‘లెనిన్’ పేరెందుకు పెట్టారు
బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్ బాధ్యతలు స్వీకరించారు.;
By : The Federal
Update: 2025-07-09 09:56 GMT
విజయవాడ లెనిన్ సెంటర్‌కు లెనిన్ పేరు పెట్టాల్సిన అవసరం ఏంటని ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ ప్రశ్నించారు. భారత దేశానికి లెనిన్‌కు సంబంధం ఏంటని, భారత దేశానికి లెనిన్‌కు సంబంధం లేనప్పుడు లెనిన్ సెంటర్‌కు లెనిన్ పేరు పెట్టాల్సిన అవసరం ఏంటని మాధవ్ ప్రశ్నించారు. లెనిన్ సెంటర్‌కు లెనిన్ పేరు మార్చి ప్రముఖ కవి విశ్వనాథసత్యనారాయణ పేరు పెట్టాలని పీవీఎన్ మాధవ్ డిమాండ్ చేశారు.
విజయవాడలో బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడిగా పీవీఎన్ మాధవ్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. దాని కంటే ముందు విజయవాడ తుమ్మలపల్లి క్షళాక్షేత్రం నుంచి బీజేపీ రాష్ట్ర కార్యాలయం వరకు బీజేపీ శ్రేణులతో కలిసి మాధవ్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మాధవ్.. లెనిన్ సెంటర్‌లోని విశ్వనాథసత్యనారాయణకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా లెనిన్ సెంటర్‌కు లెనిన్ పేరు తొలగించి విశ్వనాథసత్యనారాయణ పేరు పెట్టాలన్నారు. ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టని పీవీఎన్ మాధవ్‌కు ఆ పార్టీ ఎంపీ, ఏపీ బీజేపీ మాజీ అధ్యక్షులు దగ్గుబాటి పురందేశ్వరి, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, మంత్రి సత్యకుమార్ యాదవ్ తదితర నాయకులు అభినందనలు తెలిపారు.