Pawan Kalyan - YCP | 'సీమ'లో తిష్ట వేస్తా: పవన్ మాస్ వార్నింగ్

వైసీపీ నేతలు పద్ధతి మార్చుకోవాలి. లేదంటే కడపలో క్యాంప్ ఆఫీస్ ఏర్పాటు చేసుకుని, మీ భరతం పడతానని డిప్యూటీ సీఎం ఘాటు హెచ్చరిక చేశారు.

Byline :  SSV Bhaskar Rao
Update: 2024-12-28 14:26 GMT

కడప జిల్లా పర్యటనలో మాజీ సీఎం వైఎస్. జగన్ పేరు ప్రస్తావించకుండా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మాస్ వార్నింగ్ ఇచ్చారు. అధికారం పోయిన వైసీపీకి అహంకారం, పొగరు తగ్గలేదని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘాటుగా వ్యాఖ్యానించారు. రాయలసీమ ఎవరి జాగీరు కాదు. పద్ధతులు మార్చుకోవాలి అని ఆయన తీవ్రస్థాయిలో హెచ్చరికలు జారీ చేశారు. ఈ ఘటనపై క్యాబినెట్ లో చర్చిస్తాం. పూర్తి నివేదిక సీఎం చంద్రబాబు, హోమంత్రి వంగలపూడి అనిత, డీజీపీ ద్వారకా తిరుమలరావు టేబుల్ పైకి చేరాలని ఎస్పీని ఆదేశించారు.

అన్నమయ్య జిల్లా (కడప జిల్లా) రాయచోటి నియోజకవర్గం గాలివీడు ఎంపీడీవో జవహర్ బాబుపై దాడి ఘటన నేపథ్యంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శనివారం ఉదయం కడపకు చేరుకున్నారు. కడప రిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఎంపీడీవో జవహర్ బాబును పవన్ కళ్యాణ్ పరామర్శించారు. ఆయన భార్య, కూతురు, కొడుకు తో కూడా పవన్ కళ్యాణ్ ఆసుపత్రిలోనే వ్యక్తిగతంగా మాట్లాడి ధైర్యం చెప్పారు. ప్రభుత్వ శాఖల సిబ్బందిలో ఆత్మస్థైర్యం నింపడానికి పవన్ కళ్యాణ్ క్షేత్రస్థాయికి వచ్చారు.

గాలివీడులో దర్బార్..
కడప నుంచి రోడ్డు మార్గంలో ఆయన ఎంపీడీవో జవహర్ బాబు దాడికి గురైన గాలివీడు మండల కేంద్రానికి చేరుకున్నారు. గురువారం ఎంపీడీవో కార్యాలయంలో జవహర్ బాబుపై దాడి ఘటనను సిబ్బంది, జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి, ఎస్పీ విద్యాసాగర్ నాయుడు తోపాటు ప్రత్యక్ష సాక్షులతో ఆయన స్వయంగా మాట్లాడారు. అనంతరం అక్కడ ప్రజలు, మీడియాతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే..
కడపలో క్యాంప్ ఆఫీస్
"మీ పద్ధతులు మార్చుకోకుంటే, మిమ్మల్ని గాడిలో పెట్టడానికి కడపలోనే మకాం వేస్తా. అక్కడే క్యాంప్ ఆఫీస్ కూడా ప్రారంభిస్తా" అని మాజీ సీఎం వైఎస్. జగన్ పేరు ప్రస్తావించకుండానే డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హెచ్చరించారు. తాను ప్రాతినిధ్యం వహించే పంచాయతీరాజ్ సిబ్బంది అధికారులపైనే కాదు. ప్రభుత్వ అధికారుల తో అమర్యాదగా వ్యవహరిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని డిప్యూటీ సీఎం ఆయన ఓ స్థాయిలో మాట్లడారు.
" రాయలసీమ ఎవరి జాగీరు కాదు. ప్రజలు, అధికారుల అభిప్రాయాలకు విలువ ఇవ్వండి. వారికి గౌరవ, మర్యాదలు ఇవ్వండి. లేదంటే పరిస్థితి వేరుగా ఉంటుంది" అని పవన్ కల్యాణ్ అల్టిమేటం ఇచ్చారు.
"రాయలసీమలో మీ పద్ధతులు మార్చుకోండి. లేదంటే కడపలోనే క్యాంప్ కార్యాలయం ఏర్పాటు చేసుకుంటా" అని కూడా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. అధికారంలో ఉన్నాం. నాకు బాధ్యత ఉంది. పద్ధతి కాదు కాబట్టే మర్యాదకరమైన భాషలో చెబుతున్న అని వైసీపీ నాయకులను ఉద్దేశించి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. ఎందుకంటే ఐదేళ్లపాటు క్షేత్రస్థాయిలో కార్యకర్తలు నాయకులు, పార్టీ బాధితులు నిర్వహించిన మేమంతా నలిగి, నలిగిపోయి వచ్చాం. మా సహనాన్ని పరీక్షించవద్దు అని కూడా ఆయన వైసీపీ నాయకులకు సూచించారు.
మీ ప్రభుత్వంలో అరాచకాలు, వేధింపులు, కేసులు అన్నిటినీ తట్టుకునే ఇందాక వచ్చాం. ఇక ఉపేక్షించేది లేదని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.
కులాలు ఆపాదించను
గాలివీడు ఎంపీడీవో జవహర్ బాబుపై జరిగిన దాడి ఘటన నేపథ్యంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. జవహర్ బాబు దళితులు కావచ్చు. అంతమాత్రాన ఏ ఘటనను ఓ కులానికి ఆపాదించబోను అని అన్నారు. ఎంపీడీవోపై దాడి చేయడంలో ప్రధాన నిందితుడు అయిన ఎంపీపీ పద్మావతమ్మ కొడుకు సుదర్శనరెడ్డి అరాచకాలు అన్ని నా దృష్టికి వచ్చాయని పవన్ కళ్యాణ్ చెప్పారు
వైసీపీ నాయకుడుగా సుదర్శనరెడ్డి గత ఐదేళ్లలో దివ్యాంగుడైన ప్రతాప్ పైన దాడి చేశాడు. శ్రీనివాసరెడ్డిపై అదే పరిస్థితి. షెడ్యూల్ తెగలకు చెందిన శేఖర్ నాయక్ పై కూడా దాడి చేసి పైశాచిక ఆనందం అనుభవించాడు. అంటే " గాలివీడులో వైసీపీ నేత సుదర్శనరెడ్డి, ఆయన అనుచరుల ఆగడాలు మితిమిరాయి. ఈ వివరాలన్నీ నా దగ్గర ఉన్నాయి. ఆక్రమణల వ్యవహారం కూడా నా నోటీసులో ఉంది. వీటిని ఉపేక్షించే సమస్య లేదు. ఎంపీడీో జవహర్ బాబుపై దాడికి పాల్పడిన వారిలో ముగ్గురిని మాత్రమే అరెస్ట్ చేశారు. మిగతా 9 మందిని కూడా జైలుకు పంపించడానికి చర్యలు తీసుకోండి" అని అన్నమయ్య జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి, ఎస్పీ విద్యాసాగర్ నాయుడును ఆదేశించారు.
ఉపాధి సిబ్బంది కాపాడారు..
గాలివీడు ఎంపీడీవో జవహర్ బాబు ను కాపాడడంలో ఆఫీస్ సబార్డినేట్ కొడుకు ఇమ్రాన్, డ్రైవర్ సంతోష్, గాలివీడు వీఆర్వో లక్ష్మీ ప్రసన్న తో పాటు ఉపాధి సిబ్బంది అక్కడ ఉండబట్టి బతికిపోయాడని, లేదంటే పరిస్థితి ఊహించుకోవడానికి భయంకరంగా ఉందని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. మేము ప్రభుత్వంలో ఉన్నాం పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే ఇక ఉపేక్షించేది లేదని ఆయన ప్రతిపక్ష వైసిపి నాయకులు, ఆక్రమణలు, దాడులకు పాల్పడుతున్న వారి అనుచరులకు హెచ్చరిక జారీ చేశారు.
భవిష్యత్తు లేకుండా చేస్తా
రాష్ట్రంలో గత ఐదేళ్లు గాడి తప్పిన పాలనా వ్యవహారాలను చక్కదిద్దడానికి ఇంతవరకు సమయం కేటాయించామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గుర్తు చేశారు. మీ ఆగడాలన్నీ తెలుసు. మా సహనానికి పరీక్ష పెట్టవద్దు. కాదని జలుం చేస్తే మాత్రం ఒక్కొక్కరికి భవిష్యత్తు మార్చడానికి ఏమాత్రం వెనుకాడేది లేదని వైసీపీ నాయకులకు పవన్ కళ్యాణ్ అల్టిమేటం ఇచ్చారు. మీకు భవిష్యత్తు లేకుండా చేస్తా అని చెప్పకనే చెప్పారు. ఇక మీ ఆగడాలను భరించే స్థితిలో కూటమి ప్రభుత్వం లేదని ఆయన వ్యాఖ్యానించారు. మీ వైసీపీ ఆగడాలు పరాకాష్టకు చేరాయి. వాటిని ఇకపై ఏమాత్రం ఉపేక్షించేది లేదని కూడా పవన్ కళ్యాణ్ తెగేసి చెప్పారు.
ఎంపీపీకి 14 రోజులు గడువు

గాలివీడు మండలానికి 70 కోట్ల రూపాయల ఉపాధి పనులు మంజూరయ్యాయి. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు సంక్రాంతిలోపు పనులన్నీ చేపట్టాల్సిన అవసరం ఉంది. దీనికి మండల పరిషత్ తీర్మానం అవసరమని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గుర్తు చేశారు.
ఈ పనులకు ఎంపీపీ పద్మావతమ్మ సారథ్యంలోని ఎంపీటీసీలు అనుమతి ఇవ్వకుండా అడ్డుపడుతున్నారనే విషయం తన దృష్టికి వచ్చిందని పవన్ కళ్యాణ్ చెప్పారు. తల్లి చాటున ఆమె కొడుకు సుదర్శన్ రెడ్డి వ్యవహారం సాగిస్తున్నారని, ఇకపై ఇది సాగదని ఆయన హెచ్చరించారు.
"పనులు చేసేందుకు వీలుగా తీర్మానానికి ఎంపీపీకి 14 రోజుల గడువు ఇస్తూ నోటీసులు ఇవ్వండి" అని అన్నమయ్య జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరికి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆదేశాలు జారీ చేశారు. ఎంపీపీ సారధ్యంలో తీర్మానం చేయకుంటే, కలెక్టర్ హోదాలో ఓవర్ రైట్ చేసి విచక్షణ అధికారాలు ఉపయోగించడం ద్వారా పనులు చేపట్టాలని ఆయన స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అంతకుముందు గాలివీడులో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు పోలీసులు గౌరవ వందనం సమర్పించారు.
Tags:    

Similar News