చిట్టి తల్లీ బడికెళ్లు సీటిపిస్తా

మంత్రి నారా లోకేష్‌ మరో సారి స్పూర్తిగా నిలిచారు.

Update: 2025-09-21 08:13 GMT

చిట్టి తల్లీ నిశ్చింతగా చదువుకో.. కేజీబీవీలో సీటు ఇప్పించే బాధ్యత నాది.. అంటూ మంత్రి నారా లోకేష్‌ పేర్కొన్నారు. తనకు చదువుకోవాలని ఉన్నా.. ఆర్థిక కష్టాలతో పాటుగా కేజీబీకీలో సీటు రాకపోవడంతో కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం బూదూరు గ్రామానికి చెందిన మీనిగ కుమార్, సంతోషమ్మల కుమారెత్త జెస్సీ కూలీగా మారింది. స్వగ్రామంలో ఐదో తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలలో పూర్తి చేసుకున్న జెస్సీ సమీపంలో ఉన్న చిలకలదోణలోని కేజీబీవీలో ఆరో తరగతికి దరఖాస్తు చేసుకుంది. అయితే జెస్సీకి సీటు రాలేదు. జిల్లా అధికారులను కలిసి తమ గోడు వినిపించుకున్నా సీటు దొరక్కపోడంతో ప్రైవేటు పాఠశాలలో చదివే ఆర్థిక స్థోమత లేక కూలీగా మారింది. తల్లిదండ్రులు తమతో పాటు జెస్సీని కూడా పత్తి పనులకు తెలంగాణకు తీసుకెళ్లారు. ఇటీవల రెండు రోజుల క్రితం స్వగ్రామానికి వచ్చింది. తనకు కేజీవీలో సీటు వస్తే చదువుకుంటాను అని జెస్సీ చెప్పిన మాటలు మీడియాలో రావడంతో దీనిపైన సోషల్‌ మీడియా వేదికగా మంత్రి నారా లోకేష్‌ స్పందించారు. మరో సారి స్పూర్తిగా నిలిచారు.

కేజీబీవీలో సీటు రాలేదని పత్తి పొలాల్లో కూలీగా వెళుతున్న జెస్సీ కథనం నన్ను కదిలించింది. చదువుకోవాలనే జెస్సీ ఆశను వెలుగులోకి తీసుకొచ్చిన మీడియాకు అభినందనలు. అధికారులతో మాట్లాడాను. చిట్టి తల్లీ! కేజీబీవీలో నీకు సీటు వస్తుంది. నిశ్చింతగా చదువుకో! పరిస్థితులు ఏమైనా కానీ పుస్తకాలు, పెన్ను పట్టాల్సిన చేతులు పత్తి చేలో మగ్గిపోవడం బాధాకరం. మీరు పిల్లలను బడికి పంపితే తల్లికి వందనం వస్తుంది. చక్కనైన యూనిఫామ్, పుస్తకాలు, బ్యాగు, బూట్లు, సాక్సులు, బెల్టు ఇస్తున్నాం. సన్న బియ్యంతో మధ్యాహ్న భోజనం పెడుతున్నాం. మనబడిలో పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించి ప్రయోజకులుగా తీర్చిదిద్దే బాధ్యత మాది. పిల్లల భద్రత –భవితకు భరోసానిచ్చే బడికి మించిన సురక్షిత ప్రదేశం లేదు. విద్యకు పిల్లలను దూరం చేయొద్దని తల్లిదండ్రులను వేడుకుంటున్నాను.. అంంటూ మంత్రి నారా లోకేష్‌ పేర్కొన్నారు.
Tags:    

Similar News