మధుబాబుపైనా కేసు ఉంటుందా?.. చట్టం ఏం చెప్తోంది..!

విజయవాడ కిడ్నీ ముఠా కేసులో మధుబాబుపైన కూడా కేసు నమోదవుతుందా? అసలు అవయవ క్రవిక్రయాలపై చట్టం ఏం చెప్తోంది? శిక్షలు ఎలా ఉంటాయంటే..!

Update: 2024-07-09 09:02 GMT

విజయవాడలో కిడ్నీ మోసం కేసు కలకలం సృష్టించింది. ఈ కేసులో మధ్యవర్తులు బాషా, వెంటస్వామి, ఆపరేషన్ చేసిన డాక్టర్ శరత్‌బాబులపై కేసు కూడా నమోద చేశారు పోలీసులు. దర్యాప్తును వేగవంతం కూడా చేశారు. అందుకు కారణంగా భారతదేశంలో అవయవ క్రవిక్రయాలు చేయడం చట్టరీత్యా నేరం. దీని ప్రకారం చూసుకుంటే పోలీసులు ఇప్పుడు ఈ కేసులో బాధితుడు అయిన మధుబాబు పైన కూడా కేసు నమోదు చేస్తారా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. కొందరు మేధావులు చేస్తారంటే.. మరికొందరు అదేమీ ఉండదంటున్నారు.

మనదేశంలో లంచం తీసుకోవడం ఎంత తప్పో అదే విధంగా లంచం ఇవ్వడం కూడా అంతే తప్పు. ఈ నియమం మిగిలిన చట్టాలకు కూడా వర్తిస్తుంది. ఈ విధంగా మానవ అవయవ మార్పిడి చట్టం 1994 ప్రకారం అనధికారికంగా మానవ అవయావాల మార్పికి పాల్పడటం, మానవ అయవాలు క్రయవిక్రయాలు చేయడం నేరం. దీనికి జైలు శిక్ష, జరిమానా రెండూ ఉంటాయి. అవయవాలను డబ్బులకు అమ్ముకోవడం కూడా నేరమే అని ఈ చట్టం చెప్తోంది. కాబట్టి దీని ప్రకారం చూసుకుంటే గుంటూరుకు చెందిన మధుబాబుపై కూడా పోలీసులు చట్టప్రకారం చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని కొందరు నిపుణులు చెప్తున్నారు. అయితే ఇప్పటివరకు మధుబాబుపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు ఎక్కడా చెప్పలేదు. మరి మధుబాబు విషయంలో పోలీసులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

చట్టం ఏం చెప్తోంది.. శిక్షలు ఎలా ఉంటాయి

భారతదేశంలో 1970 నుంచి ఈ అవయవ విక్రయాలు పెరగడం మొదలైంది. అనేక సందర్బాల్లో డబ్బుల కోసమే, మరే ఇతరత్రాల కోసమే వ్యక్తులు తమ అవయవాలను అమ్ముకున్న ఘటనలు జరిగాయి. వీటికి ఫుల్ స్టాప్ పెట్టాలని భావించిన ప్రభుత్వం 1994లో మానవ అవయవ, టిష్యూ మార్పిడి చట్టం 1994ను తీసుకొచ్చింది. ఈ చట్టం ప్రకారం అవయవాలను విక్రయించడం నేరంగా పరిగణించబడుతుంది. కేవలం కుటుంబీకులకు అవయవ దానం చేయొచ్చు. కొన్ని సందర్భాల్లో ఎటువంటి నగదు ఆశించకుండా కూడా అవయవ దానం వేరే వారికి చేసే వెసులుబాటును ఈ చట్టం కల్పిస్తుంది.

ఈ చట్టంలోని సెక్షన్ 18 ప్రకారం.. అనధికారికంగా అవయవాన్ని తొలగించడంలో ఎవరైనా సహాయపడితే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబతాయి. ఈ సెక్షన్ ప్రకారం వారికి పది సంవత్సరాల జైలు శిక్ష, రూ.20 లక్షల జరిమానా విధించబడుతుంది. అదే విధంగా ఈ సెక్షన్‌లో సబ్ సెక్షన్ 1 ప్రకారం ఇటువంటి కేసులో దోషిగా నిర్ధారించబడిన వ్యక్తి రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ అయితే.. అతడి లైసెన్స్‌ను రద్దు చేయడంతో పాటు పలు ఇతర చట్టపరమైన చర్యలు కూడా ఉంటాయి. ఒకవేళ ఇది సదరు ప్రాక్టీషనర్ పాల్పడిన తొలి నేరం అయితే అతడి లైసెన్స్‌ను మూడు సంవత్సరాలకు రద్దు చేస్తారు. అలా కాకుండా రేండోదో మూడోదో అయితే అతడి లైసెన్స్‌ను శాశ్వతంగా రద్దు చేయబడుతుంది.

సెక్షన్ 19 ప్రకారం.. మానవ అవయావాల క్రయవిక్రయాల్లో పాలుపంచుకున్న వ్యక్తికి కూడా శిక్ష ఉంటుంది. వారికి 5 నుంచి 10 సంవత్సరాల జైలు శిక్షతో పాటు రూ.20 లక్షల నుంచి రూ.కోటి వరకు జరిమానా విధించే అవకాశం ఉంది. వీరితో పాటు తన అవయవాన్ని అమ్మడానికి సిద్ధమైన వ్యక్తికి కూడా శిక్ష ఉంటుంది. అదే విధంగా ఈ చట్టంలోని ఏ ఇతర నిబంధనను ఉల్లంఘించినా సెక్షన్ 20 కింద ఐదేళ్ల వరకు జైలు శిక్షతో పాటు రూ.10 లక్షల వరకు జరిమానా విధించే అవకాశాలు ఉన్నాయి.

అయితే ఈ చట్టానికి సంబంధించి కేసుల్లో సంబంధిత అధికారులు, కుటుంబీకులు, బాధితులు ఎవరైనా ఫిర్యాదు చేయనిదే కోర్టులు కూడా సుమోటోగా కేసును తీసుకోలేవు. అంతేకాకుండా మెట్రోపొలిటన్, జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ మాత్రమే ఈ కేసులను విచారించాల్సి ఉంటుందని చట్టం చెప్తోంది.

Tags:    

Similar News