నిన్న జగన్ పర్యటన..నేడు కేసు

పోలీసుల నిబంధనలు ఉల్లంఘించారనే కారణంతో పామర్రు మాజీ ఎమ్మెల్యేపై కైలే అనిల్ కుమార్ పైన కేసు నమోదు చేశారు.

Update: 2025-11-05 06:26 GMT

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి మంగళవారం కృష్ణా జిల్లాలోని మొంథా తుఫాను బాధిత ప్రాంతాల్లో పర్యటించిన సందర్భంలో పోలీసు నిబంధనలు ఉల్లంఘించారనే కారణాలతో మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్, పలువురు వైఎస్సార్సీపీ నేతలపై పమిడిముక్కల పోలీసులు బుధవారం కేసు నమోదు చేశారు. జగన్ తన పర్యటనలో దెబ్బతిన్న పొలాలు, పంటనలు పరిశీలించి, రైతులతో సమావేశమై, వారి సమస్యలు తెలుసుకున్నారు. ఈ పర్యటనలో భారీ భద్రతా ఏర్పాట్లు, చేపట్టారు. డ్రోన్‌ల సహాయంతో నిఘా ఉంచారు. పమిడిముక్కల మండలం గోపువానిపాలెం వద్ద హైవేపై ట్రాఫిక్‌కు ఇబ్బంది కలిగించవద్దని సీఐ చిట్టిబాబు వైఎస్సార్సీపీ నేతలను ముందుగానే హెచ్చరించారు. అయితే, తమ ఇష్టమంటూ మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్, ఇతర నేతలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. పోలీసుల విధులకు ఆటంకం కలిగించారనే ఆరోపణలపై పోలీసులు కేసు నమోదు చేశారు.  

బుధవారం పమిడిముక్కల పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసిన సీఐ చిట్టిబాబు మాట్లాడుతూ, “పోలీసు నిబంధనలు, ట్రాఫిక్ నియమాలు ఉల్లంఘించి, విధులకు అడ్డుపడ్డారు. డ్రోన్ విజువల్స్ ద్వారా మిగిలిన వారిని గుర్తించి, వారిపైనా కఠిన చర్యలు తీసుకుంటాము” అని తెలిపారు. అయితే వైఎస్సార్సీపీ ఈ చర్యలను ఖంఢిస్తున్నారు. కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని, కావాలనే తమపై కేసులు నమోదు చేస్తున్నారని మండిపడ్డారు. 

Tags:    

Similar News