజా సినీతార కావడం, డ్యాన్సులు వేసినప్పుడు, పంచ్‌లు వేసినపుడు ప్రజలు చర్చించుకోవడం సాధారణంగా మారింది. తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా 2004లో నగరి నుంచి, 2009లో చంద్రగిరి నుంచి పోటీ చేసి ఓడిపోయారు. తర్వాత వైఎస్‌ఆర్‌సీపీలో చేరి 2014, 2019లో నగరి నుంచి గెలిచారు. తర్వాత మంత్రి అయ్యారు. అంతకుముందు ఏపీఐఐసీ చైర్‌పర్సన్‌గా ఉన్నారు. తక్కువ మెజారిటీతో ఈమె గెలుపొందినప్పటికీ రోజాకు వైఎస్‌ జగన్‌ మంచి ప్రేయారిటీ ఇచ్చారు. ఈ ఎన్నికల్లో మాజీ మంత్రి గాలి ముద్దుకృష్ణుమ నాయుడు కుమారుడు గాలి భానుప్రకాష్‌పై పోటీ చేస్తున్నా రు. వైఎస్‌ఆర్‌సీపీ నుంచి ముఖ్య నేతలు ఇటీవల టీడీపీలో చేరారు. రోజా సోదరులు ఆమె మంత్రి పదవిని అడ్డం పెట్టుకొని అక్రమాలకు ప్పాలడ్డారనే ఆరోపణలు వచ్చాయి. 2024 ఎన్నిల్లో ఆమె గెలుపు ఓటములపై తీవ్ర చర్చ సాగుతోంది.
విజయవాడ పశ్చిమ నుంచి బీజేపీ అభ్యర్థిగా యలమంచిలి సుజనా చౌదరి పోటీలో ఉన్నారు. ఇక్కడ నుంచి మొదటి సారిగా పోటీ చేస్తున్న సుజనా చౌదరిని ఎలాగైనా ఓడించాలనే పట్టుదలతో వైఎస్‌ఆర్‌సీపీ ఉంది. సుజనా చౌదరి గతంలో టీడీపీ నుంచి రాజ్యసభ ఎంపీగా ఎన్నికై బీజేపీలో చేరారు. ప్రత్యక్ష ఎన్నికల్లో దిగడం మొదటి సారి. ఎన్డీఏ కూటమి తరపున పోటీ చేస్తున్నందు వల్ల జనసేన, టీడీపీ నేతలు సరైన సపోర్టు ఇవ్వడం లేదనే ప్రచారం జరుగుతోంది. వైఎస్‌ఆర్‌సీపీ తరపున షేక్‌ ఆసిఫ్‌ రంగంలో ఉన్నారు. ముస్లింలు, నగరాలు, బీసీలు, ఎస్సీల ఓట్లు ఎక్కువుగా వైఎస్‌ఆర్‌సీపీ వైపు మొగ్గు చూపే చాన్స్‌ ఉందని స్థానికుల్లో చర్చ సాతోంది.
గోపాలపురం నుంచి మంత్రి తానేటి వనితి వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థిగా రంగంలో ఉన్నారు. ఆమె గత ఎన్నికల్లో కొవ్వూరు నుంచి పోటీ చేసి గెలిచారు. ఈ ఎన్నికల్లో గోపాలపురం నుంచి బరిలో ఉన్నారు. అయితే 2009లో ఇక్కడ నుంచే టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచింది. తర్వాత వైఎస్‌ఆర్‌సీపీలో చేరారు. 2014లో ఆ పార్టీ అభ్యర్థిగా కొవ్వూరు నుంచి పోటీ చేసి ఓటి పోయారు. 2019లో ఇదే నియోజక వర్గం నుంచి గెలిచి మంత్రి అయ్యారు. 2024 ఎన్నికల్లో గోపాలపురం నుంచి రంగంలో ఉన్నారు. టీడీపీ అభ్యర్థిగా మద్దిపాటి వెంకటరాజు బరిలో ఉన్నారు. గట్టి పోటీని ఎదుర్కొంటున్నారు.
గుడివాడ నియోజక వర్గం నుంచి వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థిగా కొడాలి నాని బరిలో ఉన్నారు. ఇప్పటి వరకు నాలుగు సార్లు గెలిచిన నాని రెండు సార్లు వైఎస్‌ఆర్‌సీపీ నుంచి రెండు సార్లు టీడీపీ నుంచి గెలిచారు. ఈయనకు మాస్‌ లీడర్‌గా పేరుంది. ప్రత్యర్థులను బూతులతో ముప్పు తిప్పలు పెట్టడం ఈయనకు అలవాటు. కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వంపై పెట్టిన అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇచ్చినందుకు గాను నాని అనర్హత వేటుకు గురయ్యారు. తర్వాత వైఎస్‌ఆర్‌సీపీలో చేరారు. ఈయనపై టీడీపీ అభ్యర్థిగా వెనిగండ్ల రాము రంగంలో ఉన్నారు. నాని కూడా టీడీపీ అభ్యర్థి నుంచి గట్టి పోటీని ఎదుర్కొంటున్నారు.
ఒంగోలు నుంచి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థిగా రంగంలో ఉన్నారు. ఆయనపై టీడీపీ మాజీ ఎమ్మెల్యే దామంచర్ల జనార్దన్‌ పోటీలో ఉన్నారు. రెండున్న ఏళ్లు సీఎం జగన్‌ మంత్రి వర్గంలో మంత్రిగా ఉన్న బాలినేని సన్‌ స్ట్రోక్‌ ఎదుర్కోవలసి వచ్చింది. ఇప్పటి వరకు ఆరు సార్లు పోటీ చేసిన బాలినేని ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. తొలుత కాంగ్రెస్‌ నుంచి మూడు సార్లు గెలిచిన బాలినేని తర్వాత వైఎస్‌ఆర్‌సీపీ చేరారు. 2014లో ఆ పార్టీ అభ్యర్థిగా ఓడిపోయిన బాలినేని 2019లో గెలిచారు. 2019లో ఓడిపోయిన దామంచర్ల జానార్దన్‌ 2024లో బాలినేనిపై బరిలోకి దిగారు. బాలినేని గెలుపు అంత తేలిక కాదని స్థానికులు చెబుతున్నారు. ఈయన స్వయాన సీఎం జగన్‌కు బందువు.
మాచర్ల నుంచి వైఎస్‌ఆర్‌సీపీ నుంచి పోటీ చేస్తున్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కూడా ఈ సారి గట్టి పోటీని ఎదుర్కొంటున్నారు. ఈయన ఇప్పటి వరకు నాలుగు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2009లో కాంగ్రెస్‌ నుంచి గెలిచిన ఆయన తర్వాత వైఎస్‌ఆర్‌సీపీలో చేరారు. తర్వాత 2012, 2014, 2019 ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థిగా గెలుపొందారు. టీడీపీ నుంచి రంగంలో ఉన్న బ్రహ్మానందరెడ్డి నుంచి గట్టి పోటీని ఎదుర్కొంటున్నారు. 2009లో టీడీపీ నుంచి పోటీ చేసి ఓడి పోయిన బ్రహ్మానందరెడ్డి తిరిగి 2024లో పోటీకి దిగారు. మధ్యలో ఆయన పోటీ చేయలేదు.
వీరే కాకుండా ఇరు పార్టీల్లో ఉన్న కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి, పితాని సత్యనారాయణ, పీడిక రాజన్నదొర, గంట శ్రీనివాసరావు, చింతమనేని ప్రభాకర్, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి వంటి పలువురు ప్రముఖల గెలుపు ఓటములపై రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది.
Tags:    

Similar News