సెప్టెంబరు నెలలో జీఎస్టీ వసూళ్లలో ఏపీ టాప్ ఎందుకని?

ప్రభుత్వ ప్రచారం వెనుక దాగిన వాస్తవాలు ఏమిటి? జీఎస్టీ వసూళ్లు ఏపీలో ఎందుకు ఎక్కవగా జరిగాయి.

Update: 2025-10-04 05:05 GMT

సెప్టెంబర్ నెలలో ఏపీలో నికర జీఎస్టీ వసూళ్లు రూ. 2,789 కోట్లకు చేరి చారిత్రక రికార్డును సృష్టించాయి. స్థూల వసూళ్లు రూ. 3,653 కోట్లకు చేరి, రెండవ అత్యధిక రికార్డుగా నిలిచాయి. ఇది కేవలం సంఖ్యలు కాదు, ఆర్థిక కార్యకలాపాల దృఢత్వాన్ని సూచిస్తున్నాయి. గత సంవత్సరం సెప్టెంబర్ 2024తో పోల్చితే, నికర వసూళ్లు 7.45 శాతం, స్థూల వసూళ్లు 4.19 శాతం పెరిగాయి. మరోవైపు సెప్టెంబర్ 2023తో పోలిస్తే 12.67 శాతం వృద్ధి గమనార్హం. ఈ గణాంకాలు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో ఉత్తేజాన్ని నింపాయి. ఏపీలో జీఎస్టీ వసూళ్లు, ప్రభుత్వ ప్రచారం, శ్లాబుల తగ్గింపు పరిణామాలు వంటి అంశాలపై చర్చించాల్సిన అవసరం ఉంది.

ఆంధ్రప్రదేశ్‌లో సెప్టెంబర్ 2025లో జీఎస్టీ వసూళ్లు గణనీయంగా పెరిగి 7.45 శాతం వృద్ధిని నమోదు చేశాయి. ఇది గతంలో ఎన్నడూ లేని అత్యధిక రికార్డు. అయితే ఈ వృద్ధి వెనుక కేంద్ర ప్రభుత్వం ఆగస్టులో విడుదల చేసిన జీఎస్టీ 2.0 సంస్కరణలు, రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పన్ను వసూళ్లు ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి. అదే సమయంలో ఈ మేలు ప్రజలకు చేకూర్చినట్లు ప్రచారం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ర్యాలీలు, ట్రాక్టర్ ర్యాలీలు నిర్వహిస్తోంది. ఈ పరిణామాలను పరిశీలిస్తే ప్రజలు, వ్యాపారులు ఈ వసూళ్ల వృద్ధిని ఎలా అర్థం చేసుకోవాలి? ఇది నిజమైన ఆర్థిక పునరుద్ధరణ సూచికా, లేక ప్రభుత్వ ప్రచార ఆటమా? అనే చర్చ ప్రజల్లో ఉంది.

రాష్ట్ర పన్నుల విభాగం ప్రధాన కమిషనర్ బాబు.ఎ ఒక ప్రకటన విడుదల చేస్తూ సెప్టెంబర్ నెలలో నికర జీఎస్టీ వసూళ్లు రూ. 2,789 కోట్లకు చేరినట్లు తెలిపారు. గత చరిత్ర రికార్డును ఈ వసూళ్లు బద్దలు కొట్టాయన్నారు. స్థూల వసూళ్లు రూ. 3,653 కోట్లకు చేరి, రెండవ అత్యధిక రికార్డుగా నిలిచాయి. ఇవి కేవలం సంఖ్యలు కాదు, ఆర్థిక కార్యకలాపాల దృఢత్వాన్ని సూచిస్తున్నాయి. సెప్టెంబర్ 2024తో పోల్చితే, నికర వసూళ్లు 7.45 శాతం, స్థూల వసూళ్లు 4.19 శాతం పెరిగాయి. మరోవైపు, సెప్టెంబర్ 2023తో పోలికలో 12.67 శాతం వృద్ధి గమనార్హం. ఈ గణాంకాలు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో ఉత్తేజనాన్ని తెలియజేస్తున్నాయి. కేంద్ర జీఎస్టీ 2.0 సంస్కరణలు అనేక లావాదేవీలపై పన్ను రేట్లను తగ్గించినప్పటికీ జీఎస్టీ వసూళ్లు పెరగటం గమనార్హం.

ఈ వృద్ధి ఎలా సాధ్యమైంది?

జీఎస్టీ వ్యవస్థలోని మార్పులు. కేంద్ర ప్రభుత్వం ఆగస్టు 2025లో ప్రవేశపెట్టిన జీఎస్టీ 2.0 ద్వారా పలు వస్తువులు, సేవలపై పన్ను శాతాలు తగ్గడం వల్ల వ్యాపార లావాదేవీలు మందగించినప్పటికీ, మిగిలిన రంగాల్లో పెరిగిన కార్యకలాపాలు వసూళ్లను పెంచినట్లు జీఎస్టీ కమిషనర్ బాబు ఏ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా సెప్టెంబర్‌లో నాలుగు స్లాబుల నుంచి రెండు స్లాబులకు తగ్గించి, ప్రజలకు ఆదా కల్పించినట్లు ప్రకటించింది. ఫలితంగా వ్యవసాయ రంగ పరికరాల కొనుగోళ్లలో రైతులకు గణనీయమైన లాభం జరిగినట్లు అధికారులు చెబుతున్నారు. ప్రధాన కమిషనర్ బాబు. ఏ. వ్యాఖ్యల ప్రకారం ఈ స్లాబు తగ్గింపు వల్లే గత నెలలో ఆదాయం పెరిగిందని, ఇది ప్రభుత్వ విధానాల విజయమని స్పష్టం చేశారు.

ఈ విషయంలో ఒక ఆసక్తికరమైన వైరుద్యం ఉంది. జీఎస్టీ వసూళ్లు ప్రభుత్వమే నాలుగు స్లాబుల ద్వారా చేపట్టింది. తర్వాత రెండు స్లాబులు తగ్గించి, "ప్రజలకు మేలు చేశాం" అని ప్రచారం చేస్తున్నది కూడా అదే ప్రభుత్వం. ఈ మేరకు అక్టోబర్ 3న రాష్ట్రవ్యాప్తంగా ర్యాలీలు, ప్రచార కార్యక్రమాలు చేపట్టారు. మంత్రులు, ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో ఈ 'మేలు'ను పండుగలా జరుపుతున్నారు. శుక్రవారం మండల కేంద్రాల్లో ట్రాక్టర్ ర్యాలీలు నిర్వహించి, రైతులతో ప్రభుత్వం చేసిన మంచిని ప్రచారం చేయించారు. అధికారులు కూడా ఈ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొని, స్లాబు తగ్గింపు వల్ల ఆదా జరిగినట్లు చెబుతున్నారు.

ప్రజలు, వ్యాపారులు ఈ వసూళ్ల వృద్ధిని రెండు కోణాల నుంచి అర్థం చేసుకోవాలి. మొదట సానుకూల దృక్పథం. జీఎస్టీ 2.0 స్లాబు తగ్గింపులు వల్ల వ్యాపార లావాదేవీలు మందగించినప్పటికీ, మిగిలిన రంగాల్లో పెరిగిన కార్యకలాపాలు (వ్యవసాయం, చిన్న వ్యాపారాలు) వసూళ్లను పెంచాయి. ఇది రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ బలోపేతాన్ని సూచిస్తుంది. రైతులకు వ్యవసాయ పరికరాలపై 5-10 శాతం ఆదా జరిగినట్లు అంచనా. ఇది గ్రామీణ ఆర్థికాలకు సానుకూలం. రెండవది విమర్శనాత్మక దృక్పథం. ప్రభుత్వం తనే పెంచిన పన్నులను తగ్గించి 'మేలు' చేసినట్లు ప్రచారం చేయడం రాజకీయ ఆట. ఈ ర్యాలీలు, ప్రచారాలు ఎన్నికల ఆవరణలో ఓటర్లను ఆకర్షించడానికి ఉపయోగపడతాయి. కానీ నిజమైన ప్రయోజనాలు ఎంతవరకు చేరుకుంటాయో ప్రశ్నార్థకం. వ్యాపారులు ఈ తగ్గింపుల వల్ల తమ లాభాలు పెరిగాయా? లేక పెరిగిన వసూళ్లు మాత్రమే ప్రభుత్వ ఆదాయాన్ని పెంచాయా? అని పరిశోధించాలి.

సెప్టెంబర్ జీఎస్టీ రికార్డు రాష్ట్ర ఆర్థిక పునాదుల బలాన్ని తెలియజేస్తుంది. కానీ ప్రచార హైప్ వెనుక దాగిన వాస్తవాలను ప్రజలు వివేచనాత్మకంగా చూడాలి. ఈ సంస్కరణలు దీర్ఘకాలికంగా ఆర్థిక వృద్ధికి దోహదపడతాయా? లేక తాత్కాలిక ప్రచారానికి మాత్రమేనా? భవిష్యత్తు వసూళ్లు ఈ ప్రశ్నలకు సమాధానాలు ఇస్తాయి.

పన్ను పరిధి విస్తరణ

సెప్టెంబర్ 2024 తో పోల్చితే నికర జీఎస్టీ వసూళ్లు గణనీయంగా పెరగడం, పన్ను చెల్లింపుల్లో మెరుగైన క్రమశిక్షణ, సమర్థవంతమైన ఐజీఎస్టీ సెటిల్‌మెంట్లు, అలాగే పన్ను పరిధి క్రమంగా పెరగడం వల్ల సాధ్యమైందని బాబు చెప్పారు. ప్రభుత్వం అమలు కట్టుదిట్టం చేయడం, పన్ను చెల్లింపుదారుల సేవలను మెరుగుపరచడం, డేటా విశ్లేషణ వినియోగించడం వంటివి స్వచ్ఛంద అనుసరణలను పెంచి ఆదాయాన్ని బలోపేతం చేశాయని పేర్కొన్నారు.

ప్రొఫెషనల్ టాక్స్ వసూళ్ల లో వృద్ధి

సెప్టెంబర్ 2025 లో ప్రొఫెషనల్ ట్యాక్స్ వసూళ్లలో 43.75శాతం పెరుగుదల నమోదు అయిందని జీఎస్టీ కమిషనర్ బాబు ఎ తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరంలో సెప్టెంబర్ 2025 వరకు లెక్కిస్తే, గత సంవత్సరం ఇదే కాలంతో పోల్చితే 51.51% అధిక వసూళ్లు నమోదయ్యాయన్నారు. దీనికి ప్రధానంగా విస్థృత ప్రచారం, సమర్థవంతమైన అమలు విధానాలు అమలు దోహదపడ్డాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న పటిష్టమైన చర్యలు వల్ల ఆశించిన ఫలితాలు వస్తున్నాయని అంతేకాకుండా పన్నుల వసూళ్లల్లో కట్టుదిట్టమైన చర్యలు, సర్ధుబాటు విధానాల మెరుగు, డేటా విశ్లేషణ ఆధారిత ఆడిట్లు, నిర్ధిష్ట లక్ష్యాల అమలు వల్ల 2025 సెప్టెంబర్ లో స్థూల (Gross), నికర (Net) జీఎస్టీ వసూళ్లు రెండూ రికార్డు వృద్ధి సాధించింటం జరిగిందన్నారు.

పనితీరు ఆధారిత బదిలీలు

అధికారుల పనితీరు డేటాను సేకరించి విశ్లేషించడం ద్వారా, అధిక ఆదాయ సామర్థ్యం కలిగిన ప్రాంతాల్లో ఉత్తమ పనితీరు కనబరిచిన అధికారులను నియమించామని బాబు.ఎ తెలిపారు. బదిలీలు మెరిట్, సామర్థ్యం, ప్రాంతాల వారీగా ఆదాయ వసూళ్లు ఆధారంగా జరిగాయి. పన్ను వసూళ్ల సామర్థ్యం, రిటర్న్‌ ఫైలింగ్‌ రేట్లు, అమలు చర్యల ఫలితాలు, శాఖ లక్ష్యాలకు అనుగుణంగా చేపట్టామని చెప్పారు.

డీఫాల్టర్లపై ప్రత్యేక డ్రైవ్

గత ఆర్థిక సంవత్సరంలో గణనీయ పన్ను చెల్లింపులు చేసినప్పటికీ, ప్రస్తుత సంవత్సరంలో రిటర్నులు సమర్పించని గుర్తించినట్లు బాబు చెప్పారు. వీరిపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించడం ద్వారా అధిక మొత్తంలో పన్ను చెల్లించాల్సిన డీఫాల్టర్లను తిరిగి పన్ను వ్యవస్థలోకి తీసుకువచ్చామన్నారు.

Tags:    

Similar News