ఉచితంగా ఆవులిస్తా..దేవునికి డెయిరీని పెట్టండి: ఓ నాయకుడు సీఎంకు లేఖ

లడ్డూ వివాదం నేపథ్యంలో కోట్ల రూపాయలు ఆదాయం వచ్చే తిరుమల తిరుపతి వెంకటేశ్వరుడికి సొంత డెయిరీ ఎందుకు లేదనేది చర్చగా మారింది.

Update: 2024-10-06 09:19 GMT

తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి లడ్డూ వివాదం నేపథ్యంలో ఆవులను ఉచితంగా ఇస్తానంటూ ఒక నాయకుడు ముందుకొచ్చారు. వెయ్యి ఆవులను దేవుడికి ఉచితంగా ఉస్తానని, వాటితో టీటీడీ వాళ్లు సొంతంగా డైరీ ఏర్పాటు చేసి తద్వారా వచ్చే నెయ్యితో లడ్డూలు తయారు చేయాలని సూచించారు భారత చైతన్య యువజన పార్టీ అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్‌. ఆ మేరకు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి ఆయన శనివారం ఓ లేఖ రాశారు. ఇది ఇప్పుడు సంచలన టాపిక్‌గా మారింది. టీటీడీ కోసం వెయ్యి ఆవులను ఉచితంగా ఇస్తా.. మరో లక్ష ఆవులను ఉచితంగా సమకూరుస్తా, వెంటనే డైరీని ఏర్పాటు చేయండిని లేఖలో కోరారు.

రోజుకు సగటున లక్ష మంది భక్తులు టీటీడీకి వస్తుంటారు. సుమారు రూ. 5 కోట్ల ఆదాయం వస్తుంది. ఇంత ఆదాయం వచ్చే తిరుమల క్షేత్రంలో సొంతంగా డెయిరీని ఎందుకు ఏర్పాటు చేయలేము. ఒక సారి ఆలోచించండిని కోరారు. స్వామి వారి చెంతనే ఆవులను పెంచి, పోషించి, పాల ఉత్పత్తి ద్వారా నెయ్యి తయారు చేసి ఆ స్వామి వారి పూజ, దీప, నైవేద్యాలు, లడ్డూ ప్రసాదాల తయారీలో వాడితే అంతకంటే మహద్బాగ్యం మరొకటి ఉండదు. బయట కొనుగోలు చేసే కంటే సొంతంగా నెయ్యిని తయారు చేసుకోవడం ఉత్తమ మార్గమని లేఖలో పేర్కొన్నారు. మీ ప్రభుత్వం దీనికి సిద్ధమైతే నేనే స్వయంగా నా తరపున వెయ్యి గోవులను ఇస్తాను. మరో లక్షల గోవులను ఉచితంగా సమకూర్చే బాధ్యతను తీసుకుంటానని లేఖలో వెల్లడించారు.

లక్ష గోవులతో రోజుకు 10లక్షల లీటర్ల ఆవు పాలు ఉత్పత్తి చేయొచ్చు. రోజుకు 50వేల కిలోల వెన్న తీసి, 30వేల కేజీల నెయ్యిని తయారు చేయొచ్చు. దీనిలో వెంకటేశ్వర స్వామి అవసరాలకు సగం వాడుకున్నా, మిగిలిన దానిని రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాలకు సరఫరా చేసి కల్తీ నెయ్యి సమస్యను నివారించొచ్చని లేఖలో పేర్కొన్నారు.

Tags:    

Similar News